breaking news
lap
-
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
చేతిలో పార కళ్లల్లో స్కూలు
జూన్ 12 వరల్డ్ డే అగెనైస్ట్ చైల్డ్ లేబర్ మన చదువులు తగలెయ్య! మన ప్రభుత్వాలకు సంకల్పం లేదు. మన నేతలకు చిత్తశుద్ధి లేదు. మనకు ఈ లక్షణాలే ఉన్నట్లయితే, దేశంలోని బాలలందరూ బడిలోనే ఉండేవారు. చెమట చిందించాల్సిన అగత్యం లేకుండా శుభ్రంగా చదువుల ఒడిలోనే సేదదీరేవారు. ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్ల మంది బాలకార్మికులు బడులకు వెళ్లలేక పనుల్లో మగ్గిపోతున్నారు. వీళ్లల్లో చాలామంది వెట్టిచాకిరిలో కట్టుబానిసల్లా బతుకుతున్నారు. మన ‘మహాన్ భారత్’లో 5-14 ఏళ్ల లోపు బాలల జనాభా దాదాపు 25.3 కోట్లు. వీళ్లలో 1.26 కోట్ల మంది బడికి దూరమైన బాలకార్మికులే. పలకా బలపం పట్టుకోవాల్సిన చిట్టిచేతులు పలుగూ పారా పట్టుకుంటున్నాయి. అక్షరాలు దిద్దుకోవాల్సిన చేతులు మొరటు పనుల్లో నలిగి బొబ్బలెక్కుతున్నాయి. వాళ్లకు మాత్రం బడికి వెళ్లాలని ఉండదూ! తోటి చిన్నారులతో ఆటలాడుకోవాలని ఉండదూ! మనకు స్వాతంత్య్రం వచ్చి దాదాపు డెబ్బయ్యేళ్లవుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదానికి నలభై ఐదేళ్లు నిండాయి. అయినా ‘బాల’భారతాన్ని దారిద్య్రం పట్టి పీడిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇన్నాళ్లూ మన ప్రభుత్వాలు చేసిందేమిటి? చదువు సంధ్యలతో సమాజంలో ఉన్నత స్థితికి ఎగబాకిన ‘భద్ర’లోకులు చేస్తున్నదేమిటి? ప్రపంచ జనాభా 700కోట్లు వెట్టి కార్మికులు 2.98 కోట్లుమన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు. కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు. తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిథ్యగానే విద్యాహక్కు దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు. ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు. బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు వజ్రాల పరిశ్రమ: తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్‌లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్‌లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్ఓ అంచనా. బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా. గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. చట్టాలు ఏమంటున్నాయి..? బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ఇలా కూడా చేయవచ్చు! సానుభూతి చూపే చూపుల కన్నా సాయం చేసే చేతులు మిన్న! మీ ఇంట్లో, మీ పక్కింట్లో, మీ కాలనీలో... చైల్డ్‌లేబర్ కనిపించారా? మనసుకు బాధగా ఉందా! ఏదైనా చేయాలని ఉందా? అయితే ఇలా చేసి చూడండి... మీ కాలనీలో మొక్కలు నాటడం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు... అందరూ కలిసి రకరకాల మంచి పనులు చేస్తారు. మీ కాలనీ వాసులంతా చైల్డ్‌లేబర్‌ను దత్తత తీసుకొని పని మానిపించి బడికి పంపించడం కూడా మంచి పనే. మీ పాకెట్ మనీ నుంచి తలా కొంత చైల్డ్లేబర్కు ఇస్తే ఆర్థికంగా వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. చదువు సాఫీగా సాగుతుంది. మనం సహాయం చేసిన బాలకార్మికుడు మంచి చదువులు చదివి ప్రయోజకుడైతే మన కాలనీకి ఎంత మంచి పేరు! ఒక్కసారి ఆలోచించండి. చైల్డ్ లేబర్ ఓకేనా? సినిమాలో మద్యం తాగే దృశ్యం వస్తే... ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని - సిగరెట్ తాగితే ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలు తెర మీద కనిపిస్తాయి. హోటల్లో టీ సప్లై చేస్తూనో... నల్లగా మసిబారిన దుస్తులతో మెకానిక్ షెడ్లో పని చేస్తూనో... ఇలాంటి పనులు చేస్తున్న పిల్లల దృశ్యాలు తరచుగా వెండితెర మీద కనిపిస్తుంటాయి. మరి ఇలాంటి దృశ్యాలు వెండితెర మీద కనిపించినప్పుడు... ‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’ అనే హెచ్చరిక మాత్రం వేయకూడదా! పొగతాగడం, మద్యపానం వల్ల వ్యక్తి ఆరోగ్యమే దెబ్బతినవచ్చు. కానీ ‘బాల కార్మిక వ్యవస్థ’ వల్ల దేశ ఆరోగ్యమే దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ‘పిల్లలతో పని చేయించుకోవడం నేరం’ అనే హెచ్చరిక తప్పనిసరి అనిపిస్తుంది. మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. వారిలో 25 కోట్లకు పైగా బాలలు ఉన్నారు. అయితే, వారిలో 1.26 కోట్ల మందికి పైగా బాలలకు బాల్యమే లేదు. బడిలో గడపాల్సిన ఈ చిన్నారులంతా