breaking news
MLA Anita
-
టీటీడీ పాలక మండలి నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలిలో సభ్యురాలిగా తన నియామకంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో పాలకమండలి నుంచి తప్పుకుంటున్నట్టు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీన్ని ఆదివారం తన నివాసం నుంచి ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. -
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బాబూరావు పాయకరావుపేట: పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మంత్రి కావాలనే ఉద్దేశ్యంతో తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా అసెంబ్లీలో లేవనెత్తుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆరోపించారు. పాయకరావుపేటలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడుతూ అనిత తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా చూపించి మొసలి కన్నీరు పెట్టడం సమంజసం కాదన్నారు. ఆమె నియోజకవర్గ ప్రజల కోసం కన్నీరు కారిస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సింది పోయి నా కుటుంబానికి ,నా పిల్లలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. నగిరి ఎమ్మెల్యే రోజా ఆమెను అవమానపర్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మాటలను అనిత అన్వయించుకుని సమస్య లేవదీయడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసి, రావెల కిశోర్ మంత్రి పదవిని కాజేసేందుకు ఆమె వేసిన ఎత్తున అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న సభ తీరు చూస్తే కౌరవులు, పాండవుల మధ్య యుద్ధంలా ఉందని, అంతిమ విజయం వైఎస్సార్ సీపీదేనని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన వెంట నాయకులు ధనిశెట్టి కృష్ణ, బి.వి.రమణ తదితరులు ఉన్నారు. -
పేట టీడీపీలో తిరుగుబాటు
ఎమ్మెల్యే అనితపై ధ్వజం మంత్రి గంటాపై విమర్శనాస్త్రాలు పాయకరావుపేటలో అసమ్మతి సమావేశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పప్పలతో భేటీ 14న సీఎం వద్ద పంచాయితీ విశాఖపట్నం: జిల్లా టీడీపీలో పుట్టిన ముసలం పదునెక్కుతోంది. టీడీపీని నిలువునా చీల్చేస్తోంది. గంటా, అయ్యన్నవర్గాలుగా కత్తులు నూరుతున్న టీడీపీ వర్గరాజకీయం రోడ్డున పడింది. అందుకు పాయకరావుపేట నియోజకవర్గం వేదికగా మారింది. జిల్లాలో మంత్రి గంటా వర్గంలో కీలకంగా ఉన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసమ్మతివర్గం ప్రత్యేకంగా సమావేశమై తాడోపేడో తేల్చుకునేందుకు సంసిద్ధమయ్యారు. మంత్రి గంటా అండ చూసుకునే ఎమ్మెల్యే అనిత నేతలు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు 14న సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో బయటపడ్డ టీడీపీ వర్గ విభేదాలు జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా నిలుస్తున్నాయి. పార్టీని ముంచుతున్న తీరు.. నియోజకవర్గ టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించారు. నాలుగు మండలాలకు చెందిన దాదాపు 150మంది పాయకరావుపేటలో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేతలు, కార్యకర్తలను ఎమ్మెల్యే గుర్తించడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. నక్కపల్లి మండలంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవితోపాటు ఐదు పదవులు ఇచ్చిన విషయాన్ని ఉదాహరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైపోతుందని కూడా తేల్చిచెప్పారు. మంత్రి గంటాపై ధ్వజం మంత్రి గంటా అండదండలు చూసుకునే ఎమ్మెల్యే ఖాతరు చేయడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడం వెనుక మంత్రి గంటా హస్తం ఉందని కూడా ఆరోపించారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం అధికారులతో కలసి బలవంతపు భూసేకరణకు సిద్ధపడటమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా మంత్రి గంటా సూచనల మేరకే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడోపేడో తేల్చుకుంటాం ఈ సమావేశం అనంతరం పాయకరావుపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు యలమంచిలి వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు పప్పల చలపతిరావుతో భేటీ అయ్యారు. డీసీసీబీ డెరైక్టర్ గెడ్డం కన్నబాబు, గెడ్డం బుజ్జి, గొర్రెల రాజబాబు, గెడ్డం రమేష్, బొల్లం సూర్యచలపతి, దేవవరపు శివ, కొండయ్య, సీతారాం తదితరులు పప్పల చలపతిరావును కలిసి ఎమ్మెల్యే అనిత తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. వారిని శాంతింపజేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. సీఎం చంద్రబాబుతో తమకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ఆయన వద్దే ఎమ్మెల్యే అనిత సంగతి తేల్చుకుంటామమన్నారు. దాంతో 14న సీఎం చంద్రబాబుతో కలిపిస్తానని చలపతిరావు వారికి హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తలు కొంత శాంతించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై కాసేపు చర్చించుకుని వెనుదిరిగారు. జిల్లా టీడీపీని ఓ కుదుపు కుదిపిన ఈ పరిణామం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది. -
వీఐపీ రిపోర్టర్ : పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత