breaking news
groundnut cultivation
-
ఆశల పంట 'ఎండు'తోంది
కోవెలకుంట్ల: కోటి ఆశలతో ఈ ఏడాది రబీ సీజన్లో మొదటి పంటగా శనగ సాగు చేసిన రైతులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనానికి ముందు అక్టోబర్ నెలలో మోంథా తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలతో అదునుకు విత్తనం వేయలేకపోయారు. పొలాల్లో తడి ఆరకపోవడంతో సాగు ఆలస్యమైంది. పైరు మొలకెత్తిన తర్వాత ఎండు తెగులు, కలుపు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలను సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్లలో 6,950, ఉయ్యాలవాడలో 11,076, దొర్నిపాడులో 3,011, కొలిమిగుండ్లలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో వారం, పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. పొలాల్లో తడి ఆరకపోవడం, భారీ వర్షాల కారణంగా పొలాల్లో కలుపుమొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. నవంబర్ రెండవ వారం వరకు విత్తన పనులు కొనసాగాయి. సాగుకు అదును దాటి పోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనగసాగు తగ్గిపోవడంతో సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొని విత్తనం వేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు ఇప్పటికే రూ. 15 వేలు వెచ్చించారు. కౌలు రైతులకు కౌలు రూపంలో అదనంగా మరో రూ. 10 వేలు భారం పడింది. గతేడాదీ నుంచి గోదాములోనే.. గత ఏడాది జిల్లాలో 79 వేల హెక్టార్లలో శనగ పంట సాగుచేశారు. విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. వరణుడిపై భారం వేసి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో విస్తారంగా శనగ పంట సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు వేలాది రూపాయాలు వెచ్చించారు. మోతాదును మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరు దెబ్బతిని నష్టం చేకూరింది. ప్రతి కూల పరిస్థితులతో ఎకరాకు 5 బస్తాల్లోపే దిగుబడులు వచ్చాయి. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్లో శనగకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ధరకు విక్రయించలేక పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకున్నారు. ప్రభుత్వం క్వింటా రూ. 8,750 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్లో క్వింటా రూ. 5 వేలు పలకపోవడంతో ఇప్పటికి దిగుబడులు గోదాములు దాటలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు కోటి బస్తాల దిగుబడులు గోదాముల్లో నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది దిగుబడులు అమ్ముడపోక ఈ ఏడాది కోటి ఆశలతో సాగు చేయగా తెగుళ్లు వెంటాడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అదును దాటాక విత్తనం వేయడంతో పైరు అరకొరగా మొలకెత్తడంతో ఆ పంటను తొలగించే పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పైర్లను పరిశీలించి తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. వేరుకుళ్లు.. ఎండబెడుతోంది..పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నకపోవడం, మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించింది. ఈ తెగులు ఆశించిన పైరులో మొక్క ఎండిపోయి చనిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగులు ఆశించిన పైరులో బైళ్లు, బైళ్లుగా మొక్కలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల ఖాళీ పొలం కన్పిస్తోంది. జిల్లాలో ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తుపాన్ కారణంగా పొలాల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో తెగులు ఆశించి పైరు దెబ్బతింటోందని వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు వెచ్చించగా పైరు ఎండు తెగులు కారణంగా శనగ ఎండిపోతుండటంతో రైతులు దిగుబడులపై ఆందోళన చెందుతున్నారు. పంటంతా తెగులే ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో పూలేజి రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, రెండు దఫాల క్రిమి సంహారక మందుల పిచికారి, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. తేమ శాతం అధికంగా ఉండటంతో పంటంతా ఎండు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు.– సుధాకర్‌రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం శనగ సాగు కలిసి రావడం లేదు రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఇరవై ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 15 వేలు చెల్లించి మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేశాను. పైరు నెల రోజుల దశలో ఉంది. పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 12 వేలకు పైగా ఖర్చు చేశాను. అధిక వర్షాలతో శనగ అదునుకు సాగు చేయలేకపోవడం, పొలంతో తేమ శాతం అధికంగా ఉండటంతో ప్రస్తుతం పైరును వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోయి పొలం బైళ్లుగా ఏర్పడుతోంది.– రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
వేరుశెనగ పంటకు అనంతపూర్ జిల్లా పుట్టిల్లు
-
వివిధ నూతన రకాల సాగులో రైతుల ఆసక్తి
-
ఎటువంటి రసాయనాలు కలపని గానుగ నూనె తయారీ..!
-
కష్టాలు పడుతున్న వేరుశనగ రైతులు
-
రైతులకు అధిక లాభాలను అందించే వేరుశెనగ సాగు
-
వేరుశెనగ నాటడం ఎలా: ఉత్తమ చిట్కాలు మరియు ఉపాయాలు
-
వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు
-
తగ్గుతున్న వేరుశనగ సాగు
ఆదోని: వేరుశనగ సాగు క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్ల క్రితం లక్షా 70వేల హెక్టార్లలో ఈ పంట సాగు అయ్యేది. ఇందులో సగానికి పైగా ఆదోని రెవిన్యూ డివిజన్లో ఉండేది. ఎర్ర నేలలు ఎక్కువగా ఉండడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగా చేతికి అందేవి. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపేవారు. ఈ పంటపై ఆధారపడి కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరులో రెండొందలకు పైగా నూనె మిల్లులు, డిగాటిగేటర్స్ ఏర్పాటు అయ్యాయి. అయితే ఏటేటా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గిపోతుండడంతో నూనె మిల్లులకు ముడిసరుకు తగ్గుతోంది. ఫలితంగా అవి మూతపడుతున్నాయి. సాగు తగ్గడానికి ఇవీ కారణాలు.. మార్కెట్లో వేరుశనగకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. సబ్సిడీ విత్తనాల కోటా కూడా తగ్గింది. ప్రస్తుతం క్వింటం ధర రూ.2400 నుంచి 3200 మధ్య మాత్రమే పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు పెర గడం, మార్కెట్లో దిగుబడులకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు ఏటా నష్టాలను మూట కట్టుకుంటున్నారు. బీటీ రకం పత్తి విత్తనాలు రావడం, పెట్టుబడి తక్కువ కావడం, మార్కెట్లో ధర ఆశా జనకంగా ఉండడంతో రైతులు ఆ పంట వైపు దృష్టి మళ్లించారు. మూడేళ్లలో ఈ పంట సాగు విస్తీర ్ణం 150 శాతం పెరిగింది. వేరుశనగ సాగుకు ఎంతో అనువుగా ఉండే ఎర్ర నేలల్లో కూడా ఈ పంట గణనీయంగా సాగైంది. కొంపముంచిన వర్షాభావం జిల్లాలో ఈ ఏడాది 61వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు అయింది. వర్షాభావం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పైర్లు పచ్చగా కనిపిస్తున్నా..దిగుబడి ఆశించిన మేరకు వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ అత్యధికంగా పండించే ఆదోని డివిజన్లో జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 60 నుంచి 70 శాతం వర్షం కురిసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సారి కూడా పొలాలు పొదునఅయ్యే స్థాయిలో వర ్షం కురువ లేదు. అడపా దడపా పడుతున్న జల్లులు పైరు ఎండి పోకుండా కాపాడుతున్నాయి. ప్రస్తుతం 40 నుంచి 60 రోజుల పంట ఉంది. అయితే పైరు పెరుగుదల పెద్దగా కనిపిండం లేదు. ఆగస్టులో మూడు రోజుల క్రితం జల్లులు పడ్డాయి తప్ప పొలంలో నీరు పార లేదు. ప్రస్తుతం పూత పూసి, ఊడలు దిగే కీలక దశలో వర్షం ఎండ బెట్టింది. దీంతో పూత, ఊడలు పెరుగుదల నిలిచి పోయింది. మరో వారం రోజుల వాన ఎండ బెడితే ఎకరాకు నాలుగైదు బస్తాల దిగుబడి రావడం కూడా కష్టమని రైతులు వాపోతున్నారు. -
రకాల ఎంపికే కీలకం
పాడి-పంట: కడప (అగ్రికల్చర్): మరో నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని తొలకరి జల్లులు పలకరించబోతున్నాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు పొలాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. రకాన్ని బట్టి ఎకరానికి 50-60 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మేలైన రకాల్ని ఎంపిక చేసుకొని, పంటకాలంలో తగిన యాజమాన్య-సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని ఊటుకూరులోని వైఎస్సార్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగుకు అనువైన రకాలు, వాటి ప్రత్యేకతలపై ఆయన అందిస్తున్న వివరాలు... అనువైన ‘తిరుపతి’ రకాలు తిరుపతి-1 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 7.2-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కోస్తా ప్రాంతంలోని ఇసుక భూములకు అనువైనది. తిరుపతి-2 రకం పంటకాలం 105 రోజులు. ఎకరానికి 6.4-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఊడలు గట్టిగా ఉంటాయి. ఇది తేలికపాటి బంక నేలలకు అనువైన రకం. నులి పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. తిరుపతి-4 రకం 105 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి అందిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్ని కొంత వరకు తట్టుకోగలదు. ఈ ‘కదిరి’ రకాలు వేసుకోవచ్చు కదిరి-6 రకం పంటకాలం 100 రోజులు. కదిరి-9 రకం పంటకాలం 105-110 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ఆలస్యం గా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు అధిక వర్షాలు కురిసే ప్రాంతాలకూ అనువైన చిన్న గుత్తి రకం. విత్తనాలకు 30 రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఈ రకం రసం పీల్చే పురుగుల్ని తట్టుకోగలదు. కదిరి-8 (బోల్డ్-లావు కాయలు) పంటకాలం 120-125 రోజులు. వర్షాలు బాగా కురిసే ప్రాంతాల్లోనూ, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనూ వేసుకోవచ్చు. ఈ రకం ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. కదిరి-7 (బోల్డ్) రకం పంటకాలం 110 - 120 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుం టుంది. అయితే ఇది ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలకు అనువైన రకం కాదు. కదిరి హరి తాంధ్ర రకం పంటకాలం 105-110 రోజులు. బెట్ట పరిస్థితులతో పాటు తామర పురుగుల్ని, ఆ కుమచ్చ తెగులును తట్టుకుంటుంది. పైరు పక్వ దశకు వచ్చే వరకు ఆకుపచ్చగా ఉండి, ఎక్కువ పశుగ్రాసాన్ని అందిస్తుంది. కదిరి రకాలన్నీ ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తాయి. ‘ఐసీజీవీ’ రకాల్లో అనువైనవి ఐసీజీవీ-91114 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8.2 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తొందరగా నూర్పిడికి వస్తుంది. పంట మధ్యలో, చివర్లో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకుంటుంది. ఐసీజీవీ-00350 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అనువైన జేసీజీ-జేఎల్-టీయంవీ రకాలు జేసీజీ-88 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. జేఎల్-24 రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మంచి వర్షపాతం, నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. గింజలు పెద్దవిగా ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. టీఎంవీ-2 రకం పంటకాలం 90-110 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది కూడా అన్ని ప్రాంతాలకూ అనువైనది. ఈ మూడూ చిన్న గుత్తి రకాలే. ఈ రకాలూ వేసుకోవచ్చు నారాయణి రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలో అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజ లేత ఎరుపు రంగులో ఉంటుంది. అభయ రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఈ పొట్టి రకం బెట్టను తట్టుకుంటుంది. దీని నీటి వినియోగ సామర్ధ్యం ఎక్కువ. దీనిలో మూడు గింజల కాయలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకం తిక్కా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రసూన రకం 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 14-16 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కాళహస్తి తెగులును కొంత వరకు తట్టుకోగలదు. అనంత రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కోస్తాలోని ఇసుక నేలలకు కూడా అనువైనది. ఈ చిన్న గుత్తి రకం బెట్ట పరిస్థితులతో పాటు రసం పీల్చే పురుగుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. రోహిణి రకం పంటకాలం 95-100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తగినన్ని వర్షాలు కురిసే ప్రాంతాలకు, నీటి పారుదల సౌకర్యం ఉన్న భూములకు అనువుగా ఉంటుంది. భీమ రకం పంటకాలం 110-120 రోజులు. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. గింజలు లావుగా ఉంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. ధరణి రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది చిన్న గుత్తి రకం. బెట్టను తట్టుకోగలదు. వేరుశనగ రకాలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్ : 0877-2248739) లేదా అనంతపురం జిల్లా కదిరిలోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్: 08494-221180) ఆయా ఫోన్ నెంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు. -
అదును దాటుతోంది బాబూ..!