బాల కార్మికులుగా వెళ్లదీస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చొరవతో ఏటా జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఇదే తేదీకి కాస్త అటూ ఇటుగా మన దేశంలో బడిగంటలు మోగుతాయి. చాలామంది చిన్నారులు కొత్త యూనిఫామ్ దుస్తులు వేసుకుని, భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా స్కూళ్లకు వెళతారు. కళ్లెదుట బడి కనిపిస్తున్నా, బడిగంటలు చెవికి వినిపిస్తున్నా, లోలోపల బడికి వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా, చాలామంది చిన్నారులు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోతున్నారు. తమ తోటి పిల్లలందరూ స్కూళ్లకు వెళుతుంటే, పలుగూ పారా చేతపట్టి పనుల్లోకి వెళుతున్నారు. చాలామంది పొలం పనులు, ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ వేన్నీళ్లకు చన్నీళ్లుగా తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు బరువులెత్తే పనులు, చెత్తలు ఏరుకునే పనుల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు బాణసంచా కర్మాగారాలు, గనులు, రసాయన కర్మాగారాలు వంటి చోట్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమట చిందిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికంగా 7.77 కోట్ల మంది బాల కార్మికులు చదువులకు నోచుకోకుండా చాకిరిలో మగ్గిపోతున్నారు. పశ్చిమాసియా-ఉత్తరాఫ్రికా దేశాల్లో 90 లక్షల మంది, సహారా ఎడారికి దిగువన ఉన్న మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో 5.9 కోట్ల మంది, లాటిన్ అమెరికన్ దేశాల్లో 1.25 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిథ్యగానే విద్యాహక్కు దేశంలోని 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులందరికీ విద్య ప్రాథమిక హక్కు. ఈ చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశాల్లో భారత్ 135వ దేశంగా అవతరించింది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇంకా కోటి మందికి పైగా చిన్నారులు బడులకు దూరంగా, బాలకార్మికులుగా వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉండాల్సిన టీచర్ల కంటే 5.08 లక్షల మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాహక్కు మిథ్యగానే మిగిలిపోతోందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. ప్రచారార్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు కాస్తంతైనా చిత్తశుద్ధితో విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టిపెడితే ఈ దుస్థితి ఉండేది కాదు.బాలకార్మికులు పనిచేస్తున్న పరిశ్రమలు వజ్రాల పరిశ్రమ: తళుకులీనే వజ్రాల మెరుపుల వెనుక చిన్నారుల చెమట, నెత్తురు ఉన్నాయనే సంగతి ఎందరికి తెలుసు? భారత్‌లోను, పలు ఆఫ్రికన్ దేశాల్లోను వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఐఎల్ఓ దశాబ్దం కిందటే వెల్లడించింది. ఆ తర్వాత వజ్రాల పరిశ్రమలో బాల కార్మికులు పని చేస్తున్నది నిజమేనని దక్షిణ గుజరాత్ వజ్రాల పరిశ్రమ కార్మిక సంఘం అంగీకరించింది. అయితే, వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువేనని సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్‌లోని వజ్రాల పరిశ్రమలో దాదాపు 15 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటే, వారిలో 20 వేల మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లు ఐఎల్ఓ అంచనా. బాణసంచా పరిశ్రమ: మనదేశంలో బాణసంచా పరిశ్రమ చాలావరకు తమిళనాడులోని శివకాశిలోనే కేంద్రీకృతమై ఉంది. శివకాశిలోని నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మిగిలిన చోట్ల చాలావరకు బాణసంచా కర్మాగారాల్లో కనీస భద్రతా సౌకర్యాలు సైతం ఉండవనేది బహిరంగ రహస్యం. బాణసంచా పరిశ్రమలో దాదాపు లక్ష మందికి పైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. పట్టు పరిశ్రమ: కర్ణాటక, తమిళనాడులలో విస్తృతంగా ఉన్న పట్టు పరిశ్రమల్లో ఐదేళ్ల వయసు మొదలుకొని చాలామంది చిన్నారులు దాదాపు వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. పట్టు పరిశ్రమ యాజమాన్యాలు చిన్నారుల చేత రోజుకు పన్నెండు గంటల సేపు నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకుంటూ రోజుకు రూ.10-15 మాత్రమే చెల్లిస్తున్నాయని ఒక జర్మన్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. పట్టు పరిశ్రమలో పదివేల మందికి పైగానే బాల కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా. గనులు: గనులలో పద్దెనిమిదేళ్ల లోపు వారి చేత పనులు చేయించరాదని చట్టాలు చెబుతున్నా, మన దేశంలో పలుచోట్ల గనుల యాజమాన్యాలు అనధికారికంగా బాల కార్మికులను వాడుకుంటూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని బొగ్గు గనుల్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా వేల సంఖ్యలో బాల కార్మికులు గనుల్లో పని చేస్తున్నట్లు ‘బచ్పన్ బచావో’ వంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పెట్ల పరిశ్రమ: ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన కార్పెట్ల నేత పరిశ్రమల్లోనూ వేలాది మంది బాల కార్మికులు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. వీరిలో చాలామంది వెట్టిచాకిరిలోనే మగ్గిపోతున్నారు. ఈ పరిశ్రమల యాజమాన్యాలు చిన్నారుల చేత అత్యంత కర్కశంగా బలవంతంగా పని చేయించుకుంటున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చినా, ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాబాలు, రెస్టారెంట్లు: వ్యవసాయ పనులు, ఇళ్లల్లో పనుల తర్వాత బాల కార్మికులు అత్యధికంగా కనిపించేది ధాబాలు, రెస్టారెంట్లలోనే. దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా బాల కార్మికులు ధాబాలు, రెస్టారెంట్లలో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. చట్టాలు ఏమంటున్నాయి..? బాల కార్మిక చట్టం, కర్మాగారాల చట్టం, గనుల చట్టం, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం వంటి చట్టాలు బాల కార్మికుల చేత పనులు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. మన రాజ్యాంగం కూడా బాలల హక్కులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి బాల కార్మికులను పనుల్లో నియమించుకునే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. బాలకార్మిక వ్యవస్థకు కారణాలు * పేదరికం * తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన లేమి * లింగ వివక్ష * చిన్నారుల నిస్సహాయత * పెట్టుబడిదారుల దోపిడీ ధోరణి * ప్రభుత్వ వైఫల్యం బాల్యాన్ని దోచే దొంగలు కావద్దు! పసిపిల్లల విలువైన బాల్యన్ని దోచుకునే వారు క్రూరమైన దొంగలు. మీ ఇంట్లోనో, మీ షాప్లోనో... ఇంకా ఎక్కడైనా సరే పిల్లల్ని పనిలో పెట్టారంటే మీరు వారి బాల్యాన్ని దోచిన గజదొంగలైనట్లే. అందుకే ఆ తప్పు చేయవద్దు. వీలైతే వారి చదువుకు సహాయం చేసి మనసున్న మనిషి అనిపించుకోండి. వీళ్లకు ఫిర్యాదు చేయాలి ఎక్కడైనా మీకు బాల కార్మికులు తారసపడితే చూసీ చూడనట్లు వెళ్లిపోవద్దు. దయచేసి ఈ కింది చిరునామాలకు ఫిర్యాదు చేయండి. రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం టి. అంజయ్య భవన్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, హైదరాబాద్ ప్రాంతీయ కార్మిక కమిషనర్ ఏటీఐ క్యాంపస్, విద్యానగర్, హైదరాబాద్ ఇవి కాకుండా, మీ జిల్లా కేంద్రాల్లో ఉండే కార్మికశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే, సమీపంలోని ‘సాక్షి’ కార్యాలయంలో సమాచారం ఇవ్వవచ్చు. పౌరులు కూడా తగిన తోడ్పాటునందిస్తే, బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత అవకాశం ఉంటుంది. అధికారులకు ఇలా ఫిర్యాదు చేయవచ్చు... నమూనా పత్రం బాలయ్యకు చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేకపోతున్నాడు. కుటుంబానికి ఆసరా కోసం రోజూ కూలీ పని చేస్తున్నాడు. చదువుకోవాల్సిన వయసులో ఎండనక, వాననక కష్టపడుతున్నాడు. బాలయ్య ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతడిని బడిలో చేర్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. -
ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు...
జమ్మూకశ్మీర్: పోలీసులు ఆకతాయిల తాట తీస్తారు అని తెలుసు. కానీ ఓ పొలీస్ అధికారే పోలీస్ స్టేషన్లో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మహిళా పోలీసు ఒళ్లో కూర్చొని తాపీగా ఫోటోకు ఫోజిచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనగారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా ఎందుకు కూర్చున్నాడో తెలియదు కానీ, ఈయన గారి నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా ఆమె ఒడిలో మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే మహిళా స్పెషల్ ఆఫీసర్‌పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.