breaking news
Giant Crocodile
-
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
-
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
భోపాల్: ఇంట్లో పిల్లలు ఉంటే నిత్యం వారిని ఓ కంట గమనించుకుంటూ ఉండాలి. అందరూ ఉన్నారు కదా చూసుకుంటారనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్నిజాగ్రత్తలు చెబుతూ, ఎప్పుకప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే క్షణకాలపు అజాగ్రత్త జీవిత కాలపు బాధను మిగిలిస్తుంది. అచ్చం ఇలాగే మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. షియోపూర్‌లోని చంబల్ నదిలో సోమవారం స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నది వద్దకు చేరుకొని బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కర్రలు, తాడు, వల సాయంతో నదిలో ఉన్న మెసలిని బంధించి బయటకు లాగారు. మొసలిని చంపి బాలుడిని రక్షించాలని గ్రామస్తులు భావించారు. ఇంతలో సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్షణ బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని గ్రామస్తుల బారినుంచి రక్షించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించారు. అయితే ఇందుకు కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు అస్సలు అంగీకరించలేదు. మొసలి కడుపులో బిడ్డ బతికే ఉంటుందని ఆశగా ఎదురు చూశారు. పిల్లాడిని బయటకు తీసినప్పుడే వదిలేస్తామని చెప్పారు. చదవండి: వరద బీభత్సం.. హెలికాప్టర్ రాకపోతే ప్రాణాలు పోయేవే! అయితే మొసలి కడుపులో ఉన్న పిల్లవాడు బతికే అవకాశం లేదని పిల్లాడి తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్షణ విభాగం ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై రఘునాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళాడని తెలిపారు. చిన్నారిని మొసలి మింగేయడంతో వల, కర్రలతో మొసలిని పట్టుకున్నట్లు గ్రామస్తులు చెప్పారని వెల్లడించారు. కాగా మాయదారి మొసలి కన్న కొడుకుని దూరం చేసి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. #MadhyaPradesh: 10-year-old boy swallowed by crocodile while bathing in Chambal river pic.twitter.com/iSzcJtWdWw — Neha Singh (@NehaSingh1912) July 12, 2022 -
వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు
-
వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు
సాక్షి, టెక్సాస్: అమెరికాను హర్వే తుఫాన్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన తుఫాన్‌గా అభివర్ణించబడ్డ హర్వే ధాటికి నాశనం అయిన ప్రాంతాల్లో టెక్సాస్ నగరం కూడా ఉంది. వర్షాలు తెరిపినివ్వటంతోపాటు వరద తగ్గుముఖం పట్టడంతో బ్రెయిన్ ఫోస్టర్ అనే వ్యక్తి హర్రీస్ కంట్రీలోని తన ఇంటికి బయలేదేరాడు. జరిగిన నష్టాన్ని తల్చుకుని బాధపడుతూనే పని వాళ్లతో ఇంటిని శుభ్రం చేయిస్తున్నాడు. ఇంతలో డైనింగ్ టేబుల్ కింద దృశ్యాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. 9 అడుగుల ఓ భారీ మొసలి తాపీగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఫోస్టర్ వెంటనే అత్యవసర సిబ్బందికి కాల్ చేశాడు. తమకు అందిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు 20 నిమిషాలపాటు శ్రమించి ఆ భారీ మకరాన్ని బంధించేశారు. సమీపంలో కొలను ప్రాంతంలో మొసలిని విడిచిపెడతామని అధికారులు తెలిపారు. గత వారం టెక్సాస్ లోనే ఓ మహిళ రెండు మొసళ్లు వదరల్లో ఈదుకుంటూ రావటం చిత్రీకరించి ఆ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. కాగా, హర్వే హరికేన్ మూలంగా వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా.. వరద నీటితోపాటు జంతువులు కూడా కొట్టుకుని వస్తున్నాయి. ఒక్క హుస్టన్ నగరంలోని జలప్రాణి సంరక్షణ కేంద్రం నుంచే 350 జంతువులు తప్పిపోయినట్లు అధికారులు వెల్లడించారు.