breaking news
Gold Buyer
-
ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..!
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. నెల రోజుల క్రితం అయితే ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పటికీ రూ.లక్షకు చేరువలోనే ఉంది. దీంతో బంగారం కొనుక్కోవాలని ఆశ ఉన్నప్పటికీ సామాన్యులు మనం కొనలేములే అని ఆగిపోతున్నారు.సాధారణంగా బంగారం అంటే ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అసలే పెరిగిపోయిన ధరకు తోడు ఆభరణాలకు విధించే తరుగు, తయారీ చార్జీలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. దీంతో కాస్తంత బంగారం కొనాలన్నా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.అధిక బంగారం ధర ద్రవ్యోల్బణం వంటిది. డబ్బులు అవే కానీ వాటికి వచ్చే వస్తు ప్రతిఫలం తగ్గిపోతుంది. 2020లో మీ దగ్గర రూ.50,000 ఉంటే పది గ్రాముల బంగారాన్ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. బంగారం కొనడం అనేది ఒక్కసారి చేసే వ్యాయామం కాదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా కాలక్రమేణా దానిని కూడబెట్టుకుంటూ ఉండాలి.అయితే బంగారాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అంటే పెట్టుబడి ప్రయోజనాల కోసమా లేదా నగల కోసమా లేకుంటే వివాహ నిమిత్తమా అన్నది ఎరుక ఉండాలి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే 5 నుండి 20 శాతం 'మేకింగ్ ఛార్జీలు' ఉంటాయి. అదే నాణేల రూపంలో కొంటే ఈ అనవసరమైన భారం ఉండదు.బంగారు నాణేలు కొంటే ప్రయోజనాలు🔸బంగారు నాణేలు ధ్రువీకరించిన స్వచ్ఛతతో వస్తాయి. సాధారణంగా ఇవి 24 కేరట్లు (99.99 శాతం స్వచ్ఛత)లలో లభిస్తాయి.🔸కావాల్సినప్పుడు అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. వీటిని సులువుగా విక్రయించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీటిని తీసుకుంటారు.🔸బంగారం ఆభరణాలతో పోలిస్తే వీటిని భద్రపరచుకోవడం సులువు.🔸బంగారు నాణేలు ధ్రువీకరణతో రావడం వల్ల స్వచ్ఛత, బరువుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదు.🔸ఆర్థిక అనిశ్చితి సమయాలలో బంగారం విలువకు ఢోకా ఉండదు.🔸బంగారు నాణేలు అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ బరువుల్లో లభిస్తాయి. కాబట్టి స్తోమతను బట్టీ ఎవరి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు.🔸నగల దుకాణాలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. -
వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు. -
దారుణంగా పడిపోతున్న బంగారం డిమాండ్!
-
దారుణంగా పడిపోతున్న బంగారం డిమాండ్!
బంగారం కొనుగోలుకు చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. కానీ ఇటీవల భారత్‌లో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.30వేలకు దిగువన రూ.28,500గా కదలాడుతున్నాయి. బంగారానికి డిమాండ్ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారని జువెల్లరీ వ్యాపారులు వాపోతున్నారు. 1999లో తన కుటుంబ వ్యాపారాలైన బంగారం బిజినెస్‌లను స్వీకరించాక, ఈ ఏడాదే బంగారం ధరలు దారుణంగా పడిపోతున్నాయని సౌరభ్ గాడ్గిల్ అనే వ్యాపారవేత్త పేర్కొన్నారు. అదేవిధంగా వినియోగదారులక ఎర వేయడానికి ఎన్ని డిస్కౌంట్లు ఆఫర్ చేసినా వారు కొనడం లేదని, బంగారం పరిశ్రమంతా ఆందోళనలో ఉందని మరో వ్యాపారి తెలిపారు. ఈ స్థాయిలో బంగారం కిందకు దిగిరావడం, రాబోతున్న హిందూ పండుగలు దీవాళి, ధన్తేరాస్లపై కూడా ఆశలను ఆవిరిచేస్తుందున్నారు. బంగారం కొనుగోలులో ధన్ తేరాస్ ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది వినియోగం ఇంకా 650 మెట్రిక్ టన్నుల కంటే కిందకే నమోదవుతుందని బ్లూమ్‌బర్గ్ సర్వే తెలిపింది. గతేడాది భారత్ 864 టన్నుల బంగారం కొనుగోలు చేయగా.. 2010లో అత్యధికంగా 1,006 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటాలో తేలింది. 33 ఏళ్ల మార్కెట్లో బంగారానికున్న భౌతిక డిమాండ్ ఎన్నడూ కూడా ఈ మేర తగ్గలేదని జెనీవా ఆధారిత రిఫైనర్, ట్రేడర్ ఎంకేఎస్ చైర్మన్ మార్వాన్ షకర్చీ తెలిపారు. బ్లాక్ మనీపై భారత్ ప్రభుత్వం చేస్తున్న పోరాటమే బంగారం కొనుగోళ్లకు కళ్లెం వేస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు గత రెండేళ్లలో గరిష్టంగా జూలైలో 8 శాతం మేర పతనమయ్యాయి. మంగళవారం ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 1,268.48 డాలర్లుగా నమోదైంది. వరల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఈ ఏడాది 750 నుంచి 850 టన్నుల వినియోగం ఉంటుందని అంచనావేసింది. కానీ పలు కారణాలు కొనుగోలను దెబ్బతీశాయి. ఒకటి బ్లాక్ మనీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం, ఐడీఎస్ పథకం ద్వారా బ్లాక్ మనీని ప్రభుత్వం రాబడుతోంది. దీంతో బంగారం కొనుగోలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. రెండోది మార్చి, ఏప్రిల్‌లో జువెల్లరీ వ్యాపారుల బంద్ కూడా బంగారం డిమాండ్‌పై ఎఫెక్ట్ చూపింది. అప్పుడు ధరలు ఎగిసినప్పటికీ, కొనుగోలు పడిపోయాయి. కానీ పండుగ సీజన్ దీపావళి కాలంలో, రెండో త్రైమాసికంలో వినియోగం పెరుగుతుందని కౌన్సిల్ డైరెక్టర్ మెంబర్ జాన్ ముల్లిగాన్ అంచనావేస్తున్నారు. మరోవైపు బంగారం డిమాండ్‌పై వ్యాపారులు మాత్రం ఒకింత భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. మంచి రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లను కొంత పెంచవచ్చని ఆశాభావం వ్యక్తంచేస్తున్నప్పటికీ, వినియోగదారులు ఏ మేరకు కొనుగోలు జరుపుతారో అని అనుమాన పడుతున్నారు.