breaking news
kerry Katona
-
హంతకుడితో జల్సా చేసిన టీవీ నటి!
లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి కెర్రీ కటోనా ఓ హత్యకేసులో దోషి అయిన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కలకలం రేపింది. 1994లో కారు డీలర్‌ను హత్య చేసిన కేసులో కెవిన్ లేన్ అనే వ్యక్తి 18 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన అతడితో కెర్రీ చాలా సన్నిహితంగా కనిపించింది. అతని చేతిలో చేయి వేసి నడుస్తూ.. అతని పెదవులతో పెదవులు కలిపి ముద్దు పెట్టింది. సెంట్రల్ లండన్‌లోని ఓ వేదిక వద్ద ఇది జరిగింది. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కెర్రీ గతంలోనూ పలువురితో డేటింగ్ చేసింది. అయితే హంతకుడితో ఆమె తాజాగా ప్రణయసల్లాపాలు జరుపుతున్నట్టు వార్తలు రావడంతో కెర్రీ కటోనా మండిపడింది. అతడితో తాను డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో వాస్తవాస్తవాలు చూసుకోకుండా 'ద సన్' మ్యాగజీన్ తప్పుడు కథనాలు రాసిందని ఆమె మండిపడింది. ఈ ఘటనపై ఆమె మేనేజర్ కూడా వివరణ ఇచ్చాడు. కెవిన్ లేన్ గత జీవితం గురించి కెర్రీకి తెలియదని, తన స్నేహితుడి పార్టీలోనే తొలిసారి అతడిని కలిసిందని, మర్యాదపూర్వకంగానే అతడితో పార్టీలో మసలుకుందని, అంతేకానీ వారి మధ్య ఎలాంటి ప్రణయ సంబంధం లేదని చెప్పాడు. కేవిన్ లేన్ ఎవరూ కూడా ఆమెకు తెలియదని తెలిపాడు. ఫొటోలకు పోజు ఇచ్చేందుకు మాత్రమే ఆమె అతనికి ముద్దు ఇస్తున్నట్టు నటించిందని వివరణ ఇచ్చాడు. కెర్రీ గతంలో సింగర్ బ్రియాన్ మెక్ఫడెన్, ట్యాక్సీ డ్రైవర్ మార్క్ క్రాఫ్ట్‌లను పెళ్లాడింది. ఈ రెండు పెళ్లిలు పెటాకులవ్వడంతో జార్జ్ కేతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. -
'నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి.. నమ్మరేం'
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు. 34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్లో ఆత్మలు సంచరిస్తున్నాయని తొలుత ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం నేను దానిని ఓ ఇంటిలా భావించడం లేదు. ఏదో నన్ను వెంటాడుతుంది. ప్రజలు నన్ను పిచ్చిదాన్నని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం నన్ను ఎవరో వెంటాడుతున్నారనే విషయం చెప్పగలను. అసలేం జరుగుతోందని కొంతమంది నా చుట్టూ మూగుతున్నారు' అని ఆమె అంటోంది.