breaking news
gas problems
-
లో-ఫోడ్మ్యాప్తో గ్యాస్‌కు చెక్!
-
Health Tips: గ్యాస్ సమస్యా... అరటి, పల్లీలు, ఫిష్ తింటున్నారా.. అయితే..
కింది నుంచి గ్యాస్ పోవడం చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం. ఎవరికీ చెప్పుకోలేని బాధ కూడా. అయితే ‘లో–ఫోడ్మ్యాప్’ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ ఆహారం ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘లో–ఫోడ్మ్యాప్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. ‘ఫర్మెంటబుల్ ఆలిగో శాకరైడ్స్’, ‘డై–శాకరైడ్స్’, ‘మోనో–శాకరైడ్స్’, ‘పాలీయాల్స్’ అనే రకాల ఆహారాల ముందు మాటలను కలిపి అవి ఓ సంక్షిప్తాక్షరం(ఏక్రోనిమ్)గా రూపొందించడం వల్ల ఏర్పడిన పదమే ‘ఫోడ్మ్యాప్’. ఆయా పదార్థాలు తక్కువగా ఉండే ఆహారమే ‘లో–ఫోడ్మ్యాప్’ న్యూట్రిషన్. వీటిని బట్టి తీసుకోవాల్సిన, తీసుకోకూడని పదార్థాలేమిటో చూద్దాం. ►ప్రధానాహారాలుగా- వరి అన్నం, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ ►పండ్లలో- అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ ►వెజిటబుల్స్‌లో- క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో ►ప్రోటీన్లలో- చికెన్, ఫిష్ ►నట్స్‌లో- పల్లీలు, వాల్నట్స్ వంటివి తీసుకోవాల్సిన పదార్థాలు. అలాగే తీసుకోకూడని పదార్థాలు: ►పాస్తా, కేక్ బిస్కెట్స్, పండ్లలో పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్‌లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్స్, ప్రోటీన్స్‌లో బీన్స్, సోయాబీన్స్ వంటివి. వీటి నుంచి దూరంగా ఉండాలి. ►ఈ తరహా ఆహారాలలో తీసుకోవల్సినవి తీసుకుంటూ, మిగతావాటికి దూరంగా ఉండటం వల్ల కిందినుంచి గ్యాస్‌పోయే సమస్యతో పాటు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. చదవండి: Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు, చికెన్ తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల.. Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! -
పండుగ పూట గ్యాస్ కష్టాలు
గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: పండుగ పూట ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇంట్లోవారితో సంతోషంగా ఉండాల్సిన పండగనాడు గ్యాస్ దొరకకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వా పోతున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా సిలిండర్లు గ్యాస్ సిలిం డర్లు ఇవ్వకపోవడంతో గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పండుగకు గ్యాస్ వస్తుందని ఏజెన్సీ చుట్టూ తిరుగుతన్న వినియోగదారులకు నిరాశ మిగిలింది. గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ శేషుమా గ్యాస్ ఏజెన్సీకి నాలుగురోజుగా గ్యాస్ కోసం వినియోగదారులు తిరుగుతున్నారు. ఎప్పడొచ్చినా ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ లేదని చెబుతు నాలుగు రోజులుగా తిప్పుకుంటున్నారని మం డిపడ్డారు. గ్యాస్ కోసం ముందుగా బుక్ చేసుకున్నా సిలిండర్లు అందించడంలో నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా గ్యాస్ సిలిండర్ కోసం వచ్చిన వినియోగదారులకు ఏజెన్సీ బంద్ చేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశా రు. గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న గజ్వేల్- ప్రజ్ఞాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని ఏజెన్సీ నిర్వాహకులను పిలిపించి సమస్యను పరిష్కరించడంతో ఆందోళన విరమించారు.