breaking news
mrps state president
-
మాటతప్పిన బాబును గద్దెదించుతాం
ఆమదాలవలస: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాదిగల చైతన్య రథా యాత్ర ఆమదాలవలస పట్టణానికి చేరుకుంది. ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు లోపింటి నారాయణరావు, అధ్యక్షుడు యందవ నారాయణరావు ఆధ్వర్యంలో మాదిగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 420 అని విమర్శించారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పించి, పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని ధ్వజమెత్తారు. మాటతప్పిన చంద్రబాబును గద్దె దించడానికి జాతి నాయకులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 12న ఢిల్లీలో జరగనున్న మహా ధర్నాకు మాదిగ నాయకులంతా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వైఎస్ రాజు మాదిగ, జిల్లా నాయకులు సవలాపురపు భాస్కరరావు, నవిరి గణేష్, లోపింటి తేజేశ్వరరావు, సిరిపురపు తవుడు, పెంకి రవి, సిరిపురపు రాంబాబు, నవిరి చిన్న, నవిరి గురుమూర్తి, కురమాన రాజు, కంటిపాక పార్వతి ఉంగటి రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పెద్ద మాదిగ’ హామీని నిలబెట్టుకోవాలి
- దండు వీరయ్య మాదిగ డిమాండ్ ఒంగోలు సెంట్రల్ : ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్దమాదిగను అవుతానని చెప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా ఎస్సీ వర్గీకరణపై చర్చించలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వర్గీకరణకు చట్టబద్ధత ఆలస్యం అవుతోందన్నారు. ఈ విషయంలో మాదిగ ప్రజా ప్రతినిధులు చంద్రబాబును నిలదీయాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి లాం డానియేలు మాదిగ, చాట్ల డానియేలు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి తాతపూడి ప్రభుదాస్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాకబ్ పాల్ మాదిగ, మంటి ఆశీర్వాదం మాదిగ, ప్రకాశం జిల్లా ఇన్చార్జి జండ్రాజుపల్లి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి సండ్రపాటి కాలే బు మాదిగ, పూనూరి నరేంద్ర మాదిగ పాల్గొన్నారు.