breaking news
gold items
-
బ్యాంక్‌కు కన్నమేసి భారీ చోరీ
అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ జర్మనీలో చోరశిఖామణులు వందల కోట్ల విలువైన సంపదపై పక్కా ప్రణాళికతో నింపాదిగా కొట్టేశారు. ఏమాత్రం హడావిడి పడకుండా నెమ్మదిగా పని ముగించి ఏకంగా దాదాపు రూ.950 కోట్ల విలువైన కట్టల కొద్దీ కరెన్సీ, కేజీల కొద్దీ బంగారం, ఆభరణాలను వెంట తీసుకెళ్లారు. ఈ చోరీ కోసం దొంగలు భారీ డ్రిల్లింగ్ మెషీన్‌ను రంగంలోకి దింపారు. అత్యంత దృఢమైన బ్యాంక్ వాల్ట్ గోడకు కన్నమేసి వేలాది మంది బ్యాంక్ వినియోగదారుల విలువైన వస్తువులను తమ వశంచేసుకున్నారు. ఉత్తర రైనీ–వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్కిర్చెన్ నగరంలోని స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో ఈ భారీ చోరీ జరిగింది. సెలవు రోజుల్లో పక్కా ప్రణాళికతో గెల్సెన్కిర్చెన్: జర్మనీలో క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంక్‌లు సహా పలు రకాల సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. డిసెంబర్ 24 తేదీ నుంచి బ్యాంక్ శాఖలకు తాళాలే వేసి ఉన్నాయి. అటు వైపు కన్నెత్తిచూసే పోలీస్నాథుడే ఉండడు. ఇదే సమయాన్ని దొంగలు తమకు అనువుగా మల్చుకుని విజయం సాధించారు. ఈ స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో వందల కోట్ల విలువైన నగలు, బంగారం, కరెన్సీ మూటలను బ్యాంక్ అధికారులు భూగర్భంలోని అత్యంత సురక్షితమైన వాలెట్‌లోనే భద్రపరుస్తారు. ఈ విషయం తెల్సుకున్న దొంగలు తొలుత ఈ బ్యాంక్ బ్రాంచ్ భవంతిని ఆనుకుని ఉన్న ఒక పార్కింగ్ గ్యారేజీలోకి చొరబడ్డారు. గ్యారేజీ గోడలతో అనుసంధానమైన బ్యాంక్ వాలెట్ గోడ సరిగ్గా ఎక్కడుందో కనిపెట్టారు. పెద్దపెద్ద రంధ్రాలు చేసే అత్యంత శక్తివంతమైన డ్రిల్లింగ్ మెషీన్‌తో గోడకు రంధ్రం చేశారు. లోపలికి చొరబడి బ్యాంక్ వినియోగదారులకు చెందిన దాదాపు 3,250 లాకర్లను తెరచి వాటిలోని బంగారు ఆభరణాలు, బంగారం కడ్డీలు, కరెన్సీని వెంట తెచ్చుకున్న సంచుల్లోకి నింపారు. ఈ చోరీపై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి థామస్ నొవాక్జిక్ మాట్లాడారు. ‘‘దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇందులో అత్యంత నిపుణులైన ఘరానా దొంగలు పాల్గొనట్లు తెలుస్తోంది. ఇంత పకడ్బందీగా చోరీ చేయడం ఈ మధ్యకాలంలో చూడలేదు. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ చోరీ ఘటన ఇదేనేమో. దాదాపు రూ.950 కోట్ల సంపద పోయిందని భావిస్తున్నాం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో చోరీ జరగలేదు. నింపాదిగా ఒక్కో లాకర్‌ను బద్దలుకొట్టారు. వాలెట్లోని దాదాపు 95 శాతం లాకర్లలోని విలువైన వస్తువులు గల్లంతయ్యాయి. ఘటనపై ముమ్మర దర్యాప్తు మొదలెట్టాం. ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు. అత్యంత ప్రతిభావంతులైన డిటెక్టివ్, పోలీస్ బృందాలతో దొంగల వేట ఆరంభించాం’’అని ఆయన చెప్పారు. తెల్లారిందాకా మోశారు! దొంగలను సంపదను సంచుల్లో నింపుకున్నాక ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా ఒక్కోటిగా బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘వాళ్లంతా బ్యాంక్ నుంచి రాలేదు. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజీ నుంచి రావడంతో మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అందరూ మాసు్కలు ధరించారు. మెట్ల మీద నుంచి బ్యాగులు మోస్తూ కని్పంచారు’’అని పొరుగు వాళ్లు చెప్పారు. సమీప సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీచేశారు. అందులో నలుపు రంగు ఆడీ ఆర్ఎస్6 రకం కారు ఒకటి పార్కింగ్ గ్యారేజీ నుంచి బయటకు రావడం కనిపించింది. ఆ కారులో ఉన్నవా ళ్లంతా ముసుగులో ధరించి ఉన్నారు. డీ–లా షెవలేరీ స్ట్రాసీ రోడ్డు గుండా కారులో దొంగలు పారిపోయారు. ఆ కారు లైసెన్స్ ప్లేటు పై పోలీసులు ఆరాతీయగా ఘటనాస్థలి నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని హనోవర్ సిటీలో చోరీకి గురైన కారుదిగా గుర్తించారు. ఈ మొత్తం ఘటన హాలీవుడ్లో హిట్ అయిన ‘ఓషన్స్ ఎలెవన్’నేరముఠా చోరీని గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లోని ఒక అలారమ్ మోగడంతో అప్పుడు ఎమర్జెన్సీ బృందం రావడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. -
బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలో బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఈ హెచ్‌యూఐడీ ఉన్న బంగారు ఆభరణాలనే కొనాలి లేదా అమ్మాలి. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) భారతదేశంలో బంగారు ఆభరణాలను అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా కొనుగోలు చేస్తుంటారు. చాలా వరకు బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటికి ఇప్పటి వరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలతో కూడిన హాల్‌మార్కింగ్ ఉండేది. హాల్‌మార్కింగ్ గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ ఇచ్చే గుర్తింపు. ఇది 2021 జూన్ 16 వరకు స్వచ్ఛందంగా ఉండేది. అంటే తప్పనిసరి కాదు. ఆ తర్వాత 2021 జూలై 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత హాల్‌మార్కింగ్‌లో నాలుగు అంశాలు ఉండేవి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, నగల వ్యాపారికి సంబంధించిన లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్. HUID హాల్‌మార్కింగ్‌లో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) పాత బంగారంపై ఆందోళన వద్దు అయితే తమ వద్ద పాత బంగారు ఆభరణాల సంగతేంటని వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత హాల్‌మార్కింగ్ ఆభరణాలు కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్వచ్ఛతలో తేడా ఉంటే రెండు రెట్ల పరిహారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018లోని సెక్షన్ 49 ప్రకారం... వినియోగదారు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ముద్రించిన హాల్‌మార్క్‌లో ఉన్న దానికంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే కొనుగోలుదారు రెండు రెట్ల పరిహారం పొందవచ్చు. -
చూడ్డానికి వచ్చి ‘టాయ్‌లెట్’ కొట్టేశారు..!
లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్ఫర్డ్షైర్లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్‌లెట్‌ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక కాదు’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ టాయ్‌లెట్‌ను సందర్శనార్థం చర్చిల్ జన్మించిన పక్క గదిలోనే ఏర్పాటు చేశారు. గురువారం నుంచే ఈ టాయ్‌లెట్‌ను సందర్శనకు పెట్టారు. అంతలోనే దోపిడీకి గురైంది. మౌరిజియో కాటెలాన్ తయారు చేసిన బంగారు టాయ్‌లెట్ దొంగతనానికి గురైనట్టు శనివారం ఉదయం సమాచారం అందిందని థేమ్స్ వాలీ పోలీసులు వెల్లడించారు. ఘటనతో ప్రమేమున్నట్టు భావిస్తున్న ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇక ఇంత ప్రతిష్టాత్మక, విలువ గల టాయ్‌లెట్ పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం వల్ల దాని ఆర్ట్‌వర్క్ దెబ్బతింటుందని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జెస్ మిల్నేఅన్నారు. నిందితులు రెండు వాహనాల్లో వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగినట్టు బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. థేమ్స్ వాలీ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సందర్శకులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే యునెస్కో గుర్తింపు పొందిన బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంను శనివారం మధ్యాహ్నం వరకు మూసేయించారు. ఇదిలాఉండగా.. 2016లో మౌరిజియో కాటెలాన్ బంగారు టాయ్‌లెట్ ఆర్ట్‌వర్కును న్యూయార్క్‌లోని ప్రసిద్ధ గగ్గన్హేమ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై మనసు పారేసుకున్నారు. ఈ బంగారు టాయ్‌లెట్‌ను ఇస్తే బదులుగా విన్సెంట్ వాన్గో 1888లో వేసిన విఖ్యాత ‘ల్యాండ్‌స్కేప్ విత్ స్నో’ పెయింటింగ్ ఇస్తానని ట్రంప్ చెప్పడం విశేషం. -
రామా.. జాడచూపవా..!
