breaking news
Head nurse
-
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
గోకవరం(తూర్పు గోదావరి జిల్లా): హెడ్ నర్సు వేధిస్తుందని ఆరోపిస్తూ స్టాఫ్ నర్సు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గోకవరం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కొవ్వూరుకు చెందిన నారికమల్లి డేజి రత్నదీపిక స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రెండేళ్లుగా వైద్యవిధాన పరిషత్‌తో కాంట్రాక్టు విధానంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుంది. మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న ఆమె.. హెడ్ నర్సు వేధిస్తుందంటూ స్పిరిట్ తాగింది.ఆమెను గుర్తించిన స్థానిక సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, గత జనవరి నుంచి హెడ్ నర్సు లీల తనను మానసికంగా వేధిస్తుందన్నారు. అకారణంగా దూషించడం, పేషెంట్ల ముందు చులకనగా మాట్లాడుతుందన్నారు. మధ్యాహ్నం జనరల్ వార్డులో విధులు నిర్వహిస్తున్న తనను మందుల విషయమై ఇష్టానుసారంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలిపింది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వనజను సంప్రదించగా, స్టాఫ్ నర్సును హెడ్ నర్సు వేధింపులకు గురి చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఓపీ పెరగడం, సిబ్బంది తక్కువగా ఉండటంతో పని ఒత్తిడి పెరిగిందన్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు, తాము సిబ్బందికి పనులు కేటాయిస్తున్నామని, వేధింపులు వంటి వాటికి తావులేదన్నారు. మందుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై స్టాఫ్ నర్సు స్టేట్మెంట్ను హెచ్‌సీ వీర్రాజు రికార్డు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్ నర్స్ మృతి
శ్రీకాకుళం, నరసన్నపేట: జాతీయ రహదారిపై మండలం కంబకాయ కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్ర మాదంలో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న భా నుమతి బరోడా (47) మృతి చెందారు. ఆస్పత్రిలో విధులు పూర్తయిన అనంతరం భర్త మోహన్‌కుమార్ దాస్‌తో కలిసి ఆమె స్వగ్రామం సారవకోటకు బయల్దేరారు. సత్యవరం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. భర్త మోహనకు మార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీ య రహదారి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. చికిత్స ప్రారంభించేలోగానే ఆమె కన్ను మూశారు. భానుమతి పదేళ్లు నరసన్నపేట, పాతపట్నం ఆస్పత్రుల్లో సేవలు అందించారు. గత నవంబర్లోనే హెడ్ నర్సుగా పదోన్నతి పొంది పాతపట్నం నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు వచ్చా రు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. హెడ్‌నర్సు మృతితో స్వగ్రామం సారవకోటతో పాటు రిమ్స్‌లోనూ విషాద ఛాయ లు అలముకున్నాయి. -
'మైండు దొబ్బింది.. గాజులు కొట్టేశా'
సాక్షి, అనంతపురం : ‘మైండు దొబ్బింది..బంగారు గాజులు కొట్టేశాను. అంతే తప్ప నాకింకేం తెలియదు అంటూ సర్వజనాస్పత్రిలో ఓ హెడ్‌నర్సు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... గత నెల 26న ఆస్పత్రిలోని లేబర్ వార్డు ఉదయం పేషంట్‌కు సేవలందించిన తర్వాత చేతులు కడుక్కునే సమయంలో ఓ స్టాఫ్‌నర్సు గాజులను తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచింది. దీనిని గమనించిన హెడ్‌నర్సు గుట్టుచప్పుడు కాకుండా వాటిని కొట్టేసింది. కాసేపటికి స్టాఫ్‌నర్సు బ్యాగ్‌ను చెక్ చేసుకోగా అందులో గాజులు కన్పించలేదు. రూ.లక్ష విలువ చేసే బంగారు గాజులు పోయాయని కన్నీటి పర్యంతమైంది. ఆదివారం కావడంతో సూపరింటెండెంట్ కార్యాలయంలో సీసీ పుటేజ్ చూసేందుకు కూడా వీలు కాలేదు. ఆ మరుసటి రోజు విషయాన్ని నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. సీసీ పుటేజ్‌ను పరిశీలించిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై సూపరింటెండెంట్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించడంతో ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ల సమక్షంలో సదరు హెడ్‌నర్సు నిజాన్ని ఒప్పుకుంది. ఎందుకు అలా చేశావని అడిగితే మైండు దొబ్బిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీనిపై తదుపరి చర్యలు ఏం తీసుకుంటారోనని ఆస్పత్రి ఉద్యోగులు ఉత్కంఠగా చూస్తున్నారు. -
సూపరింటెండెంట్ వేధింపులతో.. హెడ్నర్స్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సు ఆంథోనమ్మ శనివారం ఆస్పత్రిలోనే స్పిరిట్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 8.40 నిమిషాలకు హెడ్ నర్సు ఆంథోనమ్మ ఆస్పత్రికి వచ్చి వార్డులో రౌండింగ్‌కు వెళ్లింది. ఆంథోనమ్మ ఫీమేట్ సర్జికల్ వార్డులో డ్యూటీ చేస్తుండగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బయ్య తన చాంబర్‌కు పిలిపించారు. డ్యూటీకి ఆలస్యంగా పది గంటలకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. తాను ఆలస్యంగా రాలేదని, 8.40 నిమిషాలకే డ్యూటీకి వచ్చానని ఆమె వివరణ ఇవ్వగా.. నర్సింగ్ సూపరింటెండెంట్ తనకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆంథోనమ్మ ఫిమేల్ సర్జికల్ వార్డులో ఉన్న స్పిరిట్‌ను తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను గమనించిన తోటి నర్సింగ్ సిబ్బంది చికిత్స చేసేందుకు యత్నించగా నిరాకరించింది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, ఆర్ఎంఓ శోభాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బయ్య అక్కడకు చేరుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ దృశ్యాలను విలేకరులు ఫొటోలు తీస్తుండగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చి చిన్నచిన్న విషయాలను ఫొటోలు తీయడం మంచిది కాదని, మరోసారి ఆస్పత్రికి రావద్దని విలేకరులతో అన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ తనపై నిఘా ఉంచి ప్రతీ పదినిమిషాలకు ఎం చేస్తోందో గమనించమని అంటోందని, ఈ విషయంపై పది రోజుల క్రితం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు హెడ్ నర్సు ఆంథోనమ్మ తెలిపారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసిందని ప్రతి సారి తనను పిలిచి వివరణ అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. నిజాయితీగా పనిచేసే వారిని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. తాను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, తనపై అధికారులు ఎవరూ ఆమెలా ప్రవర్తించలేదని ఆవేదన వ్యక్తంచేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్‌కు, సిబ్బందికి వాగ్వాదం ఆంథోనమ్మ ఆత్మహత్యాయత్నానికి నర్సింగ్ సూపరింటెండెంట్ వైఖరే కారణమని నర్సింగ్ సిబ్బంది కొంతమంది ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఎంఓ శోభాదేవి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్బయ్య ఇరువర్గాల వారికి నచ్చచెప్పి అక్కడినుంచి పంపించారు. ఇది చిన్న విషయమే: సూపరింటెండెంట్ సుబ్బయ్య ఆంథోనమ్మ ఆత్మహత్యాయత్నం చిన్న సంఘటనే. దీనిని విలేకరులు పెద్దది చేయొద్దు. ఆస్పత్రిలో ఈ వివాదాన్ని పరిష్కరిస్తాం.