ప్రభ మృతదేహం బంధువులకు అప్పగింత
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హత్యకు గురైన భారత మహిళా ఐటీ కన్సల్టెంట్ ప్రభా అరుణ్ కుమార్(41) మృతదేహాన్ని పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆమె స్వస్థలం మంగళూరుకు తీసుకెళ్లారు.
కాగా నిందితుల కోసం తాము అన్వేషిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ దారుణమైన దాడికి గల కారణాలేమీ తెలియరాలేదని హత్యా దర్యాప్తు అధికారి మైఖేల్ విలింగ్ తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రభ గత శనివారం తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుండగా హత్యకు గురైన విషయం తెలిసిందే.