నగల మాయంపై వీడని మిస్టరీ మంగళసూత్రం పోయినా చర్యల్లేవ్ భద్రాద్రి అర్చకుల్లో అంతర్మథనం ................................................................................ భద్రాచలం : భద్రాచలం దేవస్థానంలో నగల మాయంపై మిస్టరీ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా మాయమైన నగలు ఎక్కడున్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు ఆభరణాలు కనిపించటం లేదని నిర్ధారణ అయినప్పటికీ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంలో దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. నగలు హుండీల్లో కూడా కనిపించకపోవటంతో దాదాపుగా పోయినట్లేనని దేవస్థానం అధికారులు నిర్ధారణకు వచ్చారు. వంశపారంపర్యంగా అర్చకత్వం చేసే పదకొండు మంది అర్చకుల ఆధీనంలోనే స్వామివారి నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఉంటాయి. నగలు కనిపించకపోతే వారంతా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో వీరిలో ఎవరిపై చర్యలు తీసుకోవాలనే దానిపై దేవస్థానం అధికారుల నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గతంలో చిన్నపాటి చోరీలు, విధుల పట్ల బాధ్యతారాహిత్యం వంటి అంశాల్లో ఉద్యోగులపై దేవస్థానం అధికారులు కఠినంగా వ్యవహరించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా పనిచేసిన కాలంలో ఆలయం నుంచి వస్త్రాలను తీసుకెళుతున్న ఓ అర్చకుడిని గుర్తించి ఉన్న ఫలంగా అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. కానీ.. ప్రస్తుతం సీతమ్మ వారి మంగళసూత్రాలు పోయినా, అంతా కమిషనర్ ఆదేశానుసారమే చర్యలు తీసుకుంటామని ప్రస్తుత ఈఓ రమేష్‌బాబు చెబుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు అర్చకులపై అనుమానంతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ, విచారణ ఆ స్థాయిలో జరగటం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆభరణాలు మాయమైతే సంబంధిత శాఖల అధికారులంతా దీనిని తేలిగ్గా తీసుకోవటం సరైందికాదని భక్తులు అంటున్నారు. మార్పులు ఉంటాయా..? రెండు ఆభరణాలు మాయమైన నేపథ్యంలో త్వరలోనే అర్చకుల బాధ్యతల్లో చేర్పులు.. మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. బంగారు ఆభరణాలకు పదకొండు మంది అర్చకులు బాధ్యులే కాబట్టి వారందరితోనే తలా ఇంత డబ్బులు పోగు చేసి, ఆభరణాలను చేయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావటంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇక్కడి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. జరిగిన పరిణామాలన్నింటిపై పూర్తి నివేదికను కమిషనర్‌కు అందజేసిన ఈఓ రమేష్‌బాబు, అక్కడ నుంచి వచ్చే సందేశం కోసం ఎదురుచూస్తున్నారు. అర్చకుల్లో అంతర్మథనం నగల మాయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావటం, దీనిపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నాయి. ఒకరిద్దరి చేసిన చేష్టలతో భద్రాద్రి రాములోరి సేవ చేసుకోవటమే మహాభాగ్యంగా భావిస్తూ విధులు నిర్వహిస్తున్న మిగతా అర్చకులు దీనిపై తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ వివాదానికి సాధ్యమైనంత తెరదించాలని వారు కోరుతున్నారు.


