breaking news
D Ed colleges
-
613 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: అక్రమాలకు పాల్పడుతున్న 613 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ డీఎడ్ (డైట్స్) కాలేజీలు 14 ఉండగా ప్రైవేటువి 780 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే కారణంతో 167 కాలేజీల గుర్తింపును పాఠశాల విద్యా శాఖ రద్దు చేసింది. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వీటిలో కొన్ని మళ్లీ ఈ ఏడాది గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. అయితే అవి సమర్పించిన పత్రాలు తప్పుడువని తేలడంతో వాటికి గుర్తింపు ఇవ్వలేదు. డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్–2022 ప్రవేశ పరీక్షలు ఇటీవల జరిగాయి. వీటికి 5,800 మంది హాజరు కాగా 4,800 మంది అర్హత సాధించారు. ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దవడంతో ఈసారి డీఎడ్ కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ కాలేజీలకే పరిమితం చేయనున్నారు. ఈ కాలేజీల్లో వివిధ మాధ్యమాలు, సబ్జెక్టుల కోర్సులలో సీట్లు 2 వేల వరకు ఉన్నాయి. గతంలో అర్హులు లేకున్నా అనేక అక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు అక్రమాలమయంగా మారాయి. ఏటా కోట్లాది రూపాయలు ముడుపులు వెళ్లేవి. గతంలో ఏటా డీఈఈసెట్‌కు 60 వేల మంది వరకు దరఖాస్తు చేసేవారు. వీరిలో అర్హత మార్కులు సాధించే వారి సంఖ్య 5 వేల లోపే ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడంతో కాలేజీలు లెక్కకు మించి ఉండేవి. 2014–15 నాటికి రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు 505 ఉండగా వాటిలో 26,350 సీట్లు ఉండేవి. 2018లో వీటి సంఖ్య 869కి చేరింది. 2019కు వచ్చేసరికి 1,043కి పెరిగిపోయింది. సీట్లు 65 వేలకు చేరాయి. డీసెట్ రాసే వారి సంఖ్యే 50వేల లోపు. వారిలో అర్హత సాధించే వారి సంఖ్య 5 వేలకు మించదు. సీట్లు భర్తీ కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించేవి. దీంతో అర్హత మార్కులు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడేవి. డీసెట్‌లో ఓసీ, బీసీలకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. అప్పుడే డీఎడ్‌లో సీటు వస్తుంది. అయితే, ఈమేరకు మార్కులు సాధించే వారు కరువవడంతో కాలేజీలు అప్పటి అధికార పార్టీ నేతలు కొందరికి భారీగా ముడుపులిచ్చేవి. దీంతో అర్హత మార్కులను ఓసీ, బీసీలకు 35 శాతానికి తగ్గించేవారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిగా ఎత్తివేసేవారు. అయినా సగానికిపైగా సీట్లు మిగిలేవి. వీటి భర్తీకి యాజమాన్యాలు అడ్డదారులు తొక్కేవి. డీసెట్‌లో అర్హత సాధించని వారితో పాటు అసలు డీసెట్‌కు దరఖాస్తు చేయని వారిని కూడా చేర్చుకొనేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇలాం టి అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. 2020–20 21లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ బ్యాచ్‌లో అక్రమ పద్ధతిలో చేరిన దాదాపు 25వేల మంది విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థ్ధులు నష్టపోరాదన్న మానవతా దృక్పథంతో వారికి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు ఆ కాలేజీల అనుమతులను రద్దు చేసింది. -
ఇష్టారాజ్యంగా మేనేజ్మెంట్ సీట్ల భర్తీ
రాజమండ్రి రూరల్ : జిల్లాలోని డీఎడ్ కళాశాలలు ఇష్టానుసారంగా మేనేజ్మెంట ్సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. డీసెట్ కన్వీనర్ షరతులను సైతం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేసిన సీట్లకు అభ్యర్థుల నుంచి బిల్డింగ్ఫీజు పేరుతో వేలాది రూపాయలు గుంజుతున్నారు. జిల్లాలో 40 డీఎడ్ కళాశాలలు ఉండగా వాటిలో ఐదు కళాశాలకు 100 సీట్లు, 35 కళాశాలకు 50 సీట్లు చొప్పున ఉన్నాయి. ఇందులో 80 శాతం కన్వీనర్ కోటాలో ప్రభుత్వం డీఎడ్ మొదటి ఏడాదికి భర్తీ చేయగా, మిగిలిన 20 శాతం మేనేజ్మెంట్ ఆధీనంలో ఉంటాయి. వీటిని ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. జిల్లాలో చాలామంది కళాశాలల యాజమాన్యాలు డీసెట్ కన్వీనర్ నిబంధనలను పట్టించుకోవడంతో పాటు కళాశాలలకు తరగతులకు హాజరు కాకుండా పరీక్షలు రాసేందుకు వచ్చేలా అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఇలా కన్వీనర్ కోటాలో భర్తీ అయిన అభ్యర్థులు కూడా అధికసంఖ్యలో పరీక్షలు రాసేందుకు వచ్చేలా అదనంగా సొమ్ములు చెల్లించిన ట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విద్యా పండితులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గత ఏడాది ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేసిన తప్పిదాలకు రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు దూరమైన విషయం తెలిసిందే. వారికి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీసెట్ కన్వీనర్ తాజా ఆదేశాలు ఇవే .. ఓసీ, బీసీ విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందేందుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం పైగా మార్కులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. డీసెట్ ఎంట్రన్స్ టెస్టులో 40 శాతం పైగా మార్కులు వచ్చిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఇంటర్మీడియెట్‌లో 45 శాతంపైగా మార్కులు, డీసెట్ ఎంట్రన్స్‌లో 35 శాతం మించి మార్కులు పొంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న విద్యార్థులకు యాజమాన్యాలు తమ కళాశాల మేనేజ్మెంట్ కోటాలను భర్తీ చేసుకోవాలని డీసెట్ కన్వీనర్ సూచించారు.