breaking news
Jips
-
జిప్పర్ ఇరుక్కుంటే బలంగా లాగొద్దు.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బ్యాగ్ లేదా దుస్తుల జిప్పర్ సరిగ్గా పనిచేయక మధ్యలోనే ఆగిపోయినప్పుడు తీవ్రమైన చికాకు కలుగుతుంది. అటువంటి సమయంలో గట్టిగా లాగితే జిప్పర్ పూర్తిగా ΄ాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంట్లో సహజంగా లభించే కొబ్బరినూనెను ఉపయోగించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాక్ అయిన జిప్పర్‌ను సులభంగా విడిపించవచ్చు.జిప్ లాక్ అయినపుడు బలవంతంగా లాగకుండా.. ముందుగా దారాలు లేదా క్లాత్ ఏమైనా ఇరుక్కుపోయాయో చెక్ చేయండి. జిప్పర్ రన్నర్ కింద దుస్తుల క్లాత్ లేదా ఏవైనా దారాలు ఉంటే వాటిని జాగ్రత్తగా పక్కకు తొలగించండి.కొద్దిగా కొబ్బరినూనెను చేతి వేలికి తీసుకుని, జిప్పర్ ట్రాక్ పొడవునా జాగ్రత్తగా పూయండి. నూనె జిప్పర్ పరిసరాల్లోని బట్టకు తగలకుండా చూసుకోవడం ప్రధానం.నూనె రాసిన తర్వాత, జిప్పర్ స్లైడర్‌ను ముందూ వెనుకకూ నెమ్మదిగా కదిలించండి. కొబ్బరినూనె జిప్పర్‌కు లూబ్రికెంట్‌గా పనిచేసి, స్లైడర్ సజావుగా సాగేలా చేస్తుంది.నూనె రాసినా జిప్పర్ కదలకపోతే టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయడం లేదా ట్వీజర్ సాయంతో ఇరుక్కుపోయిన దారాలను తొలగించడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది.ఇవి కూడా చదవండి: చెత్త ఇస్తే చదువు.. ఈ స్కూల్ ఐడియా అదిరిపోయింది! -
జిప్ జిమ్మిక్స్
వారం వారం ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్‌ను చూస్తున్నాం... ఈసారి జిప్స్తో జ్యుయెలరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం... అవునండీ.. జిప్స్ అంటే అమ్మాయిల డ్రెస్సులకు, అబ్బాయి ప్యాంట్ షర్ట్స్‌కు ఉండేవే... వింతగా అనిపిస్తున్నా అది నిజమండీ. ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల జిప్స్‌ను విడిగా అమ్ముతున్న వాటితో కానీ ఇంట్లో పాతబడిన డ్రెస్సులకున్న జిప్స్తో కానీ ఈ జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: జిప్లేసులు, జంప్రింగ్ చెయిన్స్, బీడ్స్, బ్రేస్లెట్ హుక్స్, ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్, గ్లూ, కత్తెర తయారీ: ముందుగా బ్రేస్లెట్ తయారీకి రెండు జిప్లేస్లను తీసుకొని వాటికి ఇరువైపులా ఉన్న క్లాత్‌కు గ్లూ పూయాలి. ఇప్పుడు ఒకదానికి రెండువైపులా రెండు జంప్రింగ్ చెయిన్స్‌ను అతికించాలి. మరోదానికి బీడ్స్ అతికించాలి. అవి రెండూ ఆరాక... వాటి చివర్లకు హుక్స్ను తగిలిస్తే సరి.. ఎంతో ఫ్యాషన్‌గా కనిపించే బ్రేస్లెట్స్ రెడీ. ఈ బ్రేస్లెట్లను జీన్స్ మీదకు పెట్టుకుంటే అదిరిపోతుంది. జిప్లేస్కున్న క్లాత్ కట్ చేసి పూసలు అతికిస్తే నెక్లేస్ రెడీ. అలాగే జిప్ హ్యాండిల్స్‌కు ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్‌ను తగిలిస్తే అవీ రెడీ అయినట్టే. అంతేకాకుండా జిప్ హ్యాండిల్స్‌ను జంపరింగ్స్తో జాయిన్ చేస్తే చెయిన్ తయారవుతుంది.