మొదలైన ఖరీఫ్ సాగు ఇంకా జిల్లాకు చేరని విత్తన కాయలు పంట రుణాల కోసంరైతుల ఎదురుచూపు రుణమాఫీ ప్రకటన వచ్చే వరకు తప్పని తిప్పలు ప్రభుత్వం పట్టించుకోకుంటే అదును దాటిపోయే ప్రమాదం అదే జరిగితే తీవ్రంగా నష్టపోనున్న రైతులు సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది తొలకరి ముందస్తుగానే పలకరించింది. దీంతో రైతన్నలు దుక్కిదున్ని విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయలేదు. జిల్లాలో 2.2 లక్షల హెక్టార్లు సాగు భూమి ఉంటే అందులో 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. సబ్సిడీపై వేరుశనగ విత్తనకాయలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం మే నెల లోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.05 లక్షల క్వింటాళ్లు ఏపీసీడ్స్, ఆయిల్‌ఫెడ్, ఏపీ అయిల్ ఫెడరేషన్ సరఫరా చేయాలి. అయితే రెండు వే ల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. జిల్లా రైతులు కే-6 రకం కాయలు కావాలని కోరారు. లక్ష క్వింటాళ్లు కే-6 కోసమే అధికారులు ప్రతిపాదనలు పంపారు. అనంతపురం జిల్లా రైతులు కూడా ఈ రకం విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కే-6 విత్తనాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖకు కష్టసాధ్యమైంది. విత్తనకాయలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. రైతులు మాత్రం పది రోజులుగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పశ్చిమ ప్రాంతంలోని మదనపల్లె, పలమనేరు, చిత్తూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా 5 వేల హెక్టార్లలో ఇప్పటికే సాగు చేశారు. వీరంతా అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రైతుల వద్ద విత్తన కాయలు కొనుగోలు చేశారు. వీడని పీటముడి ఖరీప్‌లో పంట సాగుకు సిద్ధమయ్యే రైతన్నలకు పెట్టుబడి కష్టసాధ్యంగా పరిణమించింది. టీడీపీ అధికారంలోకి వస్తే పంట రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. అయితే రుణాల మాఫీపై చంద్రబాబు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పరిశీలనకు కమిటీ వేశారు. దీనికి 45 రోజులు గడువిచ్చారు. అప్పటి వరకు రైతులు రుణాల కోసం ఎదురుచూడాల్సిందే! లేదంటే పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తెచ్చుకోవాలి. రైతులు, లేదా ప్రభుత్వం పాతబకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే లేదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. 45 రోజుల వరకు ఆగితే సాగుకు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం త్వరతిగతిన నిర్ణయం వెలువరించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రైతులకు సంబంధించి 7693.75 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రుణాల మాఫీ ప్రకటన కోసం 8.7 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సప్తగిరి గ్రామీణ బ్యాంకు యాజమాన్యం పాతబకాయిలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీ లోపు ప్రభుత్వం నుంచి మాఫీ ప్రకటన వెలువడకపోతే తప్పని సరిగా రీషెడ్యూల్ చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. సప్తగిరి గ్రామీణబ్యాంకు శాఖలు జిల్లాలో 104 ఉన్నాయి. వీటి ద్వారా 7.55 లక్షల మంది రైతులకు 5,810 కోట్ల రూపాయల పంటరుణాలు పంపిణీ చేశారు. బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రుణాలు తీసుకున్న రైతులంతా ఆందోళన చెందుతున్నారు. తెగని పంచాయితీ వేరుశనగ విత్తనకాయల ధరలపై వ్యవసాయశాఖ, నోడల్ ఏజెన్సీల మధ్య పీటముడి వీడలేదు. ప్రభుత్వం పంపిణీ సంస్థల నుంచి బస్తా (30 కిలోలు) కాయలను 1380 రూపాయలకు కొనుగోలు చేసి, రైతులకు 930 రూపాయలకు పంపిణీ చేయాలి. అయితే పంపిణీ సంస్థలు కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచి బస్తాకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు వ్యవసాయశాఖ కమిషనర్ అంగీకరించలేదు. దీంతో విత్తనకాయల సరఫరాకు బ్రేక్ పడింది. ధరల సర్దుబాటు కారణంతోనే ఏజెన్సీల వద్ద కాయలు ఉన్నా సరఫరా చేయలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే రైతులకు సమయానికి వేరుశెనగ విత్తనకాయలు అందే అవకాశం ఉంది .


