breaking news
matress
-
ఆదర్శం ఈ కశ్మీరీ బ్రదర్స్..!
శ్రీనగర్ : పరీక్షల్లో ఫెయిలయ్యామని ఒకరు, కోరుకుంది దక్కలేదని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలిపెడుతున్న వారికి ఈ అన్నదమ్ములు ఒక పాఠం. పుట్టుకతోనే అంధులయినా గులామ్ నభి తేలి (45), మొహమ్మద్ హుస్సేన్ (40) ఏనాడు ఆధైర్య పడలేదు. తండ్రి మార్గనిర్దేశంలో నడిచి సొంత కాళ్లపై నిలబడ్డారు. డెహ్రాడూన్‌లోని జాతీయ అంధుల సంస్థలో బ్రెయిలీ లిపి, కొన్ని హోమ్ సైన్స్ ప్రొగ్రాములు నేర్చుకుని పరుపుల తయారీలో నైపుణ్యం సాధించారు. జీవితాన్ని జీవించేందుకే అని చాటిచెబుతూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భూమికి భారంగా మారాం అని కాకుండా..కష్టించి పనిచేయాలని సూచిస్తున్నారు. కళ్లు లేకపోతేనేమీ.. కాస్తంత తెలివి.. ఇంకాస్త సత్తువ ఉన్నాయి కదా అంటున్నారు. ‘ఎవరో మనపై జాలి చూపించే బదులు.. మనమే జాలీగా ఉంటే సరిపోద్ది. చేసే పనిని ప్రేమించడమే మా ఆనందానికి మూలం’ అని పనిలో మునిగారు కశ్మీరీ అన్నదమ్ములు. ఇక వీరు తయారు చేసే పరుపులకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. డీలర్లు తేలి బ్రదర్స్‌కు ఆర్డర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. ‘జాతీయ అంధుల సంస్థలో ట్రెయినింగ్ తీసుకుని సొంత కాళ్లపై నిలబడ్డాం. మా తల్లిదండ్రులు యాచక వృత్తికి వ్యతిరేకం. అదొక్కటి తప్పించి బతకడానికి మరే పని చేసినా ఫరవాలేదని చెప్తారు. మా నాన్నతో కలిసి పనిచేయడం. కుటుంబ పోషణలో భాగం కావడం నిజంగా ఆనందంగా ఉంది’ అన్నారు మొహమ్మద్ హుస్సేన్. -
ఆ బెడ్ బాక్స్ చూసి అవాక్కయ్యారు!
న్యూయార్క్: ఓ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఊహించని షాక్ తిన్న ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. వెస్ట్బరోలోని ఓ వ్యక్తిపై నిఘా ఉంచి.. ఫ్లాట్‌లో సోదాలు చేయగా బెడ్ బాక్స్ నిండా నోట్ల కట్టలు కనిపించాయి. వివరాలు.. రెనె రెజిరో రొచా అనే వ్యక్తి ఇటీవల బ్రెజిల్ నుంచి అమెరికాకు వచ్చాడు. అతడు హడ్సన్‌లోని ఓ రెస్టారెంట్లో మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి సంబంధించిన అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించగా సుమారు 20 మిలియన్ డాలర్లు బెడ్ బాక్స్‌లో గుర్తించారు. దొరికిన డబ్బు.. పిరమిడ్ బిజినెస్‌లో జనాన్ని ముంచి ప్రస్తుతం బ్రెజిల్లో తలదాచుకుంటున్న కార్లోస్ వాంజెలర్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించామని ఫెడరల్ అధికారులు వెల్లడించారు.