breaking news
German Shepherd Dogs
-
పేలుళ్ల తరువాత.. తన అయిదు కుక్కల్ని
ఒకవైపు వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చివురుటాకులా వణుకుతోంది. మరోవైపు దేశ భద్రత కోసం తన వంతు సాయంగా ఒక మహిళా లెక్చరర్ ముందుకు వచ్చారు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న అయిదు మేలు జాతి కుక్కలను సైన్యానికి కానుకగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆమెపై సర్వత్రా అభినందనల వెల్లువ కురుస్తోంది. పేలుడు పదార్ధాలను, మందులను గుర్తించడంలో సైన్యం చూపిస్తున్న తెగువ, చురుకైన పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంతర్జాతీయ ఓపెన్ యూనివర్శిటీలోని లెక్చరర్ డాక్టర్ షిరు విజేమన్నే వెల్లడించారు. సైన్యానికి సాయం అందించే ఉద్దేశంతో ఒకే కుటుంబానికి అయిదు జర్మన్ షెపర్డ్ కుక్కులను సైన్యానికి అందించినట్టు చెప్పారు. నారాహెన్‌పిటలోని తన నివాసంలో బ్రిగేడియర్ ఎ.ఎ.అమరసకేరాకు అప్పగించారు డాక్టర్ షిరు విజేమన్నే. వీటికి పేలుడు పదార్థాల నిర్మూలన (ఈఓడి), శ్రీలంక ఇంజనీర్స్ (ఎస్ఇఎల్) స్క్వాడ్రన్‌లో కొన్ని వారాల పాటు ప్రత్యేక శిక్షణన ఇవ్వనున్నామని సైన్యం తెలిపింది. -
కదంతొక్కిన జాగిలాలు
న్యూఢిల్లీ: 26 ఏళ్ల తర్వాత జాగిలాల కవాతు రిపబ్లిక్ డే పరేడ్‌కే హైలైట్‌గా నిలిచింది. 24 లాబ్రాడార్, 12 జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన (మొత్తం 36) శునకాలు రాజ్‌పథ్ రోడ్డు జరిగిన పరేడ్‌లో పాల్గొన్నాయి. భారత సైన్యంలోని 1,200 జాగిలాల నుంచి వీటిని ఎంపిక చేశారు. ఇవి సైన్యంలో ప్రమాదకర వస్తువుల గుర్తింపుతోపాటు, గార్డ్, పెట్రోలింగ్ డ్యూటీ చేస్తాయి. జాగిలాల పరేడ్‌ను ప్రేక్షకులు కేరింతలతో ప్రోత్సహించారు. అప్రమత్తత, దూకుడు, సంకేతాలను అమలు పరిచే తీరు ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు రిమౌంట్ వెటర్నరీ కోర్కు చెందిన కెప్టెన్ అనురాగ్ బొరువా తెలిపారు. ‘ఈసారి పరేడ్‌లో జాగిలాల కవాతు నిర్వహించాలన్నది విధానపరమైన నిర్ణయం. ఆపరేషన్‌లో భాగంగా ఇవి అప్రమత్తంగా ఉండి.. ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడతాయి’ అని మరో అధికారి చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన జాగిలాలకు, వాటి శిక్షకులకు శౌర్యచక్ర అవార్డులు అందించారు. ఇంతవరకు ఆరు సేనా మెడల్స్‌తోపాటు 500లకు పైగా పతకాలను ఈ వెటర్నరీ కోర్ అందుకున్నాయి. గత ఆగస్టులో సరిహద్దుగుండా చొరబాటుకు ప్రయత్నించిన సాయుధ బలగాలను గుర్తించి వారిని అడ్డుకునే క్రమంలో నాలుగేళ్ల మన్సీ (లాబ్రాడార్) తోపాటు దీని శిక్షకుడు బషీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పాయారు.