breaking news
Kalvala rajaiah
-
మరణంలోనూ వీడని బంధం
కరీంనగర్ : మరణంలోనూ తాము ఒక్కటేనంటూ భార్యభర్తలిద్దరు గంటల వ్యవధిలో మృతిచెందారు. దాదాపు యాభై సంవత్సరాలకుపైగా కలిసి కాపురం చేసిన వృద్ధ దంపతులు ఒకేరోజు కాటికి వెళ్లిపోయారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హన్మాన్నగర్లో నివసిస్తున్న కల్వల రాజయ్య(70) నగరంలోని ఎస్బీఐలో తాత్కాలిక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాజయ్య మృతి చెందాడు. అది తట్టుకోలేని అతడి భార్య భాగ్యమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8గంటలకు మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
మరణంలోనూ వీడని బంధం
కరీంనగర్ రూరల్ : మరణంలోనూ తాము ఒక్కటేనంటూ ఆ దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వివరాలివీ...కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ హన్మాన్నగర్లో నివసిస్తున్న కల్వల రాజయ్య(70) నగరంలోని ఎస్బీఐలో తాత్కాలిక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాజయ్య చనిపోయాడు. అది తట్టుకోలేని భాగ్యమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8గంటలకు మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.