breaking news
money and investing
-
పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి. -
నెమ్మదించనున్న ట్రాక్టర్ల అమ్మకాలు : మాగ్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని, అది ఈ ఏడాది 5 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎన్బీఎఫ్సీ మాగ్మా ఫిన్‌కార్ప్ పేర్కొంది. ఎలినెనో, వర్షాలు ఆలస్యంగా కురవడం కారణంగా ఖరీప్ పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల అమ్మక విభాగ అధిపతి ధృబషీష్ భట్టాచార్య తెలిపారు. గతేడాది రబీ పంటలు బాగుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసిక అమ్మకాలు బాగున్నాయని, కాని రెండో అర్థభాగం నుంచి అమ్మకాలు తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టాచార్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినా, మాగ్మా ఫిన్‌కార్ప్ ట్రాక్టర్ల రుణాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో గతేడాది రూ.562 కోట్ల రుణాలను ఇచ్చామని, ఈ ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాపారంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూ. 500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు అనుమతించిందని, అవసరమైనప్పుడు ఈ నిధులను సమీకరిస్తామన్నారు. తెలంగాణాలో 12, ఆంధ్రాలో 12 శాఖలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లో శాఖల సంఖ్యను పెంచే ఆలోచన లేదన్నారు. -
ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 3 విభిన్న కాలవ్యవధులున్న డిపాజిట్లపై 3.25 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. కొత్త రేట్లు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్ పేర్కొంది. తాజా చర్యలతో 31-45 రోజుల వ్యవధిగల డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడున్న 6% నుంచి 9.25%కి పెరిగింది. 46-90 రోజుల డిపాజిట్లపై 8.5% నుంచి 9.5%కి; 91-179 రోజుల డిపాజిట్లపై 8.75% 9.75%కి రేట్లను పెంచినట్లు వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్ బేస్‌రేటు కూడా..: అలహాబాద్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు) 0.05 శాతం పెరుగుదలతో 10.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలతో సహా అన్ని కొత్త రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేనా బ్యాంకు ఎఫ్సీఎన్ఆర్ రేట్ల సవరణ.. ఎఫ్సీఎన్ఆర్(ఫారిన్ కరెన్సీ నాన్-రిపాట్రియబుల్) (బి), ఆర్ఎఫ్సీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను దేనా బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల దాకా వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 2.57 శాతం నుంచి 2.55 శాతానికి, 4 నుంచి 5 ఏళ్ల దాకా డిపాజిట్లపై 5.24 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గించింది.