breaking news
india-pak
-
పాక్ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్
న్యూయార్క్: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ ప్రశ్నిస్తూ.. దాయాదిని ఇరుకునపెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్.. పాకిస్తాన్‌కు కౌంటరిచ్చారు. హరీశ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్‌కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.#IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 2025భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. 65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంలోకి చిత్తశుద్ధితో ప్రవేశించింది. ఒప్పందంపై స్పూర్తితో, స్నేహ భావంతోనే ఇన్ని రోజులు ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా భారత్‌పై పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసింది. ఉగ్రదాడులకు పాల్పడింది. సింధు జలాల ఒప్పందం స్పూర్తిని ఉల్లంఘించింది. నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్పుకొచ్చారు. -
‘అదే జరిగితే.. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు’
ఢిల్లీ: పాకిస్తాన్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచపటంలో తన ఉనికిని కోల్పోతుందన్నారు. భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భారత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు.. కావాలని ఎవరైనా జోలికి వస్తే వారిని వదిలిపెట్టబోమని ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపించామని చెప్పుకొచ్చారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఛత్తీస్‌గఢ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..‘పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. సైనిక బలగాల ధీరత్వానికి, మోదీ నాయకత్వానికి నేడు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలి. మన ఆడబిడ్డల సిందూరం తుడిచినవాని నట్టింటికి వెళ్లి నాశనం చేయడం దేశ శౌర్యానికి ప్రతీక. భారత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు.. కావాలని ఎవరైనా మనపైకి వస్తే వారిని వదిలిపెట్టబోమని ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపించాం. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం భారత సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ కారణంగానే దాయాది దేశం పన్నుతున్న కుట్రలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోంది’ అని వివరించారు.ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అంశంపైనా కేంద్రమంత్రి స్పందించారు. దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించడంతో ప్రభుత్వాలపై ఖర్చుల భారం అధికంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రజలు సైతం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు మద్దుతు తెలపాలని కోరారు. ప్రధాని మోదీ దార్శనికతతో తీసుకొచ్చిన ఈ బృహత్తర కార్యక్రమం గొప్పదని అన్నారు. -
ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్ ఓవరాక్షన్.. హెచ్చరిక అంటూ..
ఇస్లామాబాద్: భారత్, పాక్ ఘర్షణల వేళ పాకిస్తాన్ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.పాకిస్తాన్ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. -
అణు యుద్ధం వస్తే..!
-
ఇండో-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ
బ్యాంకాక్: భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్ల కీలక సమావేశం ఆదివారం బ్యాంకాక్‌లో జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా టెర్రరిస్టుల కార్యకలపాలు, జమ్ము కశ్మీర్, శాంతి-భద్రతల సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదార్లు అజిత్ దోవల్, నసీర్ జంజ్వా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత వారం పారిస్ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ కలసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరిగింది. వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం పాక్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాలను స్వాగతిస్తామని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.