breaking news
Helicopter rides
-
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఆకాశ వీధి నుంచి హైదరాబాద్ అందాలు
♦ నేటి నుంచి నగరంలో హెలికాప్టర్ రైడ్స్.. ♦ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్ : అంతెత్తున ఠీవిగా నిలిచిన చార్మినార్.. గొప్ప కోటల్లో ఒకటిగా ఖ్యాతి పొందిన గోల్కొండ.. మానవ నిర్మిత పెద్ద జలాశయాల జాబితాలో మనకూ చోటు కల్పించిన హుస్సేన్‌సాగర్.. పాలరాతి అద్భుతం బిర్లా మందిర్.. చారిత్రక ఖ్యాతితోపాటు ఆధునిక హంగులద్దుకున్న భాగ్యనగరం.. ఇందులో ఏదీ మనకు కొత్తకాదు.. కానీ గగనతలం నుంచి వీటిని వీక్షిస్తే.. రోజూ చూసే నగరం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడా అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పిస్తోంది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ ప్రాజెక్టును ఇటీవల మేడారం జాతర సందర్భంగా ప్రారంభించిన ప్రభుత్వం.. అందులో భాగంగా హైదరాబాద్ ఏరియల్ ట్రిప్‌ను మంగళవారం నుంచి ప్రారంభిస్తోంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సేవలు మొదలుకానున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవే ట్ లిమిటెడ్‌తో కలసి పర్యాటక శాఖ ‘హెలి టూరిజం ఇన్ హైదరాబాద్’ను నిర్వహిస్తోంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఉండే జాయ్ రైడ్‌కు రూ.3500గా టికెట్ ధర నిర్ణయించారు. దీనికి స్పందన లభిస్తే ట్రిప్పు నిడివి పెంచుతూ నగర సమీపంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్, వరంగల్, కరీంనగర్, నల్లమల అడవి, కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాలు తదితరాలతో దీన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు.