breaking news
LIO Global
-
భారత మిలియనీర్ల విదేశీ బాట..
గత 14 ఏళ్లలో 61 వేల మంది వలస న్యూఢిల్లీ : భారతీయ మిలియనీర్లు విదేశాలకు అధికంగా తరలివెళ్తున్నారు. ఇతర దేశాలకు తరలివెళ్లే మిలియనీర్ల పరంగా చూస్తే.. చైనా అగ్రస్థానంలో (91,000) ఉంటే, భారత్ రెండో స్థానంలో (61,000) ఉంది. వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (42,000), ఇటలీ (23,000), రష్యా (20,000), ఇండోనేసియా (12,000), దక్షిణాఫ్రికా (8,000), ఈజిప్ట్ (7,000) ఉన్నాయి. గత 14 ఏళ్లలో దాదాపు 61,000 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు తరలివెళ్లారు. ఇలా మిలియనీర్లు విదేశాలకు తరలి వెళ్లడానికి పన్నులు, భద్రత, పిల్లల విద్య తదితర అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలు న్యూ వరల్డ్ వెల్త్, ఎల్‌ఐఓ గ్లోబల్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యాయి. భారత మిలియనీర్లు ఎక్కువగా యూఏఈ, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లిపోతున్నారు. అలాగే చైనా మిలియనీర్లు కూడా అమెరికా, హాంగ్‌కాంగ్, సింగపూర్, యూకే దేశాలకు అధికంగా తరలిపోతున్నారు. మొత్తంగా చూస్తే.. మిలియనీర్ల గమ్యస్థానంగా యూకే కొనసాగుతోంది. గత 14 ఏళ్లలో దాదాపు 1.25 లక్షల మంది మిలియనీర్లు ఇతర దేశాల నుంచి యూకేకు వెళ్లిపోయారు. యూకే వెళ్లే మిలియనీర్ల సంఖ్య యూరప్, రష్యా, చైనా, భారత్ నుంచే అధికంగా ఉంది. మిలియనీర్లను ఆకర్షించడంలో యూకే తర్వాతి స్థానాల్లో అమెరికా, సింగపూర్ ఉన్నాయి. చైనా మిలియనీర్లు అధికంగా అమెరికాకు వెళ్లిపోతున్నారు. అలాగే సింగపూర్‌కు వెళ్లే మిలియనీర్లు చైనా, భారత్, ఇండోనేసియా నుంచి అధికంగా ఉన్నారు. -
మాతృదేశం వీడి వెళుతున్న మిలియనర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి పొరుగుదేశాలకు వెళ్లే ధనిక వలసదారుల స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన పద్నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు 61 వేలమంది భారత మిలియనర్లు విదేశాలపై మోజుతో మాతృదేశాన్ని విడిచి వెళ్లి ఏదో ఒకరకంగా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నరంట. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రచురించాయి. దాని ప్రకారం మిలియనీర్లుగా మారిన భారతీయులంతా వెంటనే భారత దేశంలో విధిస్తున్న పన్నులు, రక్షణ, పిల్లల చదువు అనే సాకులతో విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఇప్పటికే 61 వేలమంది మిలియనీర్లను భారత్ కోల్పోయిందని సర్వే చెప్పింది. కాగా, 91 వేలమంది మిలియనర్లు విదేశాలకు తరలిపోవడం ద్వారా చైనా తొలిస్థానంలో నిలిచింది. భారతీయులంతా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాకు తరలి వెళుతుండగా.. చైనా వాళ్లు మాత్రం అమెరికా, హాంగ్ కాంగ్, సింగపూర్, బ్రిటన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట. కాగా, ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్‌కే 1.25 లక్షలమంది వెళ్లినట్లు సర్వే వెళ్లడించింది.