breaking news
M.ed
-
ఈసారికే ఏడాది బీఈడీ, ఎంఈడీ!
రెండేళ్ల బీఎడ్, ఎంఈడీకి దక్షిణాది రాష్ట్రాలు ఓకే సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈ డీ), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సులు ఈసారికి (2014-15 విద్యా సంవత్సరంలో) మాత్ర మే. వచ్చే విద్యా సంవత్సరంలో అవి రెండేళ్ల కోర్సులుగా మారబోతున్నాయి. మార్గదర్శకాలను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) త్వరలో జారీ చేయనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని బీఎడ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యావేత్తలు, విద్యాశాఖ అధికారులతో ఎన్సీటీఈ శనివారం బెంగళూరులో సమావేశం నిర్వహించింది. ఉపాధ్యాయ విద్యలో కొన్ని సవరణలు మినహా మిగతా సంస్కరణలకు దక్షిణాది రాష్ట్రాలు సంపూర్ణ అంగీకారం తెలియజేశాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, పలువురు ప్రొఫెసర్లు, బీఈడీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం తదితరులు హాజరయ్యారు. -
దూరవిద్యలో ఎంఈడీ, బీఈడీ
ఎదులాపురం, న్యూస్‌లై న్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఈడీ, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో 2014 సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ సహాయ సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈడీ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు బీఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, 1 జూలై, 2014 నాటికి 23 సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, 1 జూలై 2014 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఏపీ ఆన్లైన్ కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవడానికి ఈనెల 31 చివరి గడువు అని పేర్కొన్నారు. ఎంఈడీ పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు రూ.535, బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్షలకు రూ.435 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జూన్ 22న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎంఈడీ, బీఈడీ అర్హత పరీక్షలు ఉంటాయని, బీఈడీ స్పెషల్ అర్హత పరీక్ష జూన్ 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్ 08732-221016లో సంప్రదించాలని ఆయన సూచించారు.