breaking news
earnings growth
-
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్‌నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు
ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (ఐటీ–బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019–20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని నాస్కామ్ వివరించింది. భవిష్యత్ అంచనాలకు సంబంధించి పరిశ్రమ ఆశావహంగానే ఉన్నప్పటికీ కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణే కొనసాగించనున్నట్లు నాస్కామ్ చైర్మన్ కేశవ్ మురుగేశ్ విలేకరులకు తెలిపారు. 43.6 లక్షల మంది సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు కచ్చితంగా ఎంత స్థాయిలో ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు చెప్పారు. అయితే, సరఫరా వ్యవస్థలో చైనా కీలక దేశం కావడంతో క్లయింట్లపైనా, ఫలితంగా పరిశ్రమపైనా పరోక్ష ప్రభావాలు ఉండొచ్చన్నారు. మెషీన్ లెర్నింగ్‌తో ప్రయోజనమే: చంద్రశేఖరన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు ప్రయోజనకరమేనని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. -
భారత మార్కెట్లు మెరుగ్గా రాణిస్తాయ్
♦ కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ... ♦ గోల్డ్‌మాన్ శాక్స్ నివేదిక న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ సంస్థల ఆదాయాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతుందని, ఇతర దేశాలతో పోచ్చితే రికవరీ వేగంగా ఉటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ఓ నివేదికలో తెలిపింది. సమీప కాలంలోనే వాస్తవిక అభివృద్ధికి అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. బీఎస్ఈ 200 కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేక అంశంగా పరిగణించలేదని ఈ సంస్థ స్పష్టం చేసింది. సూక్ష్మ ఆర్థిక రంగంలో రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని, ఆదాయాల్లో వృద్ధి వేగంగా ఉంటుందని స్పష్టంచేసింది. భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తాయని తన పరిశోధన నివేదికలో గోల్డ్‌మాన్ శాక్స్ తెలిపింది. అయితే, వ్యవసాయ రంగ ప్రాతినిథ్యం తగినంత లేకపోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల వ్యయాలు పెరిగిపోవడం సమీప కాలంలో వృద్ధికి సవాళ్లుగా పేర్కొంది. ‘ఐదు వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత గత రెండు త్రైమాసికాల్లో ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ కంపెనీల లాభాలు 9, 7 శాతం చొప్పున ఉన్నాయి. పూర్తి ఏడాదికి 10 శాతం ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో భారత ఈక్విటీలపై మేము ఇప్పటికీ అధిక వెయిటేజీనే కలిగి ఉన్నాం. వృద్ధి, రికవరీ సరైన మార్గంలోనే ఉన్నాయి. వార్షిక చక్రగతిన 2016-17 సంవత్సరంలో ఎంఎస్సీఐ ఇండియా సూచీలో భాగమైన కంపెనీల ఈపీఎస్ వార్షిక వృద్ధి 12 శాతం వుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇదే గరిష్టం’ అని నివేదిక పేర్కొంది.