బంగారం కొనుగోలుకు చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. కానీ ఇటీవల భారత్లో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.30వేలకు దిగువన రూ.28,500గా కదలాడుతున్నాయి. బంగారానికి డిమాండ్ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారని జువెల్లరీ వ్యాపారులు వాపోతున్నారు