breaking news
gopal Italia
-
గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బీజేపీకి గట్టి షాక్ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్(పంజాబ్), కాళీగంజ్(పశ్చిమ బెంగాల్), కాడీ, విసావదర్(గుజరాత్), నీలంబూర్(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్ పటేల్‌కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్ నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్‌లో ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. బెంగాల్‌లోని కాళీగంజ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అలీఫా అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశీష్ ఘోష్‌పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్ ఎమ్మెల్యే నజీరుద్దీన్ అహ్మద్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి అర్యదన్ షౌకత్ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గుజరాత్, పంజాబ్‌లో మాదే విజయం: కేజ్రీవాల్ గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సరిత విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2019 నాటి ఓ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాతీయ మహిళా కమిషన్ గోపాల్‌కు సమన్లు పంపింది. అయితే తనను అరెస్టు చేసిన అనంతరం గోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖ శర్మ తనను జైల్లో పెడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పటేల్ సామాజికి వర్గాన్ని జైలుకు పంపడం తప్ప ఇంకేం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీకి పాటీదార్లంటే ద్వేషమని ఆరోపించారు. తాను సర్దార్ పటేల్ వంశానికే చెందిన వాడినని, జైలు అంటే భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. . @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है। — Gopal Italia (@Gopal_Italia) October 13, 2022 గోపాల్‌కు సమన్లు పంపిన అనంతరం తన కార్యాలయం ఎదుట ఆప్ గూండాలు రచ్చ చేస్తున్నారని ఎన్సీడబ్ల్యూ ఛైర్మన్ రేఖ శర్మ్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. All the @AamAadmiParty hulligons are outside my office creating ruckus. @CPDelhi @SouthwestDcp @PMOIndia pic.twitter.com/7N698OAcRK — Rekha Sharma (@sharmarekha) October 13, 2022 గోపాల్ ఇటాలియా అరెస్టును ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. మొత్తం బీజేపీ ఆయన వెనకాలే ఎందుకు పడుతోందని ధ్వజమెత్తారు. గోపాల్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు పాత వీడియోను తీసుకుని ఆయనను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైన సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆప్‌కు లభిస్తున్నఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ గోపాల్‌ను అరెస్టు చేసిందని ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే గోపాల్‌ను నిర్బంధించిన మూడు గంటల తర్వాత పోలీసులు విడుదల చేశారు. చదవండి: రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్.. మనీలాండరింగ్‌పై ఛార్జ్‌షీట్ -
హోంమంత్రిపై అసెంబ్లీ ముందే షూ విసిరాడు
గాంధీనగర్: గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఓ వ్యక్తి తన షూను ఆయనకు విసిరికొట్టారు. అది కూడా అతి చేరువ నుంచి. మొత్తం మీడియా అంతా పొగై ఉన్న సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోపంగా తన షూలు తీసి విసిరాడు. రెప్పపాటులో ఆ షూ ఆయనకు తగలకుండా పక్కకు పడిపోయింది. దీంతో అక్కడ అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ముందు గురువారం హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా మాట్లాడబోతుండగా గోపాల్ ఇతాలియా అనే వ్యక్తి నేరుగా అరుస్తూ షూ ఆయనపైకి విసిరేశాడు. అతడు ఒక నిరుద్యోగి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అది కాకుండా నిరుద్యోగిగా ఉన్న అతడు రాష్ట్రంలో అభివృద్ధే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలనకు, అవినీతికి గుర్తుగా తన షూ ఇస్తున్నానంటూ విసిరి కొట్టాడు. మీడియా సమాచారం ప్రకారం ఈ యువకుడు అంతకుముందు నిరుద్యోగిత అంశంపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. షూ విసిరిన అతడు నేరుగా హోంమంత్రిపైకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు. సెక్యూరిటీ, పోలీసులు నిలువరించడంతో మరింత గందరగోళం ఆగినట్లయింది.