breaking news
kaminani srinivas
-
మంత్రిగారి ఆసుపత్రి నిద్ర ప్రచారానికే..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేపట్టిన ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం... ప్రచారానికే తప్ప రోగులకు ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుని ఎలుకలు పీక్కుతిన్న ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిన మంత్రులు.. బాధను వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలపై హైలెవల్ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సర్కార్‌కు సూచించారు. డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. అసలు భూ సేకరణకు కేబినెట్ ఆమోదం ఉందా ? అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీమాంధ్ర ప్రజలకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మన నిరసన కేంద్రానికి తెలియజేద్దామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
మంత్రిగారి ఆసుపత్రి నిద్ర ప్రచారానికే..
-
ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారం అయిదవ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని జూడాలు ఆరోపించారు. అందుకు నిరసనగా బుధవారం విజయవాడ నగరంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట జూడాలు స్వచ్ఛభారత్ భారత్ నిర్వహించారు. ప్రభుత్వం పిలిస్తే తమ డిమాండ్లపై మరోసారి చర్చకు సిద్ధమని తెలిపారు. అయితే రాష్ట్రంలోని అత్యవసర సేవలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జూడాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వలేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థి ఏడాది పాటు గ్రామాల్లో పని చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జూడాలు సమ్మెకు దిగారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో జూడాలు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో జూడాలు సమ్మెకు దిగారు.