breaking news
Distribution of rice
-
ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం!
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోటా కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ, తర్వాత హుజూర్‌నగర్‌ను ఖరారు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ గోడౌన్ (స్టేజ్–1 స్టాక్ పాయింట్)ల నుంచి మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ఒక్కో యూనిట్‌కు (ఒక్కరికి) 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. ఏటా 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు దొడ్డు బియ్యమే అందుతు న్నాయి. రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రతా కార్డులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు (ఐఎఫ్ఎస్సీ) 54.48 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.62 లక్షల కార్డులు ఉండగా, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 90.14 లక్షల కార్డుల్లోని 2.83 కోట్ల యూనిట్లకు (మందికి) ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి 90.14 లక్షల కార్డులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. వీటికి తోడు ఇప్పటికే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, విద్యా సంస్థలకు కేటాయిస్తున్న బియ్యం కూడా కలిపి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) చొప్పున సన్నబియ్యం అవసరం ఉంది. అంటే సంవత్సరానికి 24 ఎల్ఎంటీలు అవసరమన్నమాట. వానాకాలం సీఎంఆర్ సిద్ధం వానాకాలంలో సేకరించిన సుమారు 55 ఎల్ఎంటీల ధాన్యంలో 24 ఎల్ఎంటీల మేర సన్న ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిన ప్రభుత్వం గత నవంబర్ నెలాఖరు నుంచే సన్న బియ్యాన్ని సేకరించే పనిలో ఉంది. తొలుత జనవరి (సంక్రాంతి) నుంచే సన్న బియ్యం ఇవ్వాలని భావించినప్పటికీ, కొత్తగా వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తే అన్నం ముద్దగా అవడం, అడుగంటడం వంటి పరిణామాలు ఉంటాయనే భావనతో రెండు మూడు నెలలు మాగపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లలో భద్రపరుస్తూ కొత్త బియ్యం పాతబడేలా చూశారు. ఈ నేపథ్యంలో జనవరి వరకు మిల్లింగ్ చేసి సేకరించిన సుమారు 5 ఎల్ఎంటీల బియ్యాన్ని ఉగాది నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ కోటా కింద సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని పేర్కొంటూ మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బియ్యం అక్రమ దందాకు కళ్లెం! రేషన్ షాపుల ద్వారా ఇప్పటివరకు అందుకుంటున్న దొడ్డు బియ్యంలో 60 నుంచి 70 శాతం వరకు దురి్వనియోగం అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని ఉచితంగా తీసుకుంటూ రూ.10కి కిలో చొప్పున రేషన్‌షాపుల్లోనే విక్రయించే పద్ధతి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది. ఇక ఇంటికి తీసుకెళ్లినా వంటకు వినియోగించకుండా దళారులకు కిలో రూ.10 నుంచి రూ.13 చొప్పున విక్రయించడం, దాన్ని దళారులు రాష్ట్రాలు దాటించడమో లేక రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు విక్రయించడమో చేయడం పరిపాటిగా మారింది. అయితే పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
రేషన్ కేటాయింపులో ఏపీకి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని 60 శాతం బీపీఎల్ కుటుంబాలకే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తూ అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో 76 శాతం బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, వంగా గీతావిశ్వనాథ్, ఎన్.రెడ్డెప్ప మీడియాతో మాట్లాడారు. మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ కేంద్రానికి సంబంధం లేకుండా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రత పథకాల కింద ఏపీకి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు పొంతనలేదన్నారు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా ‘కేంద్రం నుంచి తీసుకునే రేషన్ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ..’ అంటూ ఈనాడు, ఇతర పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్పారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో డోర్ డెలివరీ విధానంలో రేషన్ అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.54 కోట్ల బీపీఎల్ కుటుంబాలుండగా కేంద్రం 89 లక్షల కార్డుదారులకు మాత్రమే బియ్యం కేటాయిస్తోందని చెప్పారు. మిగిలిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం వల్ల ఏటా రాష్ట్రంపై రూ.3 వేల కోట్ల భారం పడుతోందన్నారు. బియ్యం కోటా పెంచాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. రేషన్ పంపిణీలో మిగులు బియ్యం తర్వాత నెలకు సర్దుబాటవుతుందని, దాన్ని విస్మరించి బియ్యం కేటాయింపులపై కేంద్రం పార్లమెంటులో తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరమని చెప్పారు. దీనిపై సంబంధిత మంత్రిని స్పష్టత కోరతామని ఆయన తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగిందని నీతి ఆయోగ్ చైర్మన్ అంగీకరించారు ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కేంద్రం మూడేళ్ల వివరాలు అందించడంలో క్లరికల్ పొరపాటు జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈనాడు తదితర పత్రికల్లో వార్తల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సమాచారం కన్నా మరింత తప్పుడు సమాచారం జోడించి కథనాలు ప్రచురించడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీడీఎస్ లెక్కల గణనలో ఏపీకి అన్యాయం జరిగిందని 2020–21లో నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించగా నీతి ఆయోగ్ చైర్మన్ కూడా అంగీకరించారని ఆమె గుర్తుచేశారు. -
బియ్యం నాణ్యతపై రాజీపడొద్దు
సాక్షి, అమరావతి: వచ్చే ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకింగ్ చేసిన బియ్యం పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న పైలెట్ ప్రాజెక్టు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్ బియ్యం పంపిణీపై ప్రజల స్పందన బాగుందని అధికారులు తెలిపారు. రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గోడౌన్లలో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు తదితర అంశాలను సీఎం జగన్ సమీక్షించారు. ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన బియ్యాన్ని ప్యాక్ చేసి ఇంటివద్ద అందించాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ బియ్యం నాణ్యత పరిశీలించే ఏర్పాట్లు చేయాలన్నారు. బియ్యాన్ని పంపిణీ చేసే ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి ఇచ్చేలా అవగాహన కల్పించాలని, లేదంటే వాటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సీఎం అధికారులకు సూచించారు. -
హామీలను నిలబెట్టుకున్నాం..
-
మాటిచ్చా.. పాటించా
నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్ రూ.10 వేలకు పెంచాం. స్టేజి –3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తాం. – సీఎం వైఎస్ జగన్ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’...అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజలకు గట్టి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే ‘‘నేను నెరవేర్చా..’’ అని అభినందనలు అందుకుంటున్నారు. ఒక్కొక్క హామీని వడివడిగా అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీతో ముఖ్యమంత్రి జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాసే దుస్థితికి స్వస్తి పలికారు. కిడ్నీ వ్యాధులతో తల్లడిల్లుతున్న ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మూత్రపిండ సమస్యలతో అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు స్టేజ్–3 దశ నుంచే నెలకు రూ.5,000 చొప్పున ప్రత్యేక పెన్షన్‌ను ప్రకటించారు. కిడ్నీ పేషెంట్లు, వారి సహాయకులకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తిత్లీ తుపాన్ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీని ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు. మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీని 50 శాతం పెంచి మాట నిలబెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్టేజ్ – 3 దశ నుంచే వారికి పెన్షన్‌ను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్ అందచేస్తామని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (సీకేడీ) బారిన పడ్డ ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్‌ను నియమిస్తామని, కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్ పాస్ అందిస్తామని చెప్పారు. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు, పలాసలో రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్ సెంటర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గడపగడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.... స్టేజి –3 నుంచి రూ.5 వేలు ‘స్పెషల్’ పింఛన్ నా పాదయాత్రలో ప్రతి ఒక్కరు చాలా ఆవేదనతో చెప్పిన ఆ మాటలు గుర్తున్నాయి. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదని, డబ్బులు సరిపోవడం లేదని చెప్పారు. మీరు చెప్పిన ఆ ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితుల పింఛన్ రూ.10 వేలకు పెంచుతూ సంతకం చేశా. కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ తెస్తానని ఆరోజే చెప్పా. చెప్పినట్లే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. ఈ ఆసుపత్రి పెట్టడమే కాదు కిడ్నీ బాధితులకు ఇంకా మంచి చేయడానికి అడుగులు వేస్తాం. స్టేజి 5 స్థాయిలో డయాలసిస్ జరుగుతున్న పేషంట్లకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. మీ డాక్టర్ (ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు) కోరిక మేరకు స్టేజి–3 దశ నుంచి కిడ్నీ బాధితులకు స్పెషల్ ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేల చొప్పున పింఛన్ ఇస్తామని ప్రకటిస్తున్నాం. కిడ్నీ బాధితులను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పడమే కాదు చేసి చూపిస్తాం. ప్రతి 500 మంది సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్‌ను ఈరోజు నుంచే నియమిస్తున్నాం. హెల్త్ వర్కర్లు కిడ్నీ పేషెంట్లకుతోడుగా ఉంటారు. కిడ్నీ పేషంట్లతోపాటు ఒక అటెండెంట్‌కు కూడా ఉచితంగా బస్ పాస్ ఇస్తాం. ల్యాబ్‌ల్లో టెస్టులు కూడా ఉచితంగా చేస్తారు. ఇక మీదట నాణ్యమైన మెడిసిన్లు అందుబాటులోకి తెస్తాం. ఆ పరిస్థితి రాకూడదంటే.. ఒక మనిషి కిడ్నీ సమస్యలతో బాధపడకుండా చూడాలంటే అందుకు మూల కారణాలు, ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలనే దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. అది జరగాలంటే మొత్తం ఉద్దానం ప్రాంతమంతటికీ శుద్ధ జలాలు అందాలి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని 827 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లో ప్రతి ఒక్కరికీ నేరుగా శుద్ధమైన తాగునీరు అందించేందుకు రూ.600 కోట్లతో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పలు పథకాలు ప్రవేశపెట్టాం. మత్స్యకారుల కోరిక మేరకు జెట్టీ నిర్మాణం ఆ రోజు నా పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్ జెట్టీ కావాలని అడిగారు. వారి విన్నపాలను గత పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చా. ఈరోజు మంచినీళ్లపేట, నువ్వులరేవులో ఫిషింగ్ జెట్టీ పెడుతున్నాం. మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతోపాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తాం. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన హాలు ఏర్పాటు చేస్తాం. షెడ్డులు, బాత్రూమ్లు నిర్మిస్తాం. మార్కెట్ చేసుకునేందుకు అనుమతి ఇస్తాం. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి తెస్తాం. మత్స్యకార దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తెచ్చాం. ఎస్టీ కుల ధ్రువీకరణకు వన్‌మ్యాన్ కమిషన్ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు మాకు ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా అని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు నేను మర్చిపోలేదు. ఆ రోజే చెప్పా నేను విన్నాను... నేను ఉన్నాను అని. వారికి మంచి చేసేందుకు వన్‌మ్యాన్ కమిషన్‌ను జేసీ శర్మ ఆధ్వర్యంలో నియమిస్తున్నాం. బుడగ జంగాల వాళ్లకు కూడా ఒక మాట చెప్పాం. వీరిద్దరి సమస్యలను పరిగణనలోకి తీసుకొని మంచి చేసేందుకు జేసీ శర్మ కమిషన్ జీవో నంబర్. 104 నిన్ననే జారీ చేశారని చెబుతున్నా. సంక్షేమ ప్రణాళిక .. మా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ వేదిక నుంచి సగర్వంగా చెబుతున్నా. మా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి మాటను ఒక ఖురాన్‌లా, ఒక భగవద్గీతలా, ఒక బైబిల్లా భావిస్తామని ఆ రోజు చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తున్నామని మరోసారి సగర్వంగా చెబుతున్నా. ఇందులో భాగంగానే ఈ సెప్టెంబర్ చివరికల్లా ఆటో, ట్యాక్సీలను సొంతంగా నడుపుకొనే ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వనున్నాం. అవ్వా తాతల పెన్షన్ కూడా రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్తాం. అక్టోబర్ 15న రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున ఇస్తాం. ప్రతి పథకం డోర్ డెలివరీ.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలో 4 లక్షల ఉద్యోగాలిచ్చాం. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ వలంటీర్లను నియమించాం. వీరికి రూ.5 వేల చొప్పున వేతనం అందిస్తున్నాం. పింఛన్ దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా, అమ్మ ఒడి నుంచి రైతు భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ఎవరి చుట్టూ తిరగకుండా, లంచాలివ్వాల్సిన పనిలేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి మీ తలుపుతట్టి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని సగర్వంగా చెబుతున్నాం. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. ప్రతి పథకం డోర్ డెలివరీ చేస్తాం. పింఛను కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా... మరే పథకం కావాలన్నా వలంటీర్లే నేరుగా దరఖాస్తు చేయిస్తారు. రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ 50 శాతం పెంపు సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్ 21న చేపట్టనున్నాం. డీజిల్ సబ్సిడీ ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక అవస్థలు పడుతున్న ప్రతి మత్స్యకారుడికి చెబుతున్నా. ప్రతి జిల్లాలో కొన్ని బంకులను ఎంపిక చేస్తున్నాం. ఇక్కడ బెండి వద్ద ఉన్న బంకులో మత్స్యకారులు డీజిల్ తీసుకుంటే అక్కడే సబ్సిడీ అందుతుంది. రూ.6 ఉన్న సబ్సిడీని 50 శాతం పెంచి రూ.9 చొప్పున ఇస్తాం. డిసెంబర్ 21న నేరుగా చేనేత కుటుంబాల ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తాం. జనవరి 26న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి రూ.15 వేలు చొప్పున తల్లుల చేతికి అందిస్తాం. పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం. లాడ్జింగ్, బోర్డింగ్ కింద విద్యార్థికి రూ.20 వేలు చొప్పున అందజేస్తాం. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ.. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తాం. వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పరుగులు తీయిస్తామని ఇదే వేదిక నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నారాయణ పురం ఆనకట్ట, తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల్లో ముందడుగు వేస్తామని మాటిస్తున్నా’’ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, పార్టీ నాయకులు తలశిల రఘురాం, ఉన్నతాధికారులు జవహర్‌రెడ్డి, కోన శశిధర్, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం శ్రీకాకుళం జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీ పథకానికి పలాస సభలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ‘నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో బియ్యం పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. రేషన్ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారం పంపిణీ ఏడాది క్రితం తిత్లీ తుపాన్లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని పలాస సభలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్టుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచాం. శుక్రవారం నుంచే మిగతావారికి కూడా చెక్కుల పంపిణీ మొదలవుతుంది’ అని తెలిపారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పంచాయతీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) చేరుకుని రూ.28 కోట్లతో నిర్మించిన అకడమిక్ భవనం, వసతి గృహం, మెస్‌తోపాటు పైలాన్‌ను ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్షయపాత్ర వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో విశాఖకు తిరుగుపయనమయ్యారు. అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు... షాపులు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఫిబ్రవరి చివరి వారంలో రూ.10 వేలు చొప్పున ఇస్తాం. మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు చేయూత అందిస్తాం. ఉగాది రోజు అక్కచెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. ఏప్రిల్ 2 శ్రీరామనవమి సందర్భంగా పెంచిన వైఎస్సార్ పెళ్లి కానుక పథకం అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు పెంచి ఇవ్వబోతున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులను నేరుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాలో వేస్తాం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే డబ్బులు పాత అప్పుల కింద జమ కాకుండా నేరుగా వారికే దక్కేలా చేస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారు. నేను అందుకు భిన్నంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపిస్తున్నా. నామినేటేడ్ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెచ్చాం. మాట ప్రకారం శంకుస్థాపన... పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, సమగ్ర రక్షిత మంచినీటి పథకాల శంకుస్థాపన సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు ‘‘మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి తోడు, దీవెనలతో ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 సీట్లలో అఖండ మెజార్టీతో గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓటుబ్యాంకుతో మీ తమ్ముడిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు శిరస్సు వంచి పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు. 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో తిరిగా. మీ సమస్యలను విన్నాను, చూశాను. ఆరోజు మీకు నేనున్నా అని చెప్పా. వంద రోజులు తిరగక ముందే ఈరోజు మళ్లీ మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపన చేయగలుగుతున్నానంటే.. మీరంతా ఇచ్చిన ఈ గౌరవానికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా. -
అంగన్వాడీలకు రేషన్ ద్వారా బియ్యం
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం వేలిముద్రల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 72 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సూపర్వైజర్ల ఆధార్‌తోపాటు వేలిముద్రలను ఈ–పాస్ మెషీన్లకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో అనుసంధానం చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో శుక్రవారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా ప్రక్రి య, అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని అకున్ సభర్వాల్ సూచించారు. కాగా, రేషన్‌షాపుల ద్వారా వేలిముద్రలతో బియ్యం సరఫరాతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
రేషన్ డీలర్లపై కేసులు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై తహశీల్దార్ వెంకటిశివ కేసులు నమోదు చేయించారు. ఆయన సోమవారం దొప్పెర్ల, నునపర్తి, గండివానిపాలెం, మడుతూరు రేషన్డిపోలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గండివానిపాలెంలో డీలర్ నాగులపల్లి కన్నయ్య బియ్యం పంపిణీలో చేతివాటం చూపించారు. బియ్యం తూయడానికి కిలో బరువైన ఇనుప డబ్బాని వినియోగించారు. డబ్బా బరువును తూనిక రాళ్లవైపు చూపించడానికి గుడ్డలతో తయారు చేసిన మూటను కట్టారు. చూసేవారికి సక్రమంగా ఉన్నట్టు కనిపించింది. తూనికలో కిలో తరుగు వస్తోంది. పదికిలోలు ఇచ్చేవారికి ఐదుకిలోల వంతున రెండుదఫాలు తూయడంతో లబ్దిదారుడికి ఎనిమిది కిలోలే అందాయి. మడుతూరులో డీలర్ శ్రీను ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా, ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుపడబ్బా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాతో 20 గ్రాముల తరగు వచ్చింది. ఇనుప డబ్బాతో కిలో తరుగు వచ్చింది. తనిఖీ సమయంలో ఇనుపడబ్బా వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. మడుతూరు, దోసూరు పంచాయతీల రేషన్‌డిపోలను ఈయన నిర్వహిస్తున్నారు. తహశీల్దార్ ఇద్దరి డిపోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను బాధితులకు సరుకుల పంపిణీ బాధ్యత విఆర్ఓలకు అప్పగించారు. ఇద్దరిపై కేసు పెట్టినట్టు ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. విజిలెన్స్ తనిఖీలు సోమవారం మాకవరపాలెం మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం గ్రామాల్లో ఉన్న రేషన్‌డిపోలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని షాపు నంబర్ 17లో డీలర్ బియ్యం కొలతల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు. శెట్టిపాలెంలో రేషన్‌డిపోలో కాకుండా వేరొక ప్రదేశంలో సరుకులు నిల్వచేసినట్టు గుర్తించి డీలర్‌ను హెచ్చరించారు. దీంతో డీలర్ అక్కడి నుంచి సరుకులను డిపోకు తరలించారు. డీలర్ సస్పెన్షన్ నక్కపల్లి మండలం బంగారయ్యపేట రేషన్‌డిపో డీలర్ చేపల జ్యోతిపై సస్పెన్షన్ వేటుపడింది. డీలర్ కార్డుదారుల నుంచి రూ.20లు చొప్పున వసూలు చేయడం, బియ్యంలో కోత విధించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. సోమవారం డిప్యూటీ తహశీల్దార్లు లక్ష్మీనరసమ్మ, రమాదేవి, ఆర్ఐ రమలు గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామస్తులంతా డీలర్ పాల్పడుతున్న అక్రమాలను విచారణాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిపోలో స్టాకు పరిశీలించగా ఏడు క్వింటాళ్ల 80 కిలోల బియ్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్టు విచారణాధికారులు తెలిపారు. బంగారయ్యపేటకు ఇన్చార్జ్గా డీఎల్‌ఫురం డీలర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు వారు తెలిపారు. తూనికల్లో తేడా కె.కోటపాడు మండలంలోని ఆనందపురం, కె.సంతపాలెం, గొల్లలపాలెం, చంద్రయ్యపేట, కింతాడ, ఆర్లి గ్రామాలలో గల రేషన్ డిపోలలో విజిలెన్స్ ఎస్ఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆనందపురం, కె.సంతపాలెం గ్రామాల రేషన్ డిపోల్లో తూనికల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.