breaking news
Great Starbucks
-
ప్రజాపోరుకు సమాయత్తం
{పభుత్వ వైఫల్యాలపై సమరశంఖం పూరించనున్న వై.ఎస్.జగన్ 5న ధర్నాకు కార్యాచరణ వేగవంతం కదలిరానున్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొననున్న రైతులు, మహిళలు విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజాగ్రహభేరి మోగనుంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలపై ప్రజాపోరాటానికి విశాఖపట్నం వేదికగా నిలవనుంది. హామీల మాయాజాలనికి మోసపోయామంటూ ప్రజానీకం మహాధర్నాకు సమాయత్తమవుతోంది. వీరి పక్షాన ఈ నెల 5న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు మహాధర్నా తరలిరానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులన్నీ కలెక్టరేట్ ప్రాంగణానికే చేరుకునేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలవారీగా సన్నాహక సమావేశాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళల పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తదితరులు బుధవారం కూడా విసృ్తత సమావేశాలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమన్వయకర్త వంశృకృష్ణ శ్రీనివాస్ బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి గుడివాడ అమర్, రఘురాం హాజరయ్యారు. నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్ సమావేశమయ్యారు. గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ధర్నాను విజయవంతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్ సమావేశమయ్యారు. గాజువాకలో సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విసృ్లతంగా పర్యటించారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మధురవాడ, యండాడ తదితర నగర శివారు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు బుధవారం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తదితరులు నేతలు, కార్యకర్తలతో బుధవారం రాత్రి మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. నగరంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి కంపా హనోక్, కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి తదితరులు హాజరు ధర్నా నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రూరల్ జిల్లాలో సమరోత్సాహం రూరల్ జిల్లా పరిధిలో కూడా మహాధర్నాకు సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఒక్క రోజే సమయం ఉన్నందున నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు తమ నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలతో సమావేశమై విశాఖపట్నం ధర్నాకు భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే చెంగాల వెంకట్రావు పాయకరావుపేట నియోజవర్గంలో పర్యటించి ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ పలు మండలాలోల విసృ్తతంగా పర్యటించారు. చోడవరం, నర్సీపట్నం సమన్వయకర్తలు ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్‌లు తమ నియోజవర్గాల్లో పర్యటించి సన్నాహకాలను వేగవంతం చేశారు. యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు బుధవారం ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వం వైఫల్యాలపై పోరుబాటకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ధర్నాను విజయవంతం చేయడం ద్వారా ప్రజావాణిని బలంగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి. -
మహాధర్నాకు తరలిరండి
మదనపల్లె: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న చిత్తూరు కలెక్టరేట్ వద్ద జరగనున్న మహాధర్నాకు ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి హరిరాయల్ కోరారు. ఆయన మంగళవారం మదనపల్లెలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షు లు శరత్‌యాదవ్ ఆదేశాల మేరకు మహాధర్నాకు మదనపల్లె నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో యువకులను చిత్తూరుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నేడు హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రుణమా ఫీ విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఓ వైపు మహిళలు, మరోవైపు రైతులు రుణాలకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాత్రం విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి యువకులు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా ఉపాధ్యక్షులు షరీఫ్, కౌన్సిలర్ మహమ్మద్ఫ్రీ పాల్గొన్నారు. -
‘గజినీ’ బాబు
* ఎన్నికల వాగ్దానాలు మరిచిపోయారు * డిసెంబర్ 5న మహాధర్నాకు తరలిరావాలి * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గుమ్మలక్ష్మీపురం,కురుపాం: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు సాధ్యం కాని వాగ్దానాలిచ్చి, గెలుపొందిన అనంతరం వాగ్దానాలు మరిచి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజినీ బాబులా ప్రజలను దగాచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. గుమ్మలక్ష్మీపురం,కురుపాంలలో శుక్రవారం జరిగిన ఆయా మండలాల విస్తృతస్థాయి సమావేశాల్లో వీరభద్రస్వామి మాట్లాడారు. గుమ్మలక్ష్మీపురంలోని బీఎస్ఆర్ కళింగ వైశ్య కల్యాణమండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరైన కోలగట్ల మాట్లాడుతూ ఎన్ని అబద్ధాలు చెప్పినా అమాయక ప్రజలు నమ్ముతారన్న కుటిల బుద్ధితో ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని, ఇచ్చిన హమీలు నెరవేర్చుతారని నమ్మి ఓటువేసిన ప్రజలకు రోజుకో కమిటీల పేరిట,కొత్త వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో సాలూరు,కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణిలు డిమాండ్ చేయగా, గిరిజన యూనివర్సిటీ మంజూరుకు హమీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి పక్కజిల్లాకు కేటాయించారని విమర్శించారు. ఈ ఆరునెలల్లో చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి, సంక్షేమ పథకాలు మావేనంటూ బాబు గంతులేస్తున్నారని ఆరోపించారు. ఆర్థికంగా బలపడడానికి, ఆస్తులు కూడబెట్టుకోడానికి చ ంద్రబా బు నాయుడు ఏడాదిలో నాలుగు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న అధికార పార్టీ ఆగడాలపై ప్రజల తరఫున ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకురావాలని కోరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఆరోపించారు. గిరిజన ప్రాంతానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఓటువేసి గెలిపించిన ప్రజలు,కార్యకర్తలను కాదని సొంతలాభాల కోసం గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు 18 కమిటీలను ఏర్పాటు చేసి, నాయకత్వ లక్షణాలపై వారికిశిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కురుపాం నియోజకవర్గం సమన్వయ కర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు శ్రీరాములు నాయుడు,సింగుబాబు,సీహెచ్ వెంకటరమణ, కుంబురుక దీనమయ్య, గోరిశెట్టి గిరిబాబు, నిమ్మక సింహాచలం,శేఖర్,పి.మహేష్, తోయక గోపాల్ రెల్ల,దుడ్డుఖల్లు,చెముడుగూడ,తాడికొండ ఎంపీటీసీలు బి.లక్ష్మి, ఎన్.నీలావతి,గంగాసీ, భాస్కరరావు, రెల్ల ఉప సర్పంచ్ కె.నాగేశ్వరరావు, అడ్డాకుల చిన్నారావు,తోయక మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీకి భయపడేది లేదు .. కురుపాం: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన అధికార పార్టీకి భయపడేది లేదని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే అదే ప్రజల అండతో ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయక్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు అధ్యక్షతన కురుపాంలో జరిగిన సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల అండతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు, మహిళలు, రైతులు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని గుర్తించారన్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాకు వచ్చేవరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. అనంతరం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని మంచి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అవన్నీ అమలు చేసి నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంటరీ పరీశీలికులు బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గం సమన్వయకర్త చంద్రశేఖరరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సింగుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్, విజయనగరం మాజీ ఏఎసీ చైర్మన్ శ్రీరాములు నాయుడు, పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడులు కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ చనమల్లు వెంకటరమణ, కురుపాం మండలాధ్యక్షురాలు ఆనిమి ఇందిరాకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, వైస్ ఎంపీపీ వి.కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు , నాయుకులు ఆకుల శ్రీధర్, శెట్టినాగేశ్వరరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఆనిమి కైలాసరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటరావు, జి.వి.శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు,పాల్గొన్నారు.