భార్యబిడ్డలను కొట్టి, భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్ గౌతంనగర్‌లో శుక్రవారం దారుణం జరిగింది. భార్యాబిడ్డలను ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టి అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కృష్ణవేణి, చిన్నారి భవాని పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.