breaking news
joining duty
-
విధుల్లో చేరిన దిశ తండ్రి
సాక్షి, రాజేంద్రనగర్: దిశ తండ్రి శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. తన జాయినింగ్ రిపోర్టును ప్రిన్సిపాల్ అంజయ్యకు అందజేశారు. ఆయన ఇంతకుముందు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని రాణి ఇంద్రాదేవి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే వారు. ఆయన బదిలీ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం రాజేంద్రనగర్ జూనియర్ కళాశాలకు బదిలీ చేసింది. -
విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య
నల్గొండ: సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సూర్యాపేట సీఐ మొగిలయ్య పూర్తిగా కోలుకున్నారు. బుధవారం నుంచి తిరిగి విధుల్లో చేరారు. నెలరోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట బస్టాండు హత్యాకాండలో గాయపడిన సీఐ కోలుకొని విధుల్లో చేరారు. సూర్యాపేట బస్టాండులో అర్ధరాత్రి సిమీ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు తో పాటు మరో హోంగార్డు మరణించగా సీఐ మొగలయ్య తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. సీఐ ఇంత త్వరగా తిరిగి విధుల్లో చేరడంతో ఆయన ధ్రుడచిత్తాన్ని, సంకల్పశక్తిని పలువురు కొనియాడుతున్నారు. -
విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు
కలెక్టరేట్ (కాకినాడ) : ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చిన తహశీల్దార్లు తక్షణం విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆయన ఆర్డీవోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వివిధ మండలాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ పలువురు విధుల్లో చేరలేదు. దీనిపై మండిపడిన జేసీ బుధవారం సాయంత్రంలోగా వారు విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమలాపురం డివిజన్లోని అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం; రామచంద్రపురం డివిజన్లోని అనపర్తి, రాయవరం; రాజమండ్రి డివిజన్లోని కడియం, సీతానగరం, ఆలమూరు; రంపచోడవరం డివిజన్లోని గంగవరం, రాజవొమ్మంగి తహశీల్దార్లు; కలెక్టరేట్లోని ఏవోతోపాటు హెచ్ సెక్షన్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్లు; రాజమండ్రి, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల ఏవోలు ఇంతవరకూ విధుల్లో చేరలేదు. నాలుగు రోజుల కిందట స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వారు బాధ్యతలు తీసుకోలేదు. వారందరూ బుధవారం సాయంత్రం లోగా విధుల్లో చేరాలని చివరిసారిగా జేసీ డెడ్‌లైన్ విధించారు. లేకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తులు సుమారు 25 వేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి నిర్దేశించిన గడువు పూర్తయినప్పటికీ ధ్రువపత్రాలు జారీ నిలిచిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవోలు సీరియస్‌గా తీసుకుని తక్షణమే పెండింగ్ దరఖాస్తులు క్లియర్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బీఆర్ అంబేద్కర్, కూర్మనాధ్, నాన్‌రాజ్, వరప్రసాద్‌తోపాటు పలువురు తీర ప్రాంత తహశీల్దార్లు పాల్గొన్నారు.