breaking news
macharala
-
ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నేతలు, వారి ఇళ్లపైన పచ్చ మూక దాడి చేస్తున్నా సీఐగా ఉన్న నారాయణస్వామి అడ్డుకుంటే ఒట్టు. పల్నాడు జిల్లాలో టీడీపీ రౌడీల దాడికి కొమ్ముకాసినందుకు పలువురు పోలీసు అధికారులను ఇప్పటికే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినా నారాయణస్వామిపై వేటు వేయకపోవడం గమనార్హం. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఆయనను కారంపూడి సీఐగా ఒక ఉన్నతాధికారి పంపారు. నాటి నుంచి టీడీపీ సేవలోనే నారాయణస్వామి తరించారు. పోలింగ్ నాడు టీడీపీ గూండాల దాడికి ఆయన అణువణువునా సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లనీయకుండా తన అధికారాన్ని సీఐ ఉపయోగించారు. ‘టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు.. వచ్చి అడ్డుకోండి’ అని వైఎస్సార్సీపీ వాళ్లు సమాచారం ఇచ్చినా సీఐ నారాయణస్వామి పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో బుడగ జంగాలపై టీడీపీ రౌడీలు దాడులు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పైగా గొడవలో గాయపడిన, ఘటన ప్రదేశంలో లేని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు.ఆ సీఐపై ఇలా ఎన్ని ఫిర్యాదులు వచి్చనా పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు ఉన్నతా«ధికారులు పథకం ప్రకారం ఎన్నికలకు ముందు కారంపూడి సీఐ చిన్నమల్లయ్యను బదిలీ చేయించారు. ఆ స్థానంలో టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉన్న, వారి సామాజికవర్గానికే చెందిన నారాయణస్వామిని సీఐగా పంపారు. నారాయణస్వామి అరాచకాలు అన్నీఇన్నీ కావు.. సీఐగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే నారాయణస్వామి చెలరేగిపోయారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నేతలను వేధించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటేశ్వరరెడ్డిని ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండొద్దని బెదిరించారు. రెంటచింతల మండలంలో టీడీపీ అనుకూల గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడాలని.. తాను ఉన్నానని వారికి భరోసా ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రెంటచింతలలో వైఎస్సార్సీపీ నేత ఉమామహేశ్వరరెడ్డిని ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరించినట్టు సమాచారం.ఇక ఎన్నికల రోజు రెంటచింతల, కారంపూడి మండలాల్లోని పాల్వాయి గేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లిలో టీడీపీ రౌడీ మూకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను పోలీంగ్ కేంద్రాల నుంచి తరిమికొడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తన వద్ద కేంద్ర బలగాలు ఉన్నా వాటిని ఉపయోగించి హింసను ఆపే ప్రయత్నం నారాయణస్వామి చేయలేదు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి తరిమేశారు. ఆ ఏజెంట్లు సీఐ నారాయణస్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక పోలింగ్ అనంతరం టీడీపీ మూక అర్ధరాత్రి గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లపై దాడికి దిగినా సీఐ స్పందించలేదు. నారాయణస్వామి అతీతుడా? పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల హింసపై ఎన్నికల సంఘం స్పందించింది. కారంపూడి ఎస్సై రామాంజనేయులు, గురజాల డీఎస్పీ, పల్నాడు ఎస్పీలపై వేటు వేసింది. కానీ హింస ప్రజ్వరిల్లడానికి అసలు కారకుడైన నారాయణస్వామిపై చర్యలు తీసుకోలేదు. ఈయనపై వేటు పడకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి కాపాడారని అంటున్నారు. దీంతో సీఐ నారాయణస్వామి మరింత రెచి్చపోతున్నారు. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఆ పారీ్టలో చురుగ్గా ఉంటున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎస్ఐగా పనిచేసినప్పుడూ అంతే.. మొదటి నుంచి సీఐ నారాయణస్వామి తీరు వివాదాస్పదమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కారంపూడి ఎస్ఐగా పని చేసిన సమయంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. నరగామాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకుడు అయిన రామ్మడుగు బ్రహ్మంను టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు ఆ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆయన తమ్ముడ్ని తన ప్రోద్భలంతోనే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలను నారాయణస్వామి ఎదుర్కొన్నారు.అలాగే చినగార్లపాడులో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసి వెంటాడి చంపారు. అయినా వారిపై నారాయణస్వామి చర్యలు తీసుకుంటే ఒట్టు. చివరకు ఎస్ఐగా ఉన్న ఆయన టోపీని టీడీపీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకుని లాఠీతో ఫోజులిచ్చే స్థాయిలో వారితో అంటకాగారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌ను అడ్డాగా మార్చుకుని వైఎస్సార్సీపీ నాయకులపై వేధింపులకు పాల్పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దీంతో ఎట్టకేలకు ఎస్ఐగా పనిచేస్తున్న నారాయణస్వామిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పిన్నెల్లిపై అక్రమంగా కేసు... కారంపూడిలో ఈ నెల 14న జరిగిన గొడవల్లో స్థానిక వీఆర్వో ఇచి్చన ఫిర్యాదు ఆధారంగా పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదు లేదు. అయితే ఈవీఎం పగలగొట్టారని నమోదు చేసిన కేసులో పిన్నెల్లికి బెయిల్ వస్తే కౌంటింగ్‌కు హాజరవుతారని, ఆయనను ఎలాగైనా నిలువరించాలన్న టీడీపీ నేతల కుట్రకు సీఐ నారాయణస్వామి సహకరించారు.