breaking news
Indian Defence Ministry
-
ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లద్దాఖ్‌లో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సహకారంతో లద్దాఖ్ సెక్టార్లో ఈ ప్రయోగపరీక్షలు పూర్తయ్యాయి. గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో చేధించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్‌లో ఈ కొత్త ఆకాశ్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుని ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకుంది. ఆనాడు పాకిస్తాన్‌కు చైనా తయారీ యుద్ధవిమానాలు, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆకాశ్ ప్రైమ్ క్షిపణులు తప్పించాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. -
స్వల్ప దూర అగ్ని–1 ప్రయోగ పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం. గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్ సిస్టమ్ వంటి అన్ని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచి్చతత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు. -
రోల్స్ రాయిస్ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో విమాన ఇంజిన్ల సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ రూ.600 కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై రక్షణ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో నగదు లావాదేవీలన్నీ తవ్వి తీయాలని సీబీఐను కోరినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారమిక్కడ తెలిపారు. 2007-11 మధ్య హాక్ శిక్షణ విమానాలు (ఏజేటీ), జాగ్వార్ యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్ల సరఫరాకు ఉద్దేశించిన ఈ ఒప్పదంపై అంతర్గతంగా విచారించిన హాల్ నిఘా విభాగం... కొన్ని ఆరోపణలను ధ్రువీకరించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు హాల్, ఇతర విభాగాల్లోని అధికారులకు ముడుపులు ముట్టాయని రూఢీ చేసింది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్‌తో కుదిరిన గత ఒప్పందాలు, భవిష్యత్తు ఒప్పందాలపై, దళారుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తునకు రక్షణ మంత్రి ఆంటోనీ ఆదేశించారు. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రోల్స్ రాయిస్‌తో ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.