breaking news
HGC team
-
రణధీర్ అజేయ సెంచరీ
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: రణధీర్ (124 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో హెచ్‌జీసీ జట్టు 13 పరుగుల తేడాతో ఎల్‌బీసీసీపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఎల్‌బీసీసీ బౌలర్లు దినేశ్, పరమేశ్వర్, విశాల్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌బీసీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులే చేయగలిగింది. దినేశ్ (65) అర్ధసెంచరీ చేయగా, గిరీశ్ (37) ఫర్వాలేదనిపించాడు. హెచ్‌జీసీ బౌలర్లు మోహన్, వినయ్, అవినాశ్, చరణ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో యాదవ్ డెయిరీ 145 పరుగుల తేడాతో సెయింట్ సాయిపై ఘనవిజయం సాధించింది. మొదట యాదవ్ డెయిరీ జట్టు 256 పరుగులు చేసింది. ఫైజల్ అలీ (110, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా, శ్రీనివాస్ (50) రాణించాడు. సెయింట్ సాయి బౌలర్లు రాజేశ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ సాయి జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. రాజా 38, రాజు 30 పరుగులు చేశారు. యాదవ్ డెయిరీ బౌలర్లలో సాయిచరణ్ (5/37) విజృంభించాడు. రిషబ్‌కు 4 వికెట్లు దక్కాయి. -
కమల్‌కు ఏడు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: మయూర సీసీ బౌలర్ కమల్ కుమార్ (7/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో హెచ్‌జీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన మయూర సీసీ 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి నెగ్గింది. కమల్ కుమార్ (31 నాటౌట్), సంజయ్ సింగ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో విజయ్ సీసీ బౌలర్ దీపాంకర్ 7 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో మహావీర్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన మహావీర్ సీసీ 140 పరుగులకు ఆలౌటైంది. సుధాకర్ 30 పరుగులు చేశాడు. తర్వాత విజయ్ సీసీ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి గెలిచింది. నాగరాజ్ (39), శివ (36 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనార: 216 (రాహుల్ 36, వేణు 41; నిరూప్ 6/60); గ్రీన్ టర్ఫ్: 181/7 (ఫరాన్ 37, సుధీర్ 38; నయన్ 4/50). అపెక్స్ సీసీ: 216/9 (అన్వర్ అలీ 41, అబ్దుల్ అజీమ్ 41; యూసఫ్ 5/58, జగదీశ్ 3/35); ఆడమ్స్ ఎలెవన్: 94 (హషమ్ అలీ 7/39). రోహిత్ ఎలెవన్: 218/9 ( సాయి రామ్ 35, రంజిత్ 55; ప్రఫుల్ కుమార్ 4/72); ఎస్ రేమాండ్స్: 174 (సుధీర్ 43; రంజిత్ 4/22). ఏబీ కాలనీ: 126 (అరవింద్ 47, సతీష్ 36, ప్రతీక్ 4/24); వీపీవీఎం: 130/6 (విజయ్ 47, షాకీర్ 45, సతీష్ 3/21). సెయింట్ ప్యాట్రిక్స్: 102 (కృష్ణ సాయి 5/23); సీకే బ్లూస్: 104/3 (వరుణ్ 39, విష్ణు నాయక్ 36; అభిలాష్ 3/35). స్పోర్టివ్: 170 (రాము 40; విక్రమ్ 3/45, అంబాదాస్ 4/36); తారకరామ: 172/5 (శివ కుమార్ 70). స్టార్లెట్స్: 112 (శివ కోటి రెడ్డి 3/30, సావర్ బోరంచ 3/21); టైమ్ సీసీ: 115/2 (సావన్ బోరంచ 40 నాటౌట్, శివ కోటి రెడ్డి 40 నాటౌట్).