breaking news
Misbah-Ul Haq
-
పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా!
పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు.అసలేం జరిగింది?లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు.పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు కేవలం 10 మ్యాచ్‌ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది.జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా.2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ పదవిపాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం పీసీబీలో పలు కీలక పదవులు నిర్వహించాడు. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ సహా చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికయ్యాడు. అయితే కోచింగ్ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి 2020 అక్టోబర్‌లో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2021లో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.2023లో, మిస్బా అప్పటి తాత్కాలిక నిర్వహణ కమిటీ అధిపతి జకా అష్రఫ్ ఆధ్వర్యంలో సలహాదారుగా పీసీబీకి తిరిగొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ఆకిబ్ జావేద్, సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిక్లతో పాటు మిస్బా నలుగురు సభ్యుల జాతీయ ఎంపిక కమిటీలో చేరాడు. దీంతోపాటు సంవత్సరానికి 180 రోజులు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తానని పీసీబీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ తమ చివరి టెస్టును సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది.Misbah-ul-Haq has offered his resignation from the Pakistan men's national selection committee a day after the PCB made wholesale changes to the Test squad and team management https://t.co/Yc5oSoUL0S pic.twitter.com/oApQR5kzRj— Cricinfo (@cricinfo) September 1, 2026చదవండి: గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్‌జోన్ -
ఇండియన్ మహరాజా టీమ్ కెప్టెన్‌గా సెహ్వాగ్
జనవరి 20 నుంచి ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) టి20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో ఇండియన్ మహారాజా, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్‌లు పాల్గొంటున్నాయి. కాగా షెడ్యూల్‌తో పాటు ఆయా జట్ల కెప్టెన్లను ప్రకటించారు. ఎల్ఎల్సీలో పాల్గొననున్న ఇండియన్ మహారాజా టీమ్‌కు.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా మరో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఎంపిక కాగా.. జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు జాన్ బుచానన్ ఎంపికయ్యాడు. ఇక సెహ్వాగ్ ఇంతకముందు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. చదవండి: 'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే ► ఇక ఆసియన్ లయన్స్ కెప్టెన్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా-ఉల్ హక్ ఎంపిక కాగా.. ఈ జట్టులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తరపున ఆడిన మాజీ క్రికెటర్లు ఉన్నారు. వారిలో షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, చమిందా వాస్, హబీబుల్ బషర్ లాంటి పేరున్న క్రికెటర్లు ఉండడంతో ఆసియా లయన్స్ బలంగా కనిపిస్తుంది. వైస్ కెప్టెన్‌గా దిల్షాన్ ఎంపికవగా.. 1996 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ► వరల్డ్ జెయింట్స్ టీమ్‌కు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోనూ పలువురు వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. బ్రెట్ లీ, డానియెల్ వెటోరి, కెవిన్ పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. వీరితో పాటు జాంటీ రోడ్స్ ప్లేయర్ కమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 20న ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియా లయన్స్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ సోనీ టెన్ వన్, టూ, త్రీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి ఎల్ఎల్సీ టోర్నీ షెడ్యూల్: 20/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియన్ లయన్స్ 21/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఏషియన్ లయన్స్ 22/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ 24/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 26/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 27/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ -
యువీ హార్ట్ టచింగ్ మెసేజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్‌లపై టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌కు వీరిద్దరూ అందించిన సేవలను కొనియాడాడు. మిస్బా, యూనిస్‌లను స్ఫూర్తిప్రదాతలుగా వర్ణించాడు. ‘పాకిస్తాన్ క్రికెట్‌కు చెందిన ఇద్దరు గొప్ప బ్యాట్స్మన్లు ఆటకు వీడ్కోలు పలికారు. మిస్బా, యూనిస్ ఖాన్ క్రికెట్‌కు అందించిన సేవలు మా అందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చాయ’ని యువీ ట్వీట్ చేశాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ రిటైర్మెంట్ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదని మిస్బా స్పష్టం చేశాడు. మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. Good bye two greats of Pakistan cricket @captainmisbahpk and younis khan your contribution towards the game was inspiring to all of us 👏🏽 — yuvraj singh (@YUVSTRONG12) May 15, 2017 -
యూనిస్, మిస్బా సెంచరీలు
అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. సీనియర్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్ (198 బంతుల్లో 136; 19 ఫోర్లు, 1 సిక్స్), మిస్బావుల్ హక్ (250 బంతుల్లో 105 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ 123 పరుగులు ముందంజలో ఉంది. యూనిస్, మిస్బా నాలుగో వికెట్‌కు 218 పరుగులు జోడించడం విశేషం. 69 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్‌లో జయవర్ధనే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మిస్బా కెరీర్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 46/1 పరుగులతో ఆట ప్రారంభించిన పాక్ తక్కువ వ్యవధిలోనే హఫీజ్ (11), షహజాద్ (38) వికెట్లు కోల్పోయినా యూనిస్, మిస్బా భాగస్వామ్యంతో కోలుకుంది.


