breaking news
Incentive Award Scheme
-
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్‌ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
51 మందికి ప్రోత్సాహక అవార్డులు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నగదు పురస్కారాలను ప్రకటించింది. 2014-15 సంవత్సరానికి సంబంధించి ‘ఇన్సెంటివ్ అవార్డు’ పథకంలో వీరిని ఎంపిక చేసింది. సచివాలయంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న 51 మందికి ఈ అవార్డులు అందించనుంది. శనివారం జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు వీరికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్‌చంద్ర సారథ్యంలోని ఇన్సెంటివ్స్ అవార్డు కమిటీ వివిధ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి వీరిని ఎంపిక చేసింది. మొదటి కేటగిరీలో అధికారులకు రూ.20 వేలు, రెండో కేటగిరీలో ఉద్యోగులకు రూ.15 వేలు, మూడో కేటగిరీ ఉద్యోగులకు రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తారు. ప్రభుత్వ ఆమోద ముద్రఅనంతరం సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి వికాస్‌రాజ్ శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో జీఏడీ, సీఎంవో కార్యాలయాలకు మాత్రమే ఈ అవార్డులు పరిమితమయ్యాయి. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విభాగాలు, జిల్లాల్లో పని చేసిన అధికారులకు సైతం ఈ అవార్డులకు ఎంపిక చేయటం గమనార్హం. మొదటి కేటగిరీ ఎన్.శంకర్, అడిషనల్ సెక్రెటరీ (జీఏడీ జనరల్); ఆర్వీ స్వయంప్రభ, డిప్యూటీ సెక్రెటరీ (జీఏడీ అకామిడేషన్); ఎస్.శ్రీనివాస్, డిప్యూటీ సెక్రెటరీ (నీటిపారుదల విభాగం); జి.దేవేందర్‌రావు, అసిస్టెంట్ సెక్రెటరీ (జీఎడీ సర్వీసెస్); జె.అరుణ్‌కుమార్, అసిస్టెంట్ సెక్రెటరీ (పంచాయతీరాజ్); ఎం.నరేందర్‌రావు, అసిస్టెంట్ సెక్రెటరీ (రెవెన్యూ); ఎల్.లక్ష్మీ వెంకటసుబ్బమ్మ, అసిస్టెంట్ సెక్రెటరీ (నీటిపారుదల); కె.అశోక్‌రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్, ఇరిగేషన్ మినిస్టర్ పీఎస్; బి.మల్లయ్య, జాయింట్ డెరైక్టర్ (బీసీ వెల్ఫేర్); బి.అమృతలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ (కమర్షియల్ టాక్స్); సయ్యద్ విలాయత్ హుస్సేన్, జీఎం (మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్); ఏవీ రాజ్‌కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్ (ప్రొటోకాల్ డిపార్టుమెంట్ డెరైక్టర్); సంగ సురేశ్, డిప్యూటీ డెరైక్టర్ (పరిశ్రమల శాఖ కమిషనర్ ఆఫీస్); ఎం.ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (రంగారెడ్డి జిల్లా); నర్సింహరావు, ఈఈ (దేవాదాయశాఖ); రాజేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయశాఖ, కరీంనగర్ జిల్లా) రెండో కేటగిరీ డి.సుక్లేష్కుమార్, సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ సర్వీసెస్); సీహెచ్.శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ ఓపీ-1); వై.అన్నపూర్ణ, సెక్షన్ ఆఫీసర్ (జీఏ అకామిడేషన్); మహమ్మద్ యూసుఫ్, సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ సర్వీసెస్); నర్మాల శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ సర్వీసెస్); డి.కిషన్, సెక్షన్ ఆఫీసర్ (పంచాయతీరాజ్); పి.లింగమూర్తి, సెక్షన్ ఆఫీసర్ (రెవెన్యూ); ఎస్.శ్రీనివాసరెడ్డి, సెక్షన్ ఆఫీసర్ (రెవెన్యూ); ఆర్.రవి, సెక్షన్ ఆఫీసర్ (నీటిపారుదల); జి.శివకృష్ణ, పీఎస్ (స్పెషల్ సెక్రెటరీ టు సీఎం); సీహెచ్. శ్రీనివాసులు, పీఎస్ టు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ; ఏ.శ్రీధర్‌రెడ్డి, ఏవో (నల్లగొండ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్); జి.శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ (బీసీ వెల్ఫేర్); ఎస్.పురుషోత్తంరావు, డీసీటీవో (హైద్రాబాద్ విజిలెన్స్); కె.రవీందర్, డిప్యూటీ ఈఈ, నల్లగొండ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్; పి.అశోక్‌వర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్ (అగ్రికల్చర్) విజిలెన్స్; సీహెచ్.రామయ్య, సూపరింటెండెంట్ (డిపార్టుమెంట్ ఆఫ్ ప్రొటోకాల్) మూడో కేటగిరీ కె.పార్థసింహారెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(జీఏడీ); ఇ.చిట్టిబాబు, ఏఎస్వో(జీఏడీ); సీహెచ్.బంగారు రాజు, ఏఎస్వో(జీఏడీ); ఎ. మధుసూదన్, ఏఎస్వో (జీఏడీ); సాజీదా బేగం, ఏఎస్వో (పంచాయతీరాజ్); రాము భూక్యా, ఏఎస్వో (పంచాయతీరాజ్); వి. ప్రశాంత్, ఏఎస్వో (రెవెన్యూ); ఎస్.రామలింగయ్య, ఏఎస్వో (ఇరిగేషన్); బీహెచ్. విద్యామాధవి, ఏఎస్వో (ఇరిగేషన్); విజయకుమార్, పీఏ టు సీఎం స్పెషల్ సెక్రెటరీ; ఎం.విజయకుమార్, ఏఎస్వో(జీఏడీ విజిలెన్స్); కె.నాగవేణి, సీనియర్ అసిస్టెంట్ (జీఏడీ విజిలెన్స్); ఎన్.వెంకటేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వరంగల్ విజిలెన్స్; వి.ముత్యాలు, జమేదార్ (సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ); టి.యశోదాబాయి, ఆఫీస్ సబార్డినేట్ (జీఏడీ); ఎస్ఏ మజీద్, ఆఫీస్ సబార్డినేట్ (సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ); ఎ. అనిల్ కుమార్, డ్రైవర్ (బీసీ వెల్ఫేర్).. వీరితో పాటు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)ను మెరిట్ సర్టిఫికెట్‌కు ఎంపిక చేసింది.