breaking news
Increased cases
-
అంతా..నేరమయం
ఒంగోలు క్రైం: ఈ ఏడాది జిల్లా నేరమయంగా మిగిలింది. ఏవో కొన్ని మినహా అన్ని రకాల నేరాలు ఎక్కువ మందికి విషాదం మిగిల్చింది. 2017 సంవత్సరానికి సంబంధించి నేరాలను సింహావలోకనం చేసుకుంటే బాధితులకు కన్నీరే మిగిలిందని చెప్పక తప్పదు. 2016తో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు మినహా అన్నీ అధికంగానే జరిగాయని నిరూపితమైంది. మరీ ముఖ్యంగా హత్యలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రికవరీలో ఊరట రికవరీ విషయంలో పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది. ప్రజల సొత్తు రూ.5.17 కోట్లు అపహరణకాగా అందులో రూ.3.44 కోట్లు రికవరీ చేశారు. వీటితో పాటు జిల్లాలో సంచలనం రేపిన కేసుల విషయంలో పోలీసుల వేగంగా ఛేదించారు. వేమవరం జంట హత్యలు, ప్రతి చర్యగా చేపట్టిన దాడులు, పీసీపల్లి మండలంలో ఐదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు, ఒంగోలు దంపతుల హత్య కేసు, ఒంగోలులో రూ.3 కోట్ల దొంగతనం, కారులో రూ.2 కోట్ల బంగారు ఆభరణాలు, నగదు కేసు, ఏటీఎంల వద్ద మాటు వేసే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, కందుకూరు ప్రాంతంలో వృద్ధ మహిళల హత్యలతో పాటు మరి కొన్ని కేసులను త్వరితగతిన ఛేదించి జిల్లా ప్రజలకు పోలీసులు కొంత ఊరట కలిగించారు. రోడ్డు ప్రమాద మృతులు ఈ ఏడాది 466 ప్రమాదాల్లో 518 మంది గతేడాది 507 ప్రమాదాల్లో 569 మంది క్షతగాత్రుల సంఖ్య ఈ ఏడాది 903 రోడ్డు ప్రమాదాల్లో 1857 గతేడాది 870 రోడ్డు ప్రమాదాల్లో 1,944 తీవ్రమైన దొంగతనాలు ఈ ఏడాది 62 గతేడాది 97 -
'అవినీతి' కి దడ
ముమ్మరంగా ఏసీబీ దాడులు అడ్డంగా దొరికిపోతున్న అవినీతి అధికారులు గత ఏడాదితో పోలిస్తే పెరిగిన కేసులు దొరికిన వారిలో ఎక్కువమంది గెజిటెడ్లే తాజాగా టీటీడీ డిప్యూటీ ఈవో ఇంటిపై దాడి తిరుపతి: జిల్లాలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల నేపథ్యంలో వారికి కంటిమీద కునుకు లేకుం డాపోతోంది. ఆదాయానికిమించి ఆస్తులు కలి గిన వారు, చెక్‌పోస్టులు, ప్రభుత్వ కార్యాల యాలపై దాడులతో హడలిపోతున్నారు. ఇ ప్పటికే పలువురు అధికారులు, అవినీతి జరిగే కార్యాలయాల జాబితా ఏసీబీ చేతిలో ఉండడంతో ఏ క్షణాన దాడులు జరుగుతాయోనని బెంబేలెత్తుతున్నారు. తాజాగా సోమవారం టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో పలువురు అధికారులు వణికిపోతున్నారు. ఈ ఏడాది చిక్కినవారిలో ఎక్కువమంది గెజిటెడ్ అధికారులే ఈ ఏడాది ఏసీబీ దాడుల్లో ఇప్పటి వరకు 13 మంది అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది గెజిటెడ్ అధికారులే ఉండడం గమనార్హం. ఇందులో నలుగురు తహశీల్దార్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు వీఆర్వోలు, ఎండోమెంట్ అధికారి ఒకరు, ఎక్సైజ్ శాఖలో ఈఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో ఏఈలు ఉన్నారు. ఇవేకాకుండా ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కమర్షియల్ చెక్‌పోస్టులు 3, రవాణా చెక్‌పోస్టు 1, ఆస్పత్రులు 1, సాంఘిక సంక్షేమ శాఖపై రెండు సార్లు దాడులు నిర్వహించారు. పెరిగిన కేసులు సంవత్సరం ట్రాప్‌లు ఆదాయానికి మించిన ఆకస్మిక తనిఖీలు ఆస్తులపై దాడులు 2014-15 09 01 07 2015-16 13 04 08 2014-15 సంవత్సరంలో తొమ్మిది మంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఒకరిపైన దాడులు చేయగా, కమర్షియల్ చెక్పోస్టులపై మూడుసార్లు, ట్రాన్స్‌పోర్టు చెక్పోస్టులపై మరో మూడు సార్లు, రిజిస్ట్రార్ ఆఫీసుపై ఒకసారి దాడులు కొనసాగాయి. ఆయాశాఖల అధికారులపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అవినీతి అధికారుల భరతం పడతాం అవినీతి అధికారుల భరతం పడతాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వ్యక్తులుంటే వారి పేర్లు మా దృష్టికి తీసుకురావచ్చు. వారి పేర్లలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా లంచం ఇవ్వందే పనిచేయమని ఇబ్బంది పెడితే వెంటనే మాకు తెలియజేయండి. వారిని ట్రాప్ చేసి కేసులు నమోదు చేస్తాం. అవినీతి ఎక్కడైన జరుగుతుంటే ఈ నెంబరుకు 9440446190 ఫోన్ చేసి విషయం చెప్పండి. -శంకరరెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి