breaking news
madhavarao
-
కృష్ణ గారు మానసికంగా చాలా దెబ్బతిన్నాడు..!
-
కృష్ణ గారు ఎంత గొప్పవారంటే.. నా కోసం షూటింగ్ ఆపి మరి..!
-
‘మహా’ అభివృద్ధికి కృషి
♦ బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ♦ నగరంలో పలుచోట్ల ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు వరంగల్ అర్బన్ : మహా నగర అభివృద్ధికి కృషి చేద్దామని బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం ఎగురువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీస్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్, డిప్యూటీ కమిషనర్లు రాజేంద్ర కుమార్, రవి, ఎస్ఈ అబ్దుల్ రహ్మన్, ఎంహెచ్వో జయ ప్రకాశ్, బయాలాజిస్టు సాధనాల సంధ్య, ఉద్యాన వన అధికారి సంధ్య, ఏసీపీలు శైలజ, శిల్ప, గణేష్, రవి, ఈఈ నిత్యనందం, శివకుమార్,మేనేజర్ అబ్బాస్, డీఈలు, ఆర్వోలు, సానిటరీ సూపర్వైజర్లు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందిస్తున్న 45 మంది ఉద్యోగులకు కమిషనర్ సర్ఫ రాజ్ అహ్మద్ ప్రశంసా పత్రాలు ఇచ్చారు. అవార్డులు పొందిన ఉద్యోగులు ప్రజారోగ్య విభాగం: శానిటరీ ఇన్స్పెక్టర్లు గోల్కండ శ్రీను, మాదాసి సాంబయ్య, హెల్త్ అసిస్టెంట్ ఏల్ల స్వామి, హెల్త్ ఇన్స్పెక్టర్ బిర్రు రవి, జవాన్లు వెంకటేష్, జే.స్వామి, డ్రైవర్ అభిలాష్, జవాన్లు దామెర సారయ్య, జి.శ్రీనివాస్, కవిత, శ్యామీమ్, కరుణాకర్, మూర్తి రాజ్, పి.రవికుమార్,శ్రీనివాసులు, జన్ను స్వామి, సోలా రాజు, పోలెపాక కుమార్, పీహెచ్ వర్కర్లు ఎ.స్వప్న, పోచయ్య, యాకుబ్, మైదం సరోజ, సుగుణ, మస్కే కుమార్, కోట డేవిడ్, గాదే లక్ష్మి, జన్ను రవి, హన్మకొండ కుమార్, సాంబయ్య, ప్రేమ్ సాగర్, కౌసల్య, లక్ష్మి,బాసికే రజిత పన్నుల విభాగం ఆర్వో ఎస్.శ్రీహరి, ఆర్ఐలు మన్సూర్ అలీ, బి.బాలు, బిల్ కలెక్టర్లు పి.వీరస్వామి, వెంకటస్వామి, మొగిళి, సీనియర్ అసిస్టెంట్ బి.ఉమా దేవేందర్ టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఎస్ వీరస్వామి, చైన్‌మెన్ సదారెడ్డి, హనుమయ్య, రమే ష్, సీనియర్ అసిస్టెంట్ అనిల్ బాబు, ట్రేసర్ గౌరీ శంకర్ ఇంజినీరింగ్ విభాగం ఏఈలు రవికిరణ్, బి.సురేందర్, డ్రాఫ్ట్‌మెన్ డీవీఎలల్ రంగనాథ్, లైన్మెన్ వెంకటయ్య, ఆపరేటర్ ఎ.సుదర్శన్, హెల్పర్ కొమ్మాలు అకౌంటింగ్ విభాగం అకౌంటెంట్ జాకీర్ హూస్సేన్, సీనియర్ అడిటర్ బి.రాజు, సీనియర్ అసిస్టెంట్ చార్లెస్ బ్రోవ్సన్. ఉద్యాన విభాగం హెడ్ మాలీ ఎండీ సిద్దిఖ్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సంజయ్‌కుమార్, మాలీ యండీ.రఫీయోద్దీన్లు స్వీకరించారు. ‘కుడా’ కార్యాలయంలో.... హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో వైస్ చైర్మన్ సర్ఫరాజ్ అహ్మద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కుడా ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, డీఈలు,ఏఈలు,సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో కమిషనర్ సర్ఫ ాజ్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన వన అధికారి సదానందం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో... జిల్లా పోలీసు కార్యాలయంలో, రూరల్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఎదుట వరంగల్ రూరల్ అదనపు ఎస్పీలు కె.