breaking news
lacks
-
బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన
ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు.బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు. -
రూ.6.35లక్షలకు ఐపీ దాఖలు
ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన సిరిగిరి కృష్ణ స్థానిక జిల్లా కోర్టులో తనను దివాలాదారుగా ప్రకటించాలని ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చుతూ బుధవారం రూ.6.35లక్షలకు దివాలాపిటిషన్ దాఖలు చేశారు. కేసులోని వివరాలిలా ఉన్నాయి. దివాలాదారు గత 10 సంవత్సరాలుగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో గృహోపకరణాల వస్తువుల వ్యాపారం వాయిదాల పద్ధతిలో చెల్లించేలా నిర్వహిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి కోసం ప్రతివాదుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని..వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించేలా గృహోపకరణాలు విక్రయించే వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో రుణదాతలకు అప్పు›తీర్చలేక.. వారినుంచి ఒత్తిడి అధికమవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనను దివాలాదారునిగా ప్రకటించమని జిల్లా కోర్టులో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చుతూ రూ.6.35లక్షలకు దివాలాపిటిషన్ను బుధవారం దాఖలు చేశాడు. దివాలాదారు తరుపున న్యాయవాదులుగా దిరిశాల కృష్ణారావు, టి.వెంకటరామారావు వ్యవహరించారు.