breaking news
Columbus Zoo
-
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
తొలి గొరిల్లా వయస్సు ఎంతో తెలుసా?
-
తొలి గొరిల్లా వయస్సు ఎంతో తెలుసా?
అమెరికాలో ఓల్డెస్ట్ గొరిల్లాగా (ఎక్కువకాలం బతికిఉన్న) పేరొందిన కోలో 60 ఏట అడుగుపెట్టింది. ప్రతిష్టాత్మక కొలంబస్ జూలో ఉండే కోలో కి చాలా ఘనతలు ఉన్నాయి. కోలో ముగ్గురు పిల్లలకు తల్లి, 16 గొరిల్లాలకు అమ్మమ్మ, 12 గొరిల్లాలకు ముని అమ్మమ్మ( తాతమ్మ), మరో ముగ్గురికి ముత్తవ్వ. కోలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూలలో పుట్టిన మొదటి గొరిల్లా. కోలో ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి మాలిగ్నెంట్ ట్యూమర్ ను తొలగించారు. ప్రస్తుతం కోలో ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గురువారం 60 ఏట అడుగుపెట్టిన సందర్భంగా అనేక మంది కోలో ను చేసేందుకు జూ కు వచ్చారు. హ్యాపీ బర్త్ డే కోలో అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కోలో ఉండే ఎన్‌క్లోజర్ ను కలర్ ఫుల్ గా డెకరేట్ చేసి కేక్స్ తో నింపారు.