‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’...అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజలకు గట్టి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లోనే ‘‘నేను నెరవేర్చా..’’ అని అభినందనలు అందుకుంటున్నారు. ఒక్కొక్క హామీని వడివడిగా అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీతో ముఖ్యమంత్రి జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాసే దుస్థితికి స్వస్తి పలికారు.