breaking news
IT people
-
హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది
వాషింగ్టన్ : వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్సీఐఎస్(యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) వెల్లడించింది. ఎవరి దరఖాస్తులను ఆమోదించాలనే విషయంపై లాటరీ ద్వారా నిర్ణయిస్తామని కౌన్సిల్ తెలిపింది. ఎంపికైన వారి వివరాలను ఆయా దరఖాస్తుదారులు, వారి సంస్థలకు మార్చి 31 లోపు సమాచారాన్ని అందిచేస్తామని ప్రకటించింది. అలాగే హెచ్1-బీ క్యాప్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30వ తేదీని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ నిర్దేశించిన 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితి మించిందని తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేశారనే విషయాన్ని యూఎస్సీఐఎస్ ప్రకటించలేదు. భారత్, చైనా దేశాల నుంచి వేల మంది ఐటీ నిపుణులు ఎక్కువగా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం తెలిసిన విషయమే. -
ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా 10వేల మంది ఉద్యోగాల అవకాశాలను కల్పించనున్నామని అమెరికాకు చెందిన బహుళజాతి ఐటి సేవల సంస్థ డీఎక్స్ సీ టెక్నాలజీస్ తాజాగా ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక చేస్తామని తెలిపింది. వీరిలో 1500మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకుంటామంది. డిజిటల్ సేవలకై పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 10వేల మంది టెక్కీలను నియమించుకోవాలని యోచిస్తున్నామని డీఎక్స్‌సీ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ శాంసన్ డేవిడ్ తెలిపారు. కాగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో, యుఎన్ఎస్లో ప్రతిభావంతుల కొరతను ఎంఎన్‌సి ఐటి కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ స్థావరాన్ని భారతదేశానికి తరలిస్తున్నాయి. సీఎస్సీ, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ విలీనం తరువాత 2017 లో స్థాపించబడిన డీఎక్స్‌సీ ఐటి సంస్థలో భారతదేశంలో దాదాపు 45 వేల మంది పనిచేస్తుండగా, గ్లోబల్‌గా 1.30లక్షల మంది ఉన్నారు. -
సైబర్ నేరాలకు టెకీలతో చెక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్, ట్రాఫికింగ్, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల నుంచి ఐటీ నిపుణులను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఐఐటీలు, ప్రైవేటు సంస్థల నుంచి నిపుణులను నియమించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కోసం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు వీరి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఐటీ సెక్యూరిటీ నిపుణులు, ఎథికల్ హ్యాకర్లు, వెబ్ అనలిస్టులు, కంప్యూటర్ ప్రోగ్రామర్ల సేవలను వాడుకుంటూ సైబర్-ఫోరెన్సిక్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. హోంమంత్రిత్వ శాఖ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ కార్యకలాపాల కోసం ఐటీ నిపుణుల నుంచి కీలక సూచనలు, అభిప్రాయం కోరాలని యోచిస్తోంది. మరోవైపు సైబర్ క్రైమ్‌లను ఎదుర్కొనే విధాన ప్రకియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. హోమంత్రిత్వ శాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సైబర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్లో నాలుగు యూనిట్ల ఏర్పాటుకు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. -
హై సేవ
క్లాస్ లుక్.. హై‘టెక్’ లైఫ్‌స్టైల్.. ‘పర్సు’కొద్దీ జల్సా.. సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్.. వీకెండ్లో విందు వినోదాలు.. ఇదీ ఐటీ పీపుల్ గురించి అందరూ అనుకునే మాట. అయితే.. జీవితంలో ఇది ‘సమ్’తృప్తి మాత్రమే.. సామాజిక బాధ్యతను సరిగా నెరవేర్చితేనే పరిపూర్ణ ఆనందం అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అందుకే సేవ బాట పట్టాయి కార్పొరేట్ కంపెనీలు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ) ఆధ్వర్యంలో ఉన్నత లక్ష్యానికి శ్రీకారం చుట్టాయి. మేము సైతం అంటూ ‘హైసీ’ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ సంస్థల్లో తమ పనితనంతో హైదరాబాదీల టెక్నో పవర్ చూపిస్తున్నారు సిటీ టెకీలు. జాబ్లైఫ్లో సక్సెస్ గ్రేడ్ మెయింటేన్ చేస్తున్న వీరు ఉన్నత లక్ష్యం కోసం ఒక్కటయ్యారు. వారితో పాటు పదిమంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు. ఈ లక్ష్యం కోసం 13 ఏళ్ల కిందట 1991లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. తర్వాత ఐటీ, ఐటీఈఎస్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా(ఇట్స్‌ఏపీ) రూపాంతరం చెందింది. ఇటీవలే ఇది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ)గా మారింది. ప్రస్తుతం ఇందులో 300 మంది సభ్యులున్నారు. ‘హైసీ’లో టెక్నాలజీ ఫోరం, హెచ్ఆర్ ఫోరం, ఎస్ఎంఈ ఫోరం, సీఎస్సార్ ఫోరం అనే నాలుగు విభాగాలు ఉంటారుు. సీఎస్సార్ ఫోరం ప్రత్యేకంగా సావూజిక సేవపై దృష్టి సారిస్తుంది. వికలాంగులకు ఐటీ ట్రైనింగ్.. సామాజిక స్పృహ నిండిన ఈ టెకీలు.. అర్హత ఉన్నవారిని అందలం ఎక్కించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అర్హులైన వికలాంగులకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ బాధ్యతలను రెండు ఎన్జీవోలకు అప్పగించారు. ఆ ఎన్జీవోలు ఎంపిక చేసిన వికలాంగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేలా తీర్చిదిద్దుతారు. అన్నింటా చేయూత.. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ‘హైసీ’ కృషి చేస్తోంది. ఐటీ విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి తగిన సమాచారాన్ని, సూచనలను అందిస్తోంది. రానున్న కాలంలో హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రంగారెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో పది వేల మొక్కలు నాటి ఏడాదిపాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహించనుంది. పెట్రోల్, డీజిల్ పొదుపు చేసి, పర్యావరణానికి మేలు చేసే ఉద్దేశంతో సైకిల్ రైడింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు ‘హైసీ’ సభ్యులు. చెరువుల శుద్ధి కార్యక్రమంలో భాగంగా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో కూడా ‘హైసీ’ పాలుపంచుకుంటోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్రజల్లో అవగాహ కల్పిస్తోంది. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, నాయుకత్వ లక్షణాలు, వూనవీయు విలువలను పెంపొందించేందుకు లీడ్ ఇండియూ-2020 సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇట్స్ గ్రీన్థాన్’లో భాగంగా ఖాజాగూడ మినీ స్టేడియుంలో వందలాది మొక్కల పెంపకాన్ని చేపట్టింది. ఉత్తరాఖండ్ వరదలు, పైలీన్ తుపాను బాధితుల కోసం సావుగ్రి సేకరించింది. అసోసియేషన్‌కు అవసరమైన నిధులను నగరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సేకరిస్తున్నారు. పాఠశాలల దత్తత.. పేద పిల్లలకు సరైన విద్యను అందించడానికి నగరంలోని పలు పాఠశాలలు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముందుగా పాతబస్తీలోని పాఠశాలలతో దీన్ని మొదలుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. దత్తత తీసుకునే పాఠశాలలకు టేబుళ్లు, బెంచీలు, కంప్యూటర్లు అందజేస్తాం. అంతేకాదు తీరిక వేళల్లో ఆయా పాఠశాలలకు వెళ్లి పాఠాలు కూడా బోధిస్తాం. - రమేశ్ లోకనాథన్, ‘హైసీ’ అధ్యక్షుడు సీఎస్సార్ యాక్ట్.. దేశంలో సంపన్నులతో పాటు పేదలు పెరుగుతున్నారని అంతర్జాతీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నా అవి చాలడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలదే. అందుకే కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) చట్టాన్ని తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం కార్పొరేట్ సంస్థలు ఇక నుంచి వుూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం 2 శాతాన్ని సీఎస్సార్‌కు ఖర్చు చేయూలి. కనీసం రూ.500 కోట్ల నెట్‌వర్త్ లేదా రూ.1,000 కోట్ల టర్నోవర్ లేదా రూ.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీలు కచ్చితంగా సీఎస్సార్ కింద ఖర్చు చేయూల్సి ఉంటుంది. భారత్‌లో రిజిస్టర్ అరుున విదేశీ కంపెనీలకూ ఈ నిబంధనలు వర్తిస్తారుు. - ఆడెపు శ్రీనాథ్