Liam
-
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్‌స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
లియామ్‌తో మొబైల్ రీసైక్లింగ్
వాడేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో ఎలక్ట్రానిక్ వ్యర్థ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి... తగిన విధంగా రీసైకిల్ చేయకపోతే భూమి, గాలి, నీరు మరింత కలుషితమవుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ ఇదో శుభవార్తే. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్..ఈ సమస్యకు ఓ రోబోతో చెక్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలో కనిపిస్తున్నది ఆ రోబోనే. పేరు లియాం. స్టోర్స్‌లోకి తిరిగి వచ్చిన ఐఫోన్లను ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి అవసరమైన వాటిని మళ్లీ వాడుకునేందుకు, సులువుగా రీసైకిల్ చేసేందుకు దీన్ని వాడుకోవాలని ఆపిల్ నిర్ణయించింది. మొత్తం 29 రోబో ప్లాట్‌ఫామ్స్ ఉన్న లియామ్ ఏక కాలంలో 40 వరకూ ఐఫోన్లను రీసైకిల్ చేయగలదు. గట్టిగా బిగించిన స్క్రూలను విడదీయడం మొదలుకొని, ఫోన్ బ్యాటరీల్లోని రసాయనాలను వేరు చేయడం వరకూ... అన్ని కఠినమైన, సంక్లిష్టమైన పనులు చేపట్టేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. మరిన్ని వివరాలకు... ఆసక్తికరమైన ఈ వీడియో చూడండి.... https://www.youtube.com/watch?v=AYshVbcEmUc