breaking news
Historic preservation
-
‘చారిత్రాత్మక’ బాధ్యతల నుంచి హెచ్ఎండీఏ ఔట్
సాక్షి, హైదరాబాద్: చారిత్రాత్మక కట్టడాలు/ప్రాంతాల పరిరక్షణ బాధ్యతల నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఏపీ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ చట్టంలో చారిత్రాత్మక ప్రాంతాల సంరక్షణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ 1995లో అప్పటి ప్రభుత్వం జీవో 542 ద్వారా ఈ బాధ్యతలను హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ(హుడా)కు అప్పగించింది. తదనంతరం హెచ్ఎండీఏ చట్టంలో 13వ నిబంధనగా చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ చేరిపోయింది. అయితే, 13వ నిబంధన.. ఏపీ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ చట్టంతో సంబంధం లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్ తేల్చి చెప్పడంతో తాజాగా చట్టం నుంచి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. -
మార్పునకు ఓకే
చారిత్రక కట్టడాల పరిరక్షణకే సర్కార్ మొగ్గు మెట్రో అలైన్మెంట్ మార్పుతోనే ఇది సాధ్యం మెట్రో నుంచి తప్పిన కట్టడాల జాబితా వెల్లడి సిటీబ్యూరో: చారిత్రక కట్టడాల పరిరక్షణకు సర్కార్ పెద్దపీట వేసింది. వారసత్వ, చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు లేకుండా మెట్రో రైల్ కారిడార్-2లో అలైన్మెంట్ మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆయా వర్గాల వారు తాజా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏడు మందిరాలు, 28 వరకు ప్రార్థనాస్థలాలు సురక్షితంగా బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి ఇచ్చిన లేఖలో అలైన్మెంట్ మార్పుతో సురక్షితంగా ఉండేకట్టడాల జాబితాను వెల్లడించింది. ఆ వివరాలివే... జాబితాలో వెల్లడించిన మందిరాలు.. అలీజా కోట్లలోని కట్టమైసమ్మ దేవాలయం, హరిబౌలి-అక్కన్నమాదన్న దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ప్రార్థనాలయాలు, బేలాలోని బంగారు మైసమ్మ దేవాలయం, శాలిబండలోని జగదీశ్ టెంపుల్, శాలిబండలోని శ్రీలక్ష్మీనరసింహ దేవాలయం, అలియాబాద్లోని దర్బార్ మైసమ్మ దేవాలయం. సురక్షితంగా ఉండే మసీదులు, చిల్లాలు, దర్గా, శ్మశాన వాటికలు.. మూసీ ఎడమవైపు ఉన్న మసీదు. దారుల్షిఫాలోని చిల్లా(రోటరీ జంక్షన్). దారుల్షిఫా ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గల రెండు పురాతన శ్మశానవాటిక లు. పురానిహవేలిలోని మజీద్ ఈ ఎండీ ఇస్మాయిల్ ఖాన్ బక్షి. పురాణి హవేలీలోని మసీదు. నల్ ముబారక్. పురాని హవేలీ దర్గా. ఈతేబార్చౌక్ మసీదు. ఎల్హెచ్ఎస్ మసీదు. ఈతే బార్చౌక్ వద్ద రహదారి మధ్యనున్న మసీదు. అహలే అదీజ్ మసీదు. అస్లాం ఫంక్షన్‌హాలు వద్దనున్న మసీదు. అస్లాం ఫంక్షన్‌హాలు వద్ద రహదారి మధ్యనున్న మసీదు. అక్బర్ ప్లాజా వద్దగల దయీ ముర్తజా. మీర్‌మోమిన్ దర్గా. మీర్‌మోమిన్ దయిరా వద్దనున్న మసీదు. రహదారి మధ్యనున్న చిల్లా. మసీద్ ఇ ఫక్రున్నిసా. దర్గా ఆన్ ఎల్హెచ్ఎస్ ప్రేయర్‌హాల్-2. దర్గా షరీఫ్ హజ్రత్ ఆన్ ఎల్హెచ్ఎస్. శాలిబండ శ్మశానవాటిక. శాలిబండ దర్గా. షాగౌస్ హోటల్ వద్దనున్న కంబాల్ మసీదు. శ్మశానవాటిక. మసీద్ ఈ ఆసిన్ ఎల్హెచ్ఎస్. గ్రేవ్‌యార్డ్ ఆన్ ఆర్హెచ్ఎస్. అలియాబాద్ జెండా వద్దనున్న చిల్లా. దర్గా ఆన్ ఆర్హెచ్ఎస్. గ్రేవ్‌యార్డ్ అండ్ తాకియా మొఘల్ మసీద్ ఆన్ ఆర్హెచ్ఎస్ ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు బుధవారం కారిడార్-2లోని పలు ప్రాంతాలను సందర్శించారు. సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఫలక్‌నుమా వరకు గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. దారుషిఫా, పురానీహవేలి, అలిజాకోట్ల, బీబీబజార్ చౌరస్తాలోని ప్రాంతాల్లో దూరాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనుల అలైన్‌మెంట్‌ను మార్పు చేయడంతో గతంలో అధికారులు నిర్దేశించిన ప్రతిపాదనలను పునఃపరిశీలించారు. - యాకుత్‌ఫురా