breaking news
kamat hotel
-
గులాబ్ జామూన్లో బొద్దింక.. రూ.55 వేల పరిహారం
సాక్షి, బనశంకరి: బెంగళూరులో ఓ రెస్టారెంట్లో కస్టమర్‌కు బొద్దింక పడిన గులాబ్ జామూన్ ఇచ్చినందుకు రూ.55 వేల భారం పడింది. 2016లో రాజణ్ణ అనే వ్యక్తి గాంధీనగరలోని కామత్‌హోటల్‌లో జామూన్ తీసుకున్నారు. అందులో చనిపోయిన బొద్దింక కనబడింది. దానిని అతడు మొబైల్లో వీడియో తీస్తుండగా రెస్టారెంట్ సిబ్బంది మొబైల్‌ను లాక్కోవడానికి యత్నించారు. ఈ తతంగంపై అతడు ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. రెండేళ్లయినా సమాధానం రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, వినియోగదారుల ఫోరంలోనూ కేసు వేశాడు. ఫోరం విచారణ జరిపి బాధితుడు రాజణ్ణకు రూ.55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది. చదవండి: (తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు) -
కామత్ హోటల్ పై మున్సిపల్ దాడులు
విశాఖ : ఆక్రమణల పేరిట రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో విశాఖలోని కామత్ హోటల్‌పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.