breaking news
Goods and passenger trains
-
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
విరిగిపోతున్న రైలు బోగీల కప్లింగ్లు
ప్యారిస్: గూడ్స్, ప్రయాణికుల రైళ్ల బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం రైలు బోగీలను కలిపే కప్లింగ్లు విరిగిపోతుండడమేనని తెలుస్తోంది. కనుక కప్లింగ్ల పర్యవేక్షణపై రైల్వే నిర్వాహకం దృష్టి సారించడం అత్యవసరం. 10వ తేదీ వేలూరు జిల్లా, గుడియాత్తం సమీపంలో వెళుతున్న బెంగళూరు - అరక్కోణం ప్రయాణికుల రైలు ఇంజిన్ మాత్రం వేరుగా విడిపోయి పరుగులు తీసింది. బోగీలను కలిపే కప్లింగ్లు విరిగిపోవడంతోనే ఈ సంఘటన సంభవించిన ట్లు విచారణలో తెలిసింది. తర్వాత రోజు 11వ తేదీ అరక్కోణం సమీపంలో, ఇనుము లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 44 బోగీలతో వెళుతున్న గూడ్స్ నుంచి నాలుగు బోగీలు పట్టాలపై నుంచి పక్కకు తప్పాయి. ఈ ప్రమాదం కూడా కప్లింగ్లు విరిగిపోవడం వల్లనే జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై భారత రైల్వే సాంకేతిక శాఖ సూపర్వైజర్ల సంఘం నిర్వాహకులు ఒకరు మాట్లాడుతూ ప్రారంభ రోజుల్లో రైలు బోగీలను ఐఆర్ఎస్ అనబడే స్క్రూలను కప్లింగ్లకు ఉపయోగించారు. వీటికి పట్టు అంతగా లేకపోవడంతో ప్రమాద సమయాల్లో రైలు బోగీలు ఒకదానిపైన ఒకటి చేరే పరిస్థితి ఏర్పడుతుండేది. ఈ సంఘటనలను తప్పించే విధంగా సరకు, ప్రయాణికుల రైళ్లలో బోగీలను సెంటర్ బంపర్ కప్లింగ్లతో జత చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా కొన్ని సమయాలలో ఐఆర్ఎస్ కప్లింగ్లు, సెంటర్ బంపర్ కప్లింగ్లు రెండింటిని ఉపయోగించి బోగీలను జత చేయడం జరుగుతుంది. కప్లింగ్లలో చోటు చేసుకునే లోపాలను కనుగొనడం అంత సామాన్యమైన విషయం కాదు. రైలు చక్రాలు, యాక్సిల్ వంటి వాటిని అత్యాధునిక అల్ట్రా సోనిక్ పద్ధతిలో సోధనలు చేసి, పర్యవేక్షించడం జరుగుతుంది. ఆ విధంగా కప్లింగ్లను తనిఖీ చేయడం కుదరదు. అయినప్పటికినీ 18 నెలలకు ఒక సారి కప్లింగ్లను తనిఖీ చేస్తుంటాం. అనంతరం అవసరమైన వాటిని మార్చడం వాటికి మరమత్తు లు చేస్తాం. పలు సమయాల్లో తగిన దానికంటే ఎక్కువ బరువును బోగీలలో ఎక్కించడం కూడా కప్లింగ్లు విరిగిపోవడానికి కారణమవుతుంది. ఒక బోగీలో 60 టన్నుల బరువును మాత్రమే ఎక్కించాల్సి ఉంది. అయితే దాని కంటే ఎక్కువగా బరువు పెరిగినట్లైతే ఈ విధంగా కప్లింగ్లు విరిగి, రైలు బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.