ఇందులో భాగంగా ఈ నెల 22న ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో తనను పిన్నెల్లి సోదరులు, ఆయన అనుచరులు గాయపరిచారని ఆరోపించారు. దీని ఆధారంగా కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ24, ఏ25 నిందితులుగా చేర్చారు. మరోవైపు మే 14న సీఐ నారాయణస్వామికి చిన్న గాయమైతే ఐదారురోజులు యథావిధిగా విధులు నిర్వహించారు. అయితే కేసులో పిన్నెల్లిని ఇరికించాలన్న కుట్రతోనే మే 20న నరసరావుపేటలో టీడీపీ అనుకూల ఆస్పత్రిలో నారాయణస్వామి చికిత్స పొందారు.మా నాన్నను అక్రమంగా ఇరికించారు.. కారంపూడిలో జరిగిన గొడవలకు మా నాన్న కొత్త కాశిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు మా నాన్నను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారు. ఆ సమయంలో మా నాన్న కారంపూడి చుట్టుపక్కల లేరు. సీఐ నారాయణస్వామి రమ్మంటున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లి జైలుకు పంపారు. – కొత్త నర్సిరెడ్డి, దేవారిపల్లి, కారంపూడి మండలం దళితులపై అక్రమ కేసులు పెట్టారు.. కారంపూడిలో హింసాత్మక ఘటనలకు ఏమాత్రం సంబంధం లేని మా మామ బంకా ప్రతాప్‌పై పోలీసులు అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మా మామ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్నందుకు కేసు పెట్టారు. బైండోవర్ సంతకం కోసం సీఐ నారాయణస్వామి పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు అక్కడి నుంచి జైలుకు పంపారు. – ఎల్. ప్రభుకుమార్, చింతపల్లి -
ప్రతీకారం: ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో వల వేసి
మాచర్ల రూరల్(గుంటూరు జిల్లా): ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడీ సృష్టించి తన దగ్గరకు రావాలి, కలుద్దామని నాగరాజుకి వల వేసి పథకం ప్రకారం హత్య చేసినట్లు గురజాల డీఎస్పీ జయరామ్‌ప్రసాద్ తెలిపారు. శనివారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన కంచర్ల నాగరాజు ఈ నెల 20వ తేదీన నర్సరావుపేటలో పని ఉందని చెప్పి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా నాగరాజు చదువుకునే రోజులలో నర్సరావుపేట మండలం తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ అసియాను 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుంటూరులో కాపురం పెట్టిన కొద్దిరోజులకే అసియా ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును 2017లో జిల్లా కోర్టు కొట్టివేసింది. ఇది జీర్ణించుకోలేని అసియా బంధువులు నాగరాజును ఎలాగైనా హతమార్చాలని పథకం పన్ని రెండుసార్లు విఫలమయ్యారు. చదవండి: జంట హత్యల కేసు: భాస్కర్, రాజు ఏమయ్యారు? ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడీని సృష్టించి ఆన్లైన్లో చాటింగ్ జరిపి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో ఉన్న అబ్దుల్ సలీం ఇంటికి రప్పించారు. నాగరాజు ఇంట్లోకి రాగానే లోపల తలుపులు బిగించి నోటిలో గుడ్డలు కుక్కి చితకబాది మెడకు తాడు వేసి హత్య చేశారు. నాగరాజు మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి కారులో నర్సరావుపేట శివారులోని పెద తురకపాలెం గ్రామంలో ముద్దాయిలకు చెందిన మట్టి క్వారీలో నిర్మానుష్య ప్రదేశంలో దహనం చేశారు. చదవండి: వలంటీర్‌పై దాడి చేసి పింఛన్ సొమ్ము దోపిడీ ఈ కేసులో నిందితులైన షేక్ అబ్దుల్సలీం, నబీజానీ, మీరాజిలానీ, పఠాన్ అక్బర్ వలి, సయ్యద్ అబ్బాస్, సయ్యద్ పీరువలి, తుబాటి సలీంలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మిస్సింగ్ కేసును ఛేదించటంలో రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి నేతృత్వంలో పట్టణ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు రామాంజనేయులు, సు«దీర్‌కుమార్, పాల్ రవీందర్‌లు ప్రత్యేక దర్యాప్తు జరిపి కేసును ఛేదించారు. అలాగే నర్సరావుపేట, చిలకలూరిపేట సీఐ రోశయ్య, బిలాలుద్దీన్, ఎస్సైలు షఫీల కృషిని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని ప్రత్యేకంగా అభినందించి రివార్డుకు రికమండ్ చేసినట్లు తెలిపారు. -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ
సాక్షి, గుంటూరు: చలమల – శ్రీరాంపురం తండా మధ్య జరిగిన లారీ ప్రమాదంలో గాయపడి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి.. వారిని ఓదార్చారు. తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు, వైఎస్సార్ బీమా పథకం నుంచి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి తన నిధుల నుంచి పదివేలు ప్రకటించారు. ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. (మృత్యు ఘోష) -
ప్రభుత్వాస్పత్రిలో పురుటి కష్టాలు
-
మాచర్లలోఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్
-
గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య
మాచర్ల: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బిస్లావత్ సాహూనాయక్(43) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.