శ్రీకాంత్, జాన్‌వెస్లీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఎంజీఎంలో ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీలో ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, ఆర్డీ కార్యాలయంలో ఆర్డీ నాగేశ్వర్రావు, రీజినల్ ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ పాండురంగజాదవ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ బొజబోయిన సాంబశివరావు పతాకావిష్కరణ చేశారు. కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వి. చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్, డిడి శ్రీనివాసులు, అడిషనల్ డిఎంహెచ్ఓ శ్రీరాం, ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం రాజిరెడ్డి, డీఐఓ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రాజు పతాకవిష్కరణ చేశారు. వైద్యులు అన్వర్, బందెల మోహన్‌రావు, కూరపాటి రమేశ్, కంకల మల్లేశం, భూమిగారి మోహన్‌రావు, విజయ్‌చందర్‌రెడ్డి, కస్తూరి ప్రమీళ, సంద్యరాణి, మెరుగు సుధాకర్, మన్మోహన్ రాజు, తాళ్ళరవి, తదితరులు పాల్గొన్నారు. కేయూలో కేయూక్యాంపస్: యూనివర్సిటీ అభివృద్ధికి పునరంకితమవుదామని కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్తాఫ్హుస్సేన్ అన్నారు. క్యాంపస్‌లోని పరిపాలనాభవనం ఆవరణలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ రామస్వామి , వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ఉద్యోగసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిట్‌లో కాజీపేట రూరల్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నిట్ డైరక్టర్ టి.శ్రీనివాస్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ పరేడ్ నిర్వహించారు. ఆవరణంలో డెరైక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించినట్లు నిట్ పీఆర్వో ఫ్రాన్సెస్ సుధాకర్ తెలిపారు. కలెక్టరేట్లో.. కలెక్టరేట్లో జేసీ ప్రశాత్ జీవన్ పాటిల్ పతాకావిష్కరణ చేశారు. డీఆర్వో కె.శోభ, లక్ష్మిపతి, సూరింటెండెంట్లు పాల్గొన్నారు. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, డీఆర్డీఏలో పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి , డ్వామా కార్యాలంలో పీడీ శేఖర్‌రెడ్డి, రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఆర్ సుభాషిణి పతాకావిష్కరణచేశారు. వేయిస్థంభాల దేవాలయంలో హన్మకొండ కల్చరల్ : చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో కేంద్రపురావస్తుశాఖ జిల్లా అధికారి కె. మల్లేషం జెండా ఆవిష్కరణ చేశారు ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ , బసవయ్య పాల్గొన్నారు. గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలి ఖిలావరంగల్ : ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగస్వాములు కావాలని ఇన్చార్జీ ఉపరవాణాశాఖ కమిషనర్, ఆర్టీఓ మాధవరావు పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. సీనియర్ ఎంవీఐలు సత్యనారాయణ, రాంచందర్, జూనియర్ ఏఎంవీఐలు వెంకన్న, ఫహీమాసుల్తాన్, వేణుగోపాల్‌రెడ్డి, కవిత, రవికుమార్, ఏఓ జగన్మోహన్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. -
‘చుండూరు’పై పోలీసుల నిర్లక్ష్యం: ప్రజాసంఘాలు
హైదరాబాద్: చుండూరు కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు వక్తలు ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘అందరూ నిర్దోషులైతే చుండూరు దళితుల్ని చంపింది ఎవరు?’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్, ఆర్పీఐ అధ్యక్షుడు బొజ్జా తారకం, మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి తదితరులు ప్రసంగించారు. చుండూరులో దారుణం జరిగిన వెంటనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదని, కనీసం కోర్టులో సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేదన్నారు. దళితులను చంపిన వారికి శిక్షలు పడకపోవటం దుర్మార్గమని విమర్శించారు. న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి తీర్పునిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుంటే తామే ప్రైవేటుగా అప్పీల్ చేస్తామని హెచ్చరించారు. చుండూరు కేసులో న్యాయం కోసం జైలుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్త సాంబశివరావు, డాక్టర్ వై.బి.సత్యనారాయణ, ఐ.మైసయ్య, ప్రభాకర్, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు, కెవీపీఎస్ నాయకులు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
కనెక్షన్.. కలెక్షన్
మంథని, న్యూస్‌లైన్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూ రులో ఎన్పీడీసీఎల్ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. డబ్బుల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నిబంధనల మేరకు డిపాజిట్లు కట్టినా.. ముడుపులు ముట్టందే ఫైళ్లు ముట్టుకోవడం లేదు. దానికితోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పైరవీలు తప్పనిసరి. అధికారుల వైఖరితో ఇబ్బం దులకు గురవుతున్నామని మంథని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఒక హెచ్‌పీ కెపాసిటీ కోసం రూ.1225నుంచి రూ.1375 వరకు డీడీ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రైతు 3, 5, 7.5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తుంటాడు. 5హెచ్‌పీ మోటారుకు డీఈ ఎన్పీడీసీఎల్ పేరిట రూ.5125, ఏవో ఈఆర్వో పేరిట రూ.1000 డీడీ తీయాలి. 3హెచ్‌పీకి రూ.3125, రూ.600 డీడీ తీస్తే సరిపోతుంది. 3, 5 హెచ్‌పీ కెపాసిటీ కోసం డీడీలు చెల్లించి కొందరు రైతులు 7.5 మోటార్లను బిగిస్తారు. ఈ విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించే ఎన్పీడీసీఎల్ అధికారులకు రైతు ఎంత కెపాసిటీ కోసం దరఖాస్తు చేసుకున్నా రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. పైగా మంత్రి, శాసనసభ్యుల రికమండేషన్ లెటర్ కూడా తీసుకురావాలని అధికారులు షరతు పెడుతుం డడం వారి ముందు జాగ్రత్త చర్యకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముడుపులు ఏమాత్రం తగ్గినా సర్వీసుల మం జూరులో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఏప్రిల్ 2013 నుంచి నవంబర్ 30 వరకు మంథని డీఈ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 746 దరఖాస్తులు అందా యి. అందులో 428 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చిన అధికారులు 318 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో రైతు నెలల తరబడి విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా కనికరించడంలేదు. దీంతో అధికారులు కోరిన విధంగా డబ్బులు ముట్టజెబుతున్నారు. లైన్మార్పిడి, కొత్త స్తంభాల ఏర్పాటు, ఇతరత్రా పనులకు సైతం రేటు నిర్ణయించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం జిల్లాస్థాయి అధికారులకు తెలిసినా వారు కూడా తిలాపాపం తలపిరికెడు అన్న చందంగా సద్దుకుపోతున్నారు. విచారణ జరిపి చర్యలు - మాధవరావు, డీఈఈ, ఎన్పీడీసీఎల్ మంథని మినీ ట్రాన్స్ఫార్మర్లు, ఇతరత్రా పనులకు వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. అలాంటి కేసులేమైనా ఉంటే విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు తమకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతరత్రా సామగ్రికి మా సంస్థ నిర్ణయించి ధర ప్రకారమే డీడీ రూపంలో డబ్బు చెల్లించాలి.