breaking news
main opposition
-
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్‌కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్‌కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే..
గుడివాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి సీమాంధ్ర ప్రజలు ఎర్రటి ఎండల్లో రోడ్లపై పోరాటం చేస్తుంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం ఏసీ గదుల్లో హాయిగా ఉంటున్నారని, ఇదెక్కడి న్యాయమని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. పామర్రులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి, పార్టీల వైఖరిని ప్రశ్నించి, సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి తేవాల్సిందిపోయి ప్రజలతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎంపీలు, కేంద్రమంత్రులు ఏసీ గదుల్లో మంతనాలు జరుపుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని, రానున్న కాలంలో వారికి బుద్ధిచెప్పడం తథ్యమని హెచ్చరించారు. చంద్రబాబు నోరు పెగలదేం? ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేస్తే.. చంద్రబాబు మాత్రం అన్ని ప్రాంతాల్లో తన పార్టీ ఉండాలనే రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర విభజనపై నోరు మెదపటం లేదని కల్పన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించండని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసి సోనియా ఎదుట సాగిలపడ్డారని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన ఊతంతోనే సోనియాగాంధీ విభజన ప్రకటన చేశారన్నారు. సీమాంధ్రకు మంచినీరు కూడా దొరకదని మేధావులంతా ఆందోళన చెందుతుంటే చంద్రబాబు మాత్రం సీమాంధ్ర రాజధానికి రూ.4 వేల కోట్లు కావాలని ప్రకటన ఇవ్వటంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. రెండు పర్యాయాలుగా ఖాళీగా ఉన్న చంద్రబాబు ఈసారైనా అధికారంలోకి రాావాలనే రాజకీయ దురుద్దేశంతోనే సీమాంధ్ర ప్రజల్ని, వారి హక్కుల్ని విస్మరించారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎడతెగకుండా ఆందోళనలు చేస్తున్నా ఇంతవరకు చంద్రబాబు నోరు పెగలటంలేదని దుయ్యబట్టారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం రాజీనామా చేసి రోడ్లపైకి రావాలని ఉద్యోగులు చెప్పినా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాహుల్‌ను ప్రధాని చేసేందుకే.. మహానేత వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధితో విభజన వాదం వెనక్కిపోయిందని, ఆయన మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోగా, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడంతో తిరిగి తెలంగాణ వాదం ఊపందుకుందని కల్పన చెప్పారు. ఫలితంగా రాజకీయ పరిణామాల్లో మార్పులు రావటంతో సోనియాగాంధీ ఓట్లు.. సీట్లు లెక్కలు వేసుకుని తన కుమారుడు రాహుల్‌ను ప్రధాన మంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజన ప్రకటన చేశారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ కుటుంబం.. ప్రజల కష్టాలు తమవిగా భావించే కుటుంబం వైఎస్సార్‌దని కల్పన పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్లే జగన్, విజయమ్మలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోందని తెలిపారు.