breaking news
court complex
-
పాక్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ (నవంబర్ 11, మంగళవారం) జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగింది. అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ఈ బాంబు దాడి మధ్యాహ్నం 12.39 గంటలకు జరిగిందని తెలిపారు.కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? ఆత్మాహుతి దాడా? పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళ్తుండగా.. గేటు సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని.. అక్కడ రెండు మృతదేహాలు పడి ఉన్నాయని న్యాయవాది రుస్తుమ్ మాలిక్ ఏఎఫ్‌పీ మీడియా తెలిపారు. కాగా, ఈ పేలుడు సంభవించిన కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. అడ్డుకున్న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.ఇటీవల పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అక్టోబర్ 9న కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడులకు ఇస్లామాబాద్ బాధ్యత వహించిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ దాడిలో పలువురు మరణించగా, ప్రతీకార చర్యలు చేపడతామని కాబూల్ హెచ్చరించింది. అనంతరం జరిగిన సరిహద్దు ఘర్షణల్లో పలు సంఖ్యల్లో సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. -
వీడియో: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్
భోపాల్: ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది. భారతి పటేల్(23) అనే ఆవిడ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్ భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలో ఆమె తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్ వెంటపడి మరీ దాడి చేశాడు. భగవాన్, భారతి పటేల్ వెంట పడుతూ కోర్టు సముదాయంలోనే చితకబాదాడు. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గురువారం ఈ ఘటన జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు భగవాన్ సింగ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ తెలిపారు. Shameful... Lawyer ran and beat woman in Shahdol court premises, woman's child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj — Subham Anand (@anand_subham1) May 6, 2022 -
పెళ్లై 8 నెలలు.. కోర్టు ఆవరణలో పోలీసు బలవన్మరణం
సాక్షి, చెన్నై: పని భారమా, కుటుంబ కష్టమా ఏమోగానీ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి గన్‌మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం కృష్ణగిరి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి రైల్వే కాలనీకి చెందిన అన్బరసన్(29) సాయుధ విభాగంలో పోలీసు. కృష్ణగిరి మొదటి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కలైమదికి గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చిన అన్బరసన్ గురువారం ఉదయాన్నే న్యాయమూర్తి కలై మదితో కలిసి ఆయకోట్టై రోడ్డులోని కోర్టుకు వచ్చాడు. న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లిపోవడంతో తాను అక్కడి మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి పైకి లేచిన అన్బరసన్ హఠాత్తుగా తుపాకీని నెత్తిపై పెట్టుకుని కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్దంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అటు వైపు అందరూ పరుగులు తీశారు. రక్తపు మడుగులో అన్బరసన్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కృష్ణగిరి ఎస్పీ పాండి గంగాధర్, ఏడీఎస్పీ అన్బు, డీఎస్పీ శరవణన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. విచారణలో అన్బరసన్‌కు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. అతడి భార్య నాలుగు నెలల గర్భవతిగా తేలింది. కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే, పనిభారంతో బలన్మరణానికి పాల్పడ్డాడా లేదా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
కోర్టు క్లాంపెక్స్ కోసం స్థల పరిశీలన
రాజంపేట: జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఆదేశాల మేరకు జిల్లా మూడవ అదనపు జడ్జి ఎం.తిరుమలరావు శుక్రవారం కోర్టు క్లాంపెక్స్ కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అఫిషియల్క్లబ్, సబ్ కలెక్టరేట్ క్యాంపస్‌లోని ఖాళీ స్థలాలను, స్థానిక తహసీల్దారు కార్యాలయాలను పరిశీలించారు. జడ్జి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది అఫిషియల్ క్లబ్ భవనం, క్రీడాస్థలం, సబ్ కలెక్టరులోని నూనివారిపల్లె వైపు ఖాళీ స్థలం, సబ్‌జడ్జి బంగళా, మెజిస్ట్రేట్ బంగళాను సర్వే చేపట్టి కొలతలు తీసుకున్నారు. అన్ని స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి, కోర్టు క్లాంపెక్స్‌కు ఏదీ ఆమోదయోగ్యమో దాన్ని జిల్లా జడ్జి, హైకోర్టుకు నివేదించనున్నారు. ఈ సందర్భంగా అఫిషియల్ క్లబ్ సభ్యులు రామచంద్రరాజు, శివారెడ్డి, సుధాకరరెడ్డి, వాసు, బాలరాజు తదితరులు అఫిషియల్ క్లబ్ వ్యవస్థ, దాని విశిష్టత, దాని ప్రస్తుత అవసరం గురించి ఏడీజేకి విన్నవించారు. ఏడీజే వెంట రాజంపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఏజీపీ లక్ష్మీనారాయణ, పీపీ వెంకటస్వామి, న్యాయవాదులు ఎబీ సుదర్శనరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, కత్తి సుబ్బరాయుడు, వీవీరమణ, శ్రీనువాసరాజు, నాసురుద్దీన్, జఫురుద్దీన్, కేవీరమణ, తదితరులు పాల్గొన్నారు. . . -
కోర్టులో మానసిక రోగి హల్చల్
కొచ్చి: కేరళలోని కొచ్చి కోర్టు కాంప్లెక్సులో ఓ మానసిక రోగి నాలుగు గంటల పాటు హల్చల్ చేశాడు. కోర్టు భవనం మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని కిందికి దించడానికి నానా తంటాలు పడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతన్ని కిందకు రమ్మని ఎంత విజ్ఞప్తి చేసినా వినలేదు. పైగా మరింత గందరగోళం సృష్టించాడు. చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి దూకుతూ, భవనంపై ఉన్న పెంకులను పోలీసుల మీదికి, జనాల మీదికి విసిరాడు. ఈ సందర్భంగా 4 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పెద్దఎత్తున జనం గుమిగూడారు. 4 గంటల తరువాత ఎట్టకేలకు పోలీసులు అతడిని కిందికి దించడంలో సఫలమయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో కొద్ది సేపు విధులకు ఆటంకం కలిగింది. హిందీ మాట్లాడుతున్న అతగాడిని అదుపులోకి తీసుకున్నామని కొ చ్చి సెంట్రల్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోర్టు ముందు హాజరు పర్చిన అనంతరం మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అతడి వివరాలను చెప్పడానికి మాత్రం నిరాకరించారు. -
కేజ్రీవాల్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ద్వారకా జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన ప్రసంగించకుండా న్యాయమూర్తి అడ్డుకున్నారు. కోర్టు ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దని చురక అంటించారు. ద్వారకా కోర్టు బార్ అసోసియేషన్(డీసీబీఏ) కోర్టు ప్రాంగణంలో కేజ్రీవాల్ సభ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి రవీందర్ కౌర్ కోర్టు ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదిక కాకుండా చూడాలని పోలీసులను, సిబ్బందిని ఆదేశించారు. సభకు అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో జడ్జికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగి, నినాదాలు చేశారు.


