breaking news
Kisan Nagar
-
కిసాన్‌నగర్‌లో పెలిన రెండు సిలిండర్లు
-
నెల్లూరులో వివాహితపై యాసిడ్ దాడి
నెల్లూరు: వివాహితపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి జరిగిన ఘటన నెల్లూరు పట్టణంలోని రాధా ధియేటర్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మీ చందనగా గుర్తించారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఆమెపై దుండగులు యాసిడ్ పోశారు. బైక్ వచ్చిన ఆగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. యాసిడ్ తక్కువ గాఢత కలిగినది కావడంతో ఆమెకు పెద్ద గాయాలు కాలేదని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు వెల్లడికాలేదు.