కరుణానిధికి రాహుల్ పరామర్శ
చెన్నై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నాడీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రాహుల్.. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని కలిశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా, కరుణానిధి ఆరోగ్యం కుదుటపడుతోందని కావేరి ఆసుపత్రి పేర్కొన్న విషయం తెలిసిందే. త్వరలోనే కరుణానిధిని డిశ్చార్జ్ చేస్తామని కూడా కావేరి ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది.