breaking news
discontinent
-
‘అసైన్డ్’ రిజిస్ట్రేషన్ల నిలిపివేత
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కారు చర్యలకు దిగింది. యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. యాజమాన్య హక్కులు పొందిన తర్వాత రిజి్రస్టేషన్లు జరగని లేదా ఎలాంటి లావాదేవీలు జరగని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన భూములపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పేర్కొంది.ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శనివారం కలెక్టర్లు, రిజి్రస్టార్లు, సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల వల్ల అనర్హులు లబ్ధి పొందారని, రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సెక్షన్ 22ఏకి విరుద్ధంగా హక్కులిచ్చారని అందులో పేర్కొన్నారు. సామాజిక, పోరంబోకు భూములపై అక్రమంగా హక్కులిచ్చారని, అనంతరం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులిచి్చన చోట్ల విచారణ నిర్వహించి దీనిద్వారా ఎక్కడైనా భూకబ్జాలు జరిగాయా? హక్కుల నిర్థారణలో వాస్తవికత ఉందో లేదో నిర్థారించేందుకు వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.మూడు నెలలో వెరిఫికేషన్ పూర్తి కావాలని, ఇందుకోసం కలెక్టర్లు విచారణ సంస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఏ కేసులోనైనా యాజమాన్య హక్కుల కల్పన అక్రమంగా జరిగినట్లు తేలితే వాటిని రద్దు చేసి ఆ భూమిని తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చేలా రీ క్లాసిఫికేషన్ చేయాలని ఆదేశించారు. యాజమాన్య హక్కులిచి్చన భూములను ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఇకపై వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సూచించారు. విచారణలో యాజమాన్య హక్కులు సక్రమంగానే ఇచి్చనట్లు తేలినా వాటిపై రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. -
టీఆర్ఎస్పై మెతకవైఖరి ఎందుకు?
బీజేపీపై నాగం అసంతృప్తి నేడు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం టీడీపీ నుంచి నాగంకు ఆహ్వానం..? హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తున్నా, లోపాలను ఎత్తిచూపే అవకాశమున్నా.. ప్రజల వైపు నుంచి మాట్లాడటంలో బీజేపీ విఫలమవుతుండడంపై ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌తో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశమున్నా.. అధికార టీఆర్ఎస్పై మెతక వైఖరితో ఉన్నామని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, హామీల అమల్లో వైఫల్యం, ఉద్యమకారులకు ద్రోహం వంటివాటిపై సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను నిలదీయవచ్చని నాగం వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు మౌనంగా ఉంటే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మంచిదికాదని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. కరెంటు ఇవ్వలేమంటూ రైతులను భయపెట్టి, పంటలు వేయకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటోందని నాగం విమర్శిస్తున్నారు. వీటిపై మాట్లాడాలంటే పార్టీ కార్యాలయంలో చాలా పరిమితులున్నాయని, మాట్లాడకుంటే ప్రజలకు నష్టం జరుగుతుందని నాగం పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై పార్టీ కార్యాలయం వేదికపై కాకుండా ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాట్లాడాలని నాగం జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. సొంతంగా రాజకీయవేదిక? పార్టీ కార్యాలయం బయట విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తుండటంతో.. నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగం ఒకవేళ బీజేపీని వీడితే ఎటువైపు అడుగులు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. సొంత రాజకీయ వేదికతో ప్రభుత్వంపై పోరాడాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీలో చేరాలంటూ నాగం జనార్దన్‌రెడ్డికి ఆహ్వానం అందుతున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో టీడీపీలో చేరాలా, వద్దా అనేదానిపై నాగం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సన్నిహితులు చెబుతున్నారు. బయట మాట్లాడితే తప్పేమీ లేదు: కిషన్‌రెడ్డి ప్రెస్‌క్లబ్ వంటి వేదికపై పార్టీ నేతలు మాట్లాడితే తప్పేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా ప్రెస్‌క్లబ్‌లో వందలసార్లు మాట్టాడినట్టుగా చెప్పారు. నాగం పార్టీతో రోజూ మాట్లాడుతూనే ఉన్నాడని, ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ నాగం సలహా, సూచనల మేరకే తాము వ్యవహరించామని.. ఆయన అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు.