ఆ బెడ్‌ బాక్స్ చూసి అవాక్కయ్యారు! | Federal agents find 20 million dollars in a mattress | Sakshi
Sakshi News home page

ఆ బెడ్‌ బాక్స్ చూసి అవాక్కయ్యారు!

Jan 29 2017 11:44 AM | Updated on Sep 5 2017 2:25 AM

ఆ బెడ్‌ బాక్స్ చూసి అవాక్కయ్యారు!

ఆ బెడ్‌ బాక్స్ చూసి అవాక్కయ్యారు!

ఓ అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఊహించని షాక్‌ తిన్నారు.

న్యూయార్క్‌: ఓ అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఊహించని షాక్‌ తిన్న ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. వెస్ట్‌బరోలోని ఓ వ్యక్తిపై నిఘా ఉంచి.. ఫ్లాట్‌లో సోదాలు చేయగా బెడ్ బాక్స్‌ నిండా నోట్ల కట్టలు కనిపించాయి.

వివరాలు.. రెనె రెజిరో రొచా అనే వ్యక్తి ఇటీవల బ్రెజిల్‌ నుంచి అమెరికాకు వచ్చాడు. అతడు హడ్సన్‌లోని ఓ రెస్టారెంట్‌లో మనీ లాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించగా సుమారు 20 మిలియన్‌ డాలర్లు బెడ్‌ బాక్స్‌లో గుర్తించారు. దొరికిన డబ్బు.. పిరమిడ్‌ బిజినెస్‌లో జనాన్ని ముంచి ప్రస్తుతం బ్రెజిల్‌లో తలదాచుకుంటున్న కార్లోస్‌ వాంజెలర్‌ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించామని ఫెడరల